Salaar: స‌లార్ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌కుంటే సూసైడ్ చేసుకుంటా: ప్ర‌భాస్ ఫ్యాన్

Updated on May 11, 2022 10:59 PM IST
Salaar:ప్ర‌భాస్ కొత్త సినిమా  స‌లార్ నుంచి అప్‌డేట్ ఇవ్వ‌క‌పోతే చ‌నిపోతానంటూ సూసైడ్ నోట్ రాశాడు.
Salaar:ప్ర‌భాస్ కొత్త సినిమా స‌లార్ నుంచి అప్‌డేట్ ఇవ్వ‌క‌పోతే చ‌నిపోతానంటూ సూసైడ్ నోట్ రాశాడు.

Salaar:ప్ర‌భాస్ కొత్త సినిమా స‌లార్ నుంచి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయాలంటూ ఓ అభిమాని డిమాండ్ చేస్తున్నాడు. స‌లార్ నుంచి అప్‌డేట్ ఇవ్వ‌క‌పోతే చ‌నిపోతానంటూ సూసైడ్ నోట్ రాశాడు. పోలీసులు అభిమాని లెట‌ర్‌పై రియాక్ట్ అయ్యారు. 

కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ప్ర‌భాస్‌తో స‌లార్ (Salaar) సినిమా తీస్తున్నారు. కేజీఎఫ్‌తో బాక్సాఫీస్ షేక్ చేసిన డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ తీస్తున్న స‌లార్‌పై ప్ర‌భాస్ అభిమానులు హై రేంజ్ హిట్ కోరుకుంటున్నారు. స‌లార్ నుంచి అప్‌డేట్స్ ఇవ్వాలంటున్నారు. 

స్టార్ హీరోల‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ‌.  ఫ్యాన్స్ కోసం లేటైనా లేటుస్టుగా సినిమా ప్రజెంట్ చేయాని హీరోలు అనుకుంటారు.  మా సినిమా గొప్పంటే మా సినిమా గొప్పంటూ చొక్కాలు చించేసుకుంటారు. గొడ‌వ‌లు ప‌డిపోతుంటారనే సాహో డైలాగుల‌ను ఫాలో అవుతున్నారు ప్ర‌భాస్ ఫ్యాన్స్. ప్ర‌భాస్ డై హార్డ్ ఫ్యాన్ స‌లార్ (Salaar) సినిమా కోసం ఏం చేశాడో తెలుసుకుంటే షాక్ అవ్వాల్సిందే. 

స‌లార్ సినిమా గ్లింప్స్‌ మే నెల‌లోనే రిలీజ్ చేయాల‌ని ప్ర‌భాస్ అభిమాని ప‌ట్టుబ‌ట్టాడు. ఏకంగా స‌లార్ డైరెక్ట‌ర్‌కే లెట‌ర్ రాశాడు. లెట‌ర్ అంటే మాములు లెట‌ర్ కాదు.. సూసైడ్ లెట‌ర్. స‌లార్ నుంచి మేలో అప్ డేట్ ఇవ్వ‌కుంటే ఆత్మ‌హ‌త్య చేసుకుంటాన‌ని లేఖ రాశాడు. ఇలాంటి బెదిరింపు లేఖ‌ను చూసి హైద‌రాబాద్ పోలీసులు రియాక్ట్ అయ్యారు. ఆ అభిమాని ఎవ‌రో తేల్చే ప‌నిలో ఉన్నారు. ఇలాంటి ఫ్యాన్స్ వ‌ల్ల త‌మ హీరో ప‌రువు పోతుంద‌ని ప్ర‌భాస్ అభిమానులు ఫీల్ అవుతున్నారు. 

ప్ర‌భాస్ ప్ర‌స్తుతం పాన్ ఇండియా సినిమాల‌పై ఫోక‌స్ పెట్టారు.ఆది ప‌రుష్ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్  జ‌రుగుతున్నాయి. స‌లార్‌, ప్రాజెక్ట్ కె చిత్రాలు సెట్స్‌పై ఉన్నాయి. కేజీఎఫ్ బ్లాక్ బాస్ట‌ర్ హిట్ కొట్టిన డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ తీస్తున్న స‌లార్(Salaar) అంద‌రిలో ఆస‌క్తి పెంచింది. కోవిడ్ కార‌ణంగా స‌లార్ అప్ డేట్ లేదు. ఆ త‌ర్వాత వాయిదాలు వేస్తూ వ‌చ్చారు. రాధేశ్యామ్‌తో నిరాశ ప‌డిన ప్ర‌భాస్ అభిమానులు స‌లార్ అప్‌డేట్ కోసం ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. స‌లార్ అప్‌డేట్ త్వ‌ర‌గా వ‌స్తుందేమో చూడాలి. 
 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!