F3 : థియేటర్ల వద్ద సందడి చేసిన ఎఫ్ 3 చిత్ర యూనిట్.. వీడియో వైరల్!
మెగా హీరో వరుణ్ తేజ్, విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) కలిసి నటించిన తాజా చిత్రం ఎఫ్3. ‘ఎఫ్2’ కి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. ‘ఎఫ్2’ సూపర్ హిట్ అయ్యింది కాబట్టి ‘ఎఫ్3’ కూడా సూపర్ హిట్ అవుతుంది అని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. ఈ చిత్రంలో వెంకటేష్ రేచీకటితో బాధపడే వ్యక్తిగా కనిపించబోతున్నాడు. ఇక వరుణ్ తేజ్ అయితే నత్తితో బాధపడే వ్యక్తిగా కనిపించబోతున్నాడు.
ఈ సినిమా నేడు (మే 27)న థియేటర్లో విడుదలయిన విషయం తెలిసిందే. ఈ మేరకు చిత్ర యూనిట్ అంతా కలిసి థియేటర్లో ఈ సినిమాను వీక్షించారు. దీంతో ఈ చిత్ర హీరోలు వెంకటేష్, వరుణ్ తేజ్ (Varun Tej) హైదరాబాద్ లో ని ఓ థియేటర్ కి వెళ్లి మీడియా కంట పడ్డారు. ఇక, నేడు విడుదలైన ఈ సినిమా తొలి ఆట నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో థియేటర్ బయట ప్రేక్షకులు ఈ హీరోలకు బ్రహ్మరథం పట్టారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక ఈ సినిమా విడుదల సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వరుణ్ తేజ్ (Varun Tej) 'ఎఫ్ 3' సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇందులో భాగంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ ఎఫ్ 2 సినిమా షూటింగ్ సమయంలోనే ఎఫ్ 3 సినిమాను తీయాలి అని అనుకున్నామని వరుణ్ తెలిపాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి బాధ్యతను దర్శకుడు అనిల్ రావిపూడి తీసుకున్నారని తెలిపాడు ఈ మెగా హీరో.అలాగే ఎఫ్ 3 సినిమా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని ధీమా వ్యక్తం చేశాడు.