Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన తొలి సినిమా టాప్ 10 విశేషాలివే
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అంటే తెలియని తెలుగు సినీ ప్రేక్షకుడు ఉండడంటే ఆశ్చర్యం లేదు. అంతగా తన మ్యాజికల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆడియన్స్ గుండెల్లో స్థానం సంపాదించారు పవన్. పవర్‌పుల్ పంచ్ డైలాగులతో వెండితెరపై పవన్ చేసే సందడి మామూలుగా ఉండదు. అందుకే ఆయన పేరు చెబితే ఫ్యాన్స్ ఊగిపోతారు. అలాంటి పవన్ కల్యాణ్ చిత్ర పరిశ్రమలోకి వచ్చి 26 సంవత్సరాలు కావస్తోంది. మరి ఆయన మొదటి సినిమా కబుర్లు ఏమిటో తెలుసుకుందాం రండి..
1. టాలీవుడ్ దిగ్దర్శకుల్లో ఒకరిగా పేరు గడించిన ఈవీవీ సత్యనారాయణ (EVV Satyanarayana) డైరెక్షన్‌లో వచ్చిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రం హీరోగా పవన్‌కు మొదటి సినిమా.
2.ఇందులో అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన సుప్రియ హీరోయిన్‌గా నటించారు. ఆమెకూ ఇదే ఫస్ట్ మూవీ కావడం గమనార్హం. ‘ఖయామత్ సే ఖయామత్ తక్’ అనే హిందీ సినిమాకు రీమేక్‌గా ఇది తెరకెక్కింది.
3. ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు కోటి సంగీతం అందించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా 1996 లో విడుదలైంది.
4. ఈ సినిమా పవన్‌లో ఓ మంచి నటుడు ఉన్నాడని నిరూపించింది. ఈ మూవీ తర్వాత సీనియర్ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్‌లో ‘గోకులంలో సీత’ అనే మూవీ చేశారు పవన్. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ సాధించింది.
5. ఈ సినిమాలో పవన్ రియల్ స్టంట్స్ చేశారు. అలాగే అందుకోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నారు.
6. పవన్ కళ్యాణ్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన ఈవివి సత్యనారాయణ .. చిరంజీవితో కూడా ఓ సినిమాని తెరకెక్కించారు. ఆ సినిమా పేరు "అల్లుడా మజాకా"
7. ఈ సినిమాలో నటించక ముందు పవన్ విశాఖపట్నంలోని సత్యానంద్ నటన శిక్షణాలయంలో యాక్టింగ్ నేర్చుకున్నారు.
8. ఈ సినిమాలో శరత్ బాబు పవన్‌కు తండ్రిగా నటించారు. అలాగే కమెడియన్ సునీల్ కూడా ఈ చిత్రంలో ఓ చిన్న పాత్రలో కనిపిస్తారు. కానీ అప్పటికి ఆయనకు ఇండస్ట్రీతో పెద్ద కనెక్షన్ లేదు.
9. ఈ చిత్రం తర్వాత వెంటన్ పవన్.. "గోకులంలో సీత" చిత్రానికి సైన్ చేశారు. తర్వాత సుస్వాగతం, బద్రి, తొలి ప్రేమ, తమ్ముడు, బాలు, బంగారం, జల్సా, పంజా, అత్తారింటికి దారేది లాంటి సినిమాల్లో.. తన పవర్‌పుల్ నటనతో తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాల్లో పవన్ చెరగని ముద్ర వేశారు. ఆయన ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) అనే చిత్రంలో నటిస్తున్నారు.
విభిన్న చిత్రాలను రూపొందించే క్రిష్ ‘హరిహర వీరమల్లు’ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తర్వాత గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీశ్ శంకర్‌తోపాటు సురేందర్ రెడ్డి, సముద్రఖనిల డైరెక్షన్‌లో నటించేందుకు కూడా పవన్ సమాయత్తమవుతున్నారు.