Gopichand : గోపీచంద్ సినిమాలో కొత్త ప్రయోగం.. 'ప్రేమదేశం' హీరో అబ్బాస్‌కు ఛాన్స్ !

Updated on Jun 23, 2022 12:10 PM IST
అబ్బాస్ (Abbas).. ఈ పేరు వినగానే మనకు టక్కున గుర్తొచ్చే సినిమా 'ప్రేమదేశం'. తమిళంలో 'కాదల్ దేశం' పేరుతో నిర్మితమైన ఈ చిత్రం.. తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది.
అబ్బాస్ (Abbas).. ఈ పేరు వినగానే మనకు టక్కున గుర్తొచ్చే సినిమా 'ప్రేమదేశం'. తమిళంలో 'కాదల్ దేశం' పేరుతో నిర్మితమైన ఈ చిత్రం.. తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది.

అబ్బాస్ (Abbas).. ఈ పేరు వినగానే మనకు టక్కున గుర్తొచ్చే సినిమా 'ప్రేమదేశం'. తమిళంలో 'కాదల్ దేశం' పేరుతో నిర్మితమైన ఈ చిత్రం.. తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ తర్వాత అబ్బాస్ తెలుగులో చాలా సినిమాలు చేశాడు. 

విఐపి, రాజహంస, ప్రియా ఓ ప్రియా, అనగనగా ఓ అమ్మాయి లాంటి చిత్రాలు అబ్బాస్‌కు (Abbas) మంచి పేరు తీసుకొచ్చాయి. తర్వాత సహాయ నటుడిగా కూడా అబ్బాస్ (Abbas) రాణించాడు. రాజా, అనసూయ, నీ ప్రేమకై, శ్వేతనాగు, ఇదీ సంగతి, బ్యాంక్ లాంటి చిత్రాలలో ఈయన విభిన్నమైన పాత్రలు పోషించాడు.  

అబ్బాస్.. చాలా రోజుల తర్వాత మళ్లీ వెండితెరకు.. 

అయితే, గత చాలా సంవత్సరాల నుండి అబ్బాస్ నటనకు దూరమయ్యాడు. అప్పుడప్పుడు పలు ప్రకటనలలో నటించడం తప్ప, పెద్దగా ఇతడు సినిమాలు ఏవీ చేయడం లేదు. అయితే ఈ మధ్య కాలంలో అబ్బాస్‌కు  తెలుగులో భారీ ఆఫర్ వచ్చిందని టాక్. గోపీచంద్ (Gopichand) హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో అబ్బాస్ కీలక పాత్ర పోషిస్తున్నారట.

శ్రీవాస్ (Sriwaas) దర్శకత్వంలో ప్రస్తుతం గోపీచంద్ (Gopichand) ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సినిమాలో అబ్బాస్‌కు ఒక స్పెషల్ రోల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తాజాగా నటుడు జగపతిబాబును కూడా ఇదే సినిమాలో ఓ ముఖ్యమైన రోల్ కోసం దర్శకుడు ఎంపిక చేశారు. డింపుల్ హయతీ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. అలాగే అలనాటి కథానాయిక ఖుష్బూ కూడా ఓ ప్రధాన పాత్రలో నటిస్తోంది. 

ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ చిత్రానికి, విశ్వ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గోపిచంద్‌కు వరుస హిట్లు ఇచ్చిన ఘనత దర్శకుడు శ్రీవాస్‌కు ఉంది. 

గోపీచంద్‌కు గాయాలు

ఇటీవలే శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్న సినిమా షూటింగ్‌లోనే గోపీచంద్  (Gopichand) కు గాయాలయ్యాయి. కర్ణాటకలోని మైసూరులో ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే, పెద్ద ప్రమాదం ఏమీ జరగలేదని తర్వాత నిర్మాతలు సోషల్ మీడియా వేదికల ద్వారా, ఆ సమాచారాన్ని గోపీచంద్ అభిమానులతో పంచుకున్నారు.

ఏదేమైనా ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుల కొరత ఏర్పడింది. దీంతో దర్శకులందరూ పాతతరం నటులను అందరినీ లైన్‌లో పెడుతున్నారు. సినిమాకు కొత్తదనం తీసుకొచ్చేందుకే ఈ ప్రయత్నం అని తెలుస్తోంది. ఏదేమైనా, గోపీచంద్ (Gopichand) సినిమాతో అబ్బాస్ మళ్లీ తెలుగు సినిమాలలో ఛాన్స్ కొట్టేడం అనేది తన కెరీర్‌కు బాగానే హెల్ప్ అవుతుందని చెప్పవచ్చు. 

అంచనాలు పెంచుతున్న పక్కా కమర్షియల్

ఇక గోపీచంద్ (Gopichand) విషయానికి వస్తే, ఈయన నటించిన ఆఖరి సినిమా 'సిటీమార్'. ఈ సినిమా ఫర్వాలేదనిపించింది. ప్రస్తుతం గోపీచంద్ (Gopichand) 'పక్కా కమర్షియల్' చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో రాశిఖన్నా కథానాయిక. 

అలాగే సత్యరాజ్, అనసూయ, రావు రమేష్, అజయ్ ఘోష్, సప్తగిరి 'పక్కా కమర్షియల్' చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బన్నీ వాస్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయగా, మారుతి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. జేక్స్ బిజాయ్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. 

Read More: రెమ్యునరేషన్‌ విషయంలో తగ్గేదేలే.. నేను ‘పక్కా కమర్షియల్’ : హీరో గోపీచంద్‌ (Gopichand)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!