Varun Tej: యాక్ష‌న్ ఎంట‌ర్టైనర్ గా ప్ర‌వీణ్ స‌త్తారు-వ‌రుణ్ తేజ్ సినిమా.. అప్ డేట్స్ త్వ‌ర‌లో!

Updated on Jun 01, 2022 04:17 PM IST
ప్ర‌వీణ్ స‌త్తారుతో సినిమా పూజాకార్య‌క్ర‌మాల్లో వ‌రుణ్ తేజ్ (Varun Tej)
ప్ర‌వీణ్ స‌త్తారుతో సినిమా పూజాకార్య‌క్ర‌మాల్లో వ‌రుణ్ తేజ్ (Varun Tej)

Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన కామెడీ ఎంటర్టైనర్ ఎఫ్ 3 చిత్రం ఇటీవ‌లే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఎఫ్ 3 చిత్రం మంచి టాక్ సొంతం చేసుకుందంటూ సోషల్ మీడియాలో ఇప్పటికే కామెంట్స్ వస్తున్నాయి. కాగా.. వరుణ్ తేజ్, విక్టరీ వెంకటేష్ తో కలిసి ఈ చిత్రంలో నటించారు. ఎఫ్ 2 తరహాలోనే ప్రేక్షకులు మంచి వినోదాన్ని అందించేందుకు వీరిద్ద‌రూ రెడీ అయ్యారు. అయితే, వరుణ్ తేజ్ గత చిత్రం ‘గని’ (Ghani) అభిమానుల్ని తీవ్రంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఎఫ్ 3 ప్రచార కార్యక్రమాల్లో వరుణ్ తేజ్ తన నెక్స్ట్ మూవీ గురించి ఆస‌క్తిక‌ర‌ అప్ డేట్ ఇచ్చాడు. 

కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) దర్శకత్వంలో ఒక సినిమా ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఇదొక యాక్షన్ థ్రిల్లర్. స్టయిలిష్ యాక్షన్ ఫిలిమ్స్ తీయడంలో ప్రవీణ్ సత్తారు తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పటి వరకు తీసిన సినిమాలతో కంపేర్ చేస్తే నెక్స్ట్ లెవల్ అన్నట్టు ఈ సినిమా ఉంటుందట. వచ్చే నెల లండన్ లో షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే... ఈ సినిమాలో విలన్ గా తమిళ్ హీరోని కన్ఫర్మ్ చేశారు. కాగా, ప్రవీణ్ సత్తారు ప్రతిభ ఉన్న దర్శకుడు. గరుడ వేగ లాంటి సీరియస్ యాక్షన్ డ్రామాని అద్భుతంగా తెరకెక్కించాడు. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు కింగ్ నాగార్జునతో ఘోస్ట్ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ కంప్లీట్ కాగానే వరుణ్ తేజ్ మూవీ సెట్స్ పైకి వెళుతుంది. ఈ చిత్రం ఎక్కువ భాగం లండన్ లోనే షూటింగ్ జరుగుతుందని వరుణ్ తెలిపాడు. 

ఈ సినిమాను యస్వీసిసి బ్యానర్ పై బీవీయస్ యన్ ప్రసాద్ (BVSN Prasad) నిర్మించ‌న్నారు. మార్చిలో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా లాంచ్ అయింది. కాగా, ఈ సినిమాకి మెగా బ్ర‌ద‌ర్ నాగబాబు (Nagababu) సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె మేయర్ (Mickey j mayor) సంగీతం అందిస్తున్నారు. ఇందులో సాక్షి వైద్య హీరోయిన్ గా న‌టించ‌బోతోంది. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల రెండో వారంలో ప్రారంభం కానుందనే వార్తలు వ‌స్తున్నాయి.

అయితే, ప్రవీణ్ సత్తారు  ప్రస్తుతం నాగార్జున తో ‘ది ఘోస్ట్’ (The Ghost) అనే యాక్షన్ థ్రిల్లర్‌ను తెరకెక్కిస్తున్నాడు. ఇందులో నాగ్ ఎఫ్‌బీఐ (FBI) ఏజెంట్‌గా నటిస్తుండగా.. కథానాయికగా సోనాల్ చౌహాన్ మెరవబోతోంది. అయితే ఈ సినిమా విడుదల కాకుండానే..  వరుణ్ తేజ్ (Varun Tej) సినిమాను పట్టాలెక్కించేలా ప్లాన్ చేస్తున్నాడు ప్రవీణ్ సత్తారు. ఈ సినిమా ఒకటి రెండు షెడ్యూల్స్ పూర్తయిన తర్వాతనే ‘ది ఘోస్ట్’ మూవీ విడుదల ఉంటుందని చెబుతున్నారు. కాగా.. ఘోస్ట్ మూవీ షూటింగ్ చివరి దశకి చేరుకుంది. 

కాగా, వరుణ్ తేజ్ కెరీర్ లోనే  మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం (PanIndia Movie) ఇదే కావడం విశేషం. పాన్ ఇండియా మార్కెట్ తగ్గట్టుగానే ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేసే ఉద్దేశంతో మేకర్స్ ఉన్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమాను జూన్‌లో ప్రారంభించి ఈ ఏడాది చివరిలో విడుదల చేయబోతున్నట్టు సమాచారం అందుతోంది. కాగా, ఈ సినిమాపై మరిన్ని వివరాలు వచ్చే నెల‌లో తెలియబోతున్నాయి. 

ఇదిలా ఉంటే.. వరుణ్ తేజ్ (Varun Tej) యాక్షన్ మూవీని ఎంచుకుని సాహసం చేస్తున్నాడనే చెప్పాలి. ఈ హీరోకి యాక్షన్ చిత్రాలు అంతగా కలసి రావడం లేదు. వరుణ్ చివరగా నటించిన గని బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలైంది. ఆయ‌న‌కి ఎక్కువగా ప్రేమ కథ, కామెడీ, ఫీల్ గుడ్ చిత్రాలతోనే విజయాలు దక్కాయి. ఫిదా, తొలిప్రేమ, ఎఫ్2 ఆ కోవకు చెందినవే. అంతరిక్షం ప్రయోగాత్మక చిత్రంగా మిగిలిపోయింది కానీ బాక్సాఫీస్ వద్ద రాణించలేదు. అయినప్పటికీ వరుణ్ ఏమాత్రం తగ్గకుండా మరో యాక్షన్ మూవీని ఎంచుకున్నాడు. మరి ప్రవీణ్ సత్తారు అయినా వరుణ్ తేజ్ యాక్షన్ ముచ్చట నెరవేరుస్తాడో లేదో చూడాలి.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!