పొన్నియిన్ సెల్వ‌న్ 1 (Ponniyin Selvan1) 'పొంగె న‌ది' సాంగ్ రిలీజ్ చేసిన పీవీ సింధు.. అనంత పాట రెహ‌మాన్ నోట‌!

Updated on Jul 31, 2022 07:06 PM IST
Ponniyin Selvan1: తెలుగు సినీ గీత ర‌చ‌యిత‌ అనంత శ్రీరామ్ 'పొన్నియిన్ సెల్వ‌న్ 1స సినిమాలోని పొంగె న‌ది పాట‌ను రాశారు.
Ponniyin Selvan1: తెలుగు సినీ గీత ర‌చ‌యిత‌ అనంత శ్రీరామ్ 'పొన్నియిన్ సెల్వ‌న్ 1స సినిమాలోని పొంగె న‌ది పాట‌ను రాశారు.

Ponniyin Selvan1: 'పొన్నియిన్ సెల్వ‌న్ 1'  సినిమా నుంచి పొంగె న‌ది పాట రిలీజ్ అయింది. ఈ పాట‌ను  బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు రిలీజ్ చేశారు. పొన్నియిన్ సెల్వ‌న్ 1' సినిమాను ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ‌హ్రీత ఎ.ఆర్. రెహ‌మాన్, శివ‌మ‌ణి ఈ చిత్రానికి త‌మ‌దైన శైలిలో స్వ‌రాలు స‌మ‌కూర్చుతున్నారు. తెలుగు సినీ గీత ర‌చ‌యిత‌ అనంత శ్రీరామ్ 'పొన్నియిన్ సెల్వ‌న్ 1స సినిమాలోని పొంగె న‌ది పాట‌ను రాశారు. ఎ.ఆర్ రెహ‌మాన్ అనంత శ్రీరామ్ రాసిన పాట‌ను ఆల‌పించారు. హీరో కార్తీ 'పొంగె న‌ది' పాట‌లో న‌టించారు.

'పొంగె న‌ది పాడిన‌ది ..చిందులైరా, చేర‌మ‌ని కోరిన‌ది..సంధ్య‌క‌ల్లా'.. లిరిక్స్‌తో సాగిన‌ పాటను అనంత శ్రీరామ్ అద్భుతంగా రాశారు. ఎ.ఆర్. రెహ‌మాన్ సంగీతం అందించ‌డ‌మే కాకుండా.. తానే స్వ‌యంగా ఆల‌పించారు. పొన్నియిన్ సెల్వ‌న్ 1 (Ponniyin Selvan1) బీటీఎస్‌ను రూపొందించేందుకు మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎ.ఆర్. రెహ‌మాన్, శివ‌మ‌ణిలు క‌లిసి చేసిన ప్ర‌య‌త్నంపై మేక‌ర్స్ ఇటీవ‌ల ఓ వీడియో రిలీజ్ చేశారు.

ఐదు భాష‌ల్లో విడుద‌ల‌

'పొన్నియిన్ సెల్వ‌న్ 1' (Ponniyin Selvan1) చిత్రంలో చియాన్ విక్ర‌మ్‌, కార్తి, జయం రవి, ఐశ్వ‌ర్య‌రాయ్‌, త్రిష, బాబీ సింహ వంటి ప్ర‌ముఖులు న‌టిస్తున్నారు. ఈ సినిమా మొద‌టి భాగం సెప్టెంబ‌ర్ 30న విడుద‌ల కానుంది. తమిళ్‌తో పాటు తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో 'పొన్నియిన్ సెల్వ‌న్ 1' సినిమాను విడుద‌ల చేయ‌నున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌తో కలిసి మ‌ద్రాస్ టాకీస్ బ్యాన‌ర్‌పై మ‌ణిర‌త్నం స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కించారు. 

Read More : Ponniyin Selvan (పొన్నియిన్ సెల్వన్ 1) : ఈ రోజే టీజర్ రిలీజ్.. ఈ సినిమాకు సంబంధించిన టాప్ 10 విశేషాలు ఇవే

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!