Pooja Hegde: లండన్ లో 'బుట్టబొమ్మ' షాపింగ్.. సోష‌ల్ మీడియాలో పూజా హెగ్డే ఫోటోలు వైర‌ల్

Updated on Jul 27, 2022 10:37 AM IST
Pooja Hegde: హీరోయిన్ పూజ హెగ్డే సౌత్‌తో పాటు నార్త్‌లోనూ త‌న ఫాలోయింగ్ పెంచుకున్నారు.
Pooja Hegde: హీరోయిన్ పూజ హెగ్డే సౌత్‌తో పాటు నార్త్‌లోనూ త‌న ఫాలోయింగ్ పెంచుకున్నారు.

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా కొన‌సాగుతున్న పూజా హెగ్డే (Pooja Hegde) విదేశాల్లో విహ‌రిస్తున్నారు. త‌న‌కు న‌చ్చిన ప్ర‌దేశాలను చూస్తూ, షాపింగ్ చేస్తూ.. ఇష్ట‌మైన ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. పూజ హెగ్డే త‌న సోష‌ల్ మీడియాలో టూర్ ఫోటోల‌ను పోస్టు చేశారు. ఇక పూజ హెగ్డే ఫోటోల‌ను చూసి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

పూజ ఫోటోలు వైర‌ల్

హీరోయిన్ పూజ హెగ్డే  (Pooja Hegde) సౌత్‌తో పాటు నార్త్‌లోనూ త‌న ఫాలోయింగ్ పెంచుకున్నారు. వ‌రుస సినిమాల‌తో ఫుల్ బిజీగాఉన్నారు. షూటింగ్‌కు కొంచెం బ్రేక్ రావ‌డంతో పూజ హెగ్డే హాలిడే ట్రిప్‌కు వెళ్లారు. లండ‌న్‌లో పూజ హెగ్డే ఎంజాయ్ చేస్తున్నారు. పూజ షేర్ చేసిన ఫోటోలో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. 

వ‌రుస ఆఫ‌ర్ల‌తో దూసుకెళుతున్న పూజ‌

రీసెంట్‌గా పూజా హెగ్డే  (Pooja Hegde) న‌టించిన‌ ‘రాధే శ్యామ్', 'బీస్ట్', 'ఆచార్య' సినిమాలు ఫ్లాపులుగా మిగిలాయి. పూజ‌ 'ఎఫ్ 3' చిత్రంలో స్పెష‌ల్ పాట‌లో న‌టించారు. సినిమా హిట్టా, ప‌ట్టా అనే విష‌యాల‌తో సంబంధం లేకుండా పూజ హెగ్డే ప‌లు సినిమాల్లో న‌టిస్తూ బిజీగా మారారు. ప్ర‌పంచ సినిమా వేడుక‌లైన 'కేన్స్ ఫిలిమ్ ఫెస్టివ‌ల్‌'కు పూజ హెగ్డే భార‌త‌దేశం త‌ర‌ఫున ప్రాతినిధ్యం వ‌హించారు. 

బాలీవుడ్‌లో పూజ హెగ్డేకు డిమాండ్ పెరిగింది. ‘కబీ ఈద్ కబీ దివాలీ’లో స‌ల్మాన్ ఖాన్‌కు జోడిగా పూజ న‌టిస్తున్నారు. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), పూరీ కాంబినేషన్‌లో వస్తున్న జన గణ మన (JGM) సినిమాలో పూజ హెగ్డే న‌టిస్తున్నారు. టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, త్రివిక్ర‌మ్ కాంబోలో తెర‌కెక్కుతున్న 'ఎస్ఎస్ఎంబి 28'లో కూడా బుట్ట‌బొమ్మే క‌థానాయ‌కురాలుగా న‌టించ‌నున్నారు. 

Read More : ఆ ఇండిగో ఉద్యోగి ప్ర‌వ‌ర్త‌న నాకు నచ్చలేదు : పూజా హెగ్డే (Pooja Hegde)

Advertisement
Credits: Instagram

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!