Varun Tej-Sujeeth: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథ సిద్దం చేస్తున్న 'సాహో' డైరెక్టర్ సుజీత్..!

Updated on Jun 27, 2022 04:13 PM IST
వరుణ్ తేజ్, దర్శకుడు సుజీత్ (Varun Tej, Director Sujeeth)
వరుణ్ తేజ్, దర్శకుడు సుజీత్ (Varun Tej, Director Sujeeth)

Varun Tej: ఎప్ప‌టిక‌ప్పుడు ప్రేక్ష‌కుల‌కు త‌న న‌ట‌న‌ను కొత్త‌గా తెర‌మీద ఆవిష్క‌రిస్తూ సినీరంగంలో దూసుకుపోతున్న హీరో మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్. భారీ అంచనాలతో వచ్చిన 'గని' నిరాశపరచినా 'F3' సక్సెస్ కావడంతో రిలాక్స్ అయ్యాడు వరుణ్ తేజ్. నెక్స్ట్ దర్శకుడు ప్రవీణ్ సత్తారుతో మూవీ ఓకే చేశారు. ఇది యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తుండగా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో వ‌రుణ్ బాడీగార్డ్‌గా క‌నిపించ‌నున్నాడ‌ట‌. ఇదిలా ఉంటే వ‌రుణ్ మ‌రో ద‌ర్శ‌కుడిని లైన్ లో పెట్టిన‌ట్లు తెలుస్తోంది. 

‘ర‌న్ రాజా ర‌న్‌’, ‘సాహో’ (Saaho Movie) వంటి సినిమాల‌ను తెర‌కెక్కించిన సుజీత్‌తో వ‌రుణ్‌తేజ్ త‌న 13వ సినిమాను చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే వీళ్ళిద్ద‌రి మ‌ధ్య క‌థా చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయ‌ట‌. సాహో త‌ర్వాత సుజీత్ ఇప్ప‌టివ‌ర‌కు మ‌రో సినిమా చేయ‌లేదు. మ‌ధ్య‌లో చిరుతో సినిమా అంటూ వార్త‌లు వ‌చ్చాయి. కానీ అది సెట్స్‌పైకి వెళ్ళ‌లేదు. వ‌రుణ్‌తో చేయ‌బోయే సినిమా యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ నేపథ్యంలో రూపొంద‌నున్న‌ట్లు టాక్‌. దీనిపై అధికారికంగా ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

'సాహో' మూవీ పోస్టర్ (Saaho Movie Poster)

పవన్ కల్యాణ్ (Power star Pawan Kalyan) హీరోగా ఒక రీమేక్ మీద సుజీత్  కొన్ని రోజులు స్క్రిప్ట్ వర్క్ చేశారు. అది ముందు సెట్స్ మీదకు వెళుతుందా? లేదంటే వరుణ్ తేజ్ సినిమా ముందు స్టార్ట్ అవుతుందా? అనేది కొన్ని రోజుల్లో తెలుస్తుంది. 'సాహో' తర్వాత మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే అవకాశం యువ దర్శకుడు సుజీత్‌కు వచ్చింది. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న 'గాడ్ ఫాదర్' స్క్రిప్ట్ మీద ఆయన కొన్ని రోజులు వర్క్ చేశారు. ఆ తర్వాత ఎందుకో సుజీత్ దర్శకత్వంలో సినిమా సెట్స్ మీదకు వెళ్ళలేదు. తర్వాత రామ్ చరణ్, సుజీత్ కలయికలో సినిమా అని వినిపించింది. హిందీలో షారుఖ్ ఖాన్ హీరోగా సినిమా అని వినిపించింది. అది కూడా ఓకే కాలేదు. 

కాగా, ఒకే ఒక్క మూవీ దర్శకుడు సుజీత్ (Director Sujeeth) కెరీర్ ని పాతాళంలోకి నెట్టింది. రెండో చిత్రంతోనే భారీ పాన్ ఇండియన్ మూవీని తెరకెక్కించే బాధ్యత తీసుకున్న సుజీత్ పూర్తి స్థాయిలో విజయం సాధించలేకపోయాడు. సాహో మూవీ తెలుగుతో పాటు సౌత్ ఇండియా ప్రేక్షకులకు నచ్చలేదు. ప్రభాస్ నుంచి  బాహుబలి తర్వాత వస్తున్న సినిమా కావడంతో సాహోపై భారీగా హైప్ ఏర్పడింది. ఒక విధంగా చెప్పాలంటే బాహుబలికి మించిన హైప్ సాహోకు వచ్చింది. సాహో ట్రైలర్, టీజర్స్ కూడా సినిమాపై అంచనాలు పెరగడానికి కారణమయ్యాయి. 

 

'సాహో' మూవీ పోస్టర్ (Saaho Movie Poster)

అయితే, తీరా సాహో విడుదలయ్యాక ప్రేక్షకులు పెదవి విరిచారు. హాలీవుడ్ తరహా స్క్రీన్ ప్లే, టేకింగ్ తో తెరకెక్కిన ఈ చిత్రం మన ప్రేక్షకులకు ఎక్కలేదు. దీంతో సాహో ప్లాప్ టాక్ తెచ్చుకుంది. అయితే బాలీవుడ్ (Bollywood) లో మాత్రం ఈ చిత్రం వసూళ్ల దుమ్ముదులిపింది. హిందీలో సాహో ఏకంగా రూ.150 కోట్ల వసూళ్లు రాబట్టింది. మొత్తంగా సాహో రూ. 430 కోట్ల వరల్డ్ వైడ్ వసూళ్లు అందుకుంది. భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన నేపథ్యంలో అనేక చోట్ల సాహో నష్టాలు మిగిల్చింది. 

Read More: Mega Hero Varun Tej: షారుఖ్ తో నటించడానికి సిద్దమే.. బాలీవుడ్ ఎంట్రీ గురించి వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!