NBK 107: బాల‌కృష్ణ (Balakrishna) కొత్త లుక్‌ను పోస్ట్ చేసిన ద‌ర్శ‌కుడు.. ట‌ర్కీలో 'ఎన్‌బీకే 107' షూటింగ్!

Updated on Aug 30, 2022 02:31 PM IST
ద‌ర్శ‌కుడు గోపిచంద్ మాలినేని ద‌ర్శ‌క‌త్వంలో బాల‌కృష్ణ‌  (Balakrishna)  'ఎన్‌బీకే 108' సినిమాలో న‌టిస్తున్నారు.  ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ ట‌ర్కీలో జ‌రుగుతోంది.
ద‌ర్శ‌కుడు గోపిచంద్ మాలినేని ద‌ర్శ‌క‌త్వంలో బాల‌కృష్ణ‌  (Balakrishna)  'ఎన్‌బీకే 108' సినిమాలో న‌టిస్తున్నారు.  ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ ట‌ర్కీలో జ‌రుగుతోంది.

టాలీవుడ్‌లోకి హీరోగా అడుగుపెట్టి నంద‌మూరి  బాల‌కృష్ణ (Balakrishna) 48 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకున్నారు. పౌరాణిక, జానపద, చారిత్రాత్మక, భక్తిరస, సాంఘిక చిత్రాల‌లో బాల‌కృష్ణ న‌టించి మెప్పించారు. 'అఖండ'తో బ్లాక్ బాస్ట‌ర్ హిట్ సాధించిన బాల‌కృష్ణ వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నారు. ద‌ర్శ‌కుడు గోపిచంద్ మాలినేని ద‌ర్శ‌క‌త్వంలో బాల‌కృష్ణ‌ 'ఎన్‌బీకే 108' సినిమాలో న‌టిస్తున్నారు. గోపిచంద్ బాల‌య్య‌తో దిగిన ఫోటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

బాల‌య్య‌ ఫోటో వైర‌ల్

బాల‌కృష్ణ (Balakrishna) త‌న 107వ సినిమాను ద‌ర్శ‌కుడు గోపీచంద్ మాలినేని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ ట‌ర్కీలో జ‌రుగుతోంది. బాల‌కృష్ణ‌, శృతి హాసన్‌ల‌తో ఓ పాట‌ను చిత్రీక‌రించేందుకు చిత్ర యూనిట్ ట‌ర్కీ వెళ్లింది. మంచు కొండ‌ల్లో జ‌రుగుతోన్న షూటింగ్‌కు సంబంధించి గోపిచంద్ ఓ ఫోటోను త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. 

ట్రయో సెల్ఫీలో నందమూరి బాలకృష్ణ, హీరోయిన్ శృతి హాసన్, దర్శకుడు గోపీచంద్ మలినేని ఉన్నారు. బాల‌కృష్ణ లుక్ చూసి అభిమానులు స‌ర్‌ప్రైజ్ అయ్యారు. యంగ్ లుక్‌లో బాల‌య్య క‌నిపించారు. 'ఎన్‌బీకే 107' షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుగుతోంది. ఇటీవ‌ల క‌ర్నూలులో కొన్ని సీన్ల‌ను చిత్రీక‌రించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై 'ఎన్‌బీకే 107'ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. 

స‌మ్మ‌ర్‌లో బాల‌య్య సినిమా రిలీజ్

బాల‌కృష్ణ (Balakrishna) సినిమా 'ఎన్‌బీకే 107' సినిమాను 2023 ఏప్రిల్ 7న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు నటిస్తున్న 'ఎస్ఎస్ఎంబీ 28' సినిమాను 2023 ఏప్రిల్ 28న రిలీజ్ చేయ‌నున్నారు. ఈ రెండు సినిమాలు వ‌రుసగా రిలీజ్ కానున్నాయి. ఇప్పటికే ఎన్‌బీకే 107 నుంచి రిలీజ్ అయిన‌ పోస్టర్లు, టీజర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈ సినిమాతో బాల‌కృష్ణ  అఖండ విజ‌యం సాధిస్తార‌ని అభిమానులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Read More : 'ఎన్‌బీకే 107' (NBK 107) రిలీజ్ తేదీ ఫిక్స్ అయిన‌ట్టేనా!..మోత మోగ‌నున్న బాల‌కృష్ణ (Balakrishna) డైలాగులు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!