సప్తగిరి కాళ్లు పట్టుకోబోయిన బాలకృష్ణ (Balakrishna)!...  సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోన్న వీడియో

Updated on Sep 10, 2022 05:55 PM IST
స‌ప్త‌గిరి డైలాగు బాగుందంటూ బాల‌కృష్ణ (Balakrishna) మెచ్చుకున్నారు. దండం పెట్టాలంటూ కాళ్లు ప‌ట్టుకునేందుకు స‌ర‌ద‌గా ప్ర‌య‌త్నించారు.
స‌ప్త‌గిరి డైలాగు బాగుందంటూ బాల‌కృష్ణ (Balakrishna) మెచ్చుకున్నారు. దండం పెట్టాలంటూ కాళ్లు ప‌ట్టుకునేందుకు స‌ర‌ద‌గా ప్ర‌య‌త్నించారు.

టాలీవుడ్ న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ (Balakrishna) పైకి గాంభీరంగా క‌నిపించినా.. మ‌న‌సు మాత్రం వెన్న‌పూస లాంటిద‌ని అంద‌రూ అంటుంటారు. బాల‌కృష్ణ‌, స‌ప్త‌గిరిల మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ వీడియోలో బాల‌కృష్ణ స‌ప్త‌గిరి కాళ్లు ప‌ట్టుకునేందుకు య‌త్నించారు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఈ విజువ‌ల్స్ వైర‌ల్‌గా మారాయి. 

స‌ప్త‌గిరితో స‌ర‌దాగా బాల‌య్య‌

ప్ర‌స్తుతం బాల‌కృష్ణ (Balakrishna) ద‌ర్శ‌కుడు గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఎన్‌బీకే 107 చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ షూటింగ్‌లో న‌టుడు స‌ప్త‌గిరి కూడా ఉన్నారు. సప్తగిరితో క‌లిసి బాల‌కృష్ణ‌ ఓ ఫన్నీ టాస్క్ చేశారు. సప్తగిరితో కలిసి బాల‌కృష్ణ‌ భారీ డైలాగ్ చెప్పారు.

బాల‌కృష్ణ ఆ డైలాగును మ‌ధ్య‌లో ఆపేశారు. మిగిలిన డైలాగు స‌ప్త‌గిరి పూర్తిచేశారు. స‌ప్త‌గిరి డైలాగు బాగుందంటూ బాల‌కృష్ణ మెచ్చుకున్నారు. అంతేకాదు నీకు దండం పెట్టాలంటూ కాళ్లు ప‌ట్టుకునేందుకు స‌ర‌ద‌గా ప్ర‌య‌త్నించారు బాల‌కృష్ణ‌. ఈ విజువ‌ల్స్ సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.  

స‌మ్మ‌ర్‌లో రిలీజ్ కానున్న సినిమా

'ఎన్‌బీకే 107' సినిమాలో బాలకృష్ణ జోడిగా శృతీహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. 'ఎన్‌బీకే 107' షూటింగ్ దాదాపు పూర్త‌యింద‌నే టాక్. ఈ సినిమాకు ఎస్‌.ఎస్‌ థమన్ సంగీతం అందిస్తున్నారు. వేస‌విలో సినిమా రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు. ఇక వేస‌విలో బాల‌కృష్ణ ప‌వ‌ర్ ఫుల్ డైలాగులు థియేట‌ర్ల‌లో పేల‌నున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌‌పై 'ఎన్‌బీకే 107' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

Read More: NBK 107: బాల‌కృష్ణ (Balakrishna) కొత్త లుక్‌ను పోస్ట్ చేసిన ద‌ర్శ‌కుడు.. ట‌ర్కీలో 'ఎన్‌బీకే 107' షూటింగ్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!