చిరంజీవి (Chiranjeevi) ఒక్కరే ఆదుకున్నారు.. మిగతా ఏ హీరోలు నాకు సాయం చేయలేదు: పావలా శ్యామల (Pavala Shyamala)

Updated on Nov 19, 2022 04:35 PM IST
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తనకు చేసిన సాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామల (Pavala Shyamala) అన్నారు
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తనకు చేసిన సాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామల (Pavala Shyamala) అన్నారు

తెలుగులో మహిళా హాస్య నటీమణులు చాలా తక్కువేనని చెప్పాలి. అలాంటి వారిలో ‘పావలా శ్యామల’ (Pavala Shyamala) ఒకరు. నాటకరంగం నుంచి చిత్రసీమకు వచ్చిన ఆర్టిస్టుల్లో శ్యామల ఒకరు. ‘పావల’ అనే నాటకం ఆమెకు మంచి గుర్తింపు తీసుకురావడంతో అదే ఆమె ఇంటి పేరుగా మారిపోయింది. ఆ తర్వాత ఆమె టెలివిజన్ సీరియల్స్‌లోనూ, సినిమాల్లోనూ చేస్తూ వెళ్లారు. ఏ పాత్ర ఇచ్చినా తనదైన మార్క్ నటన, హావభావాలతో స్పష్టంగా ముద్ర వేస్తారని శ్యామల పేరు సంపాదించారు. 

క్యారెక్టర్ ఏదైనా తనదైన విరుపులు, వెటకారాలతో చూపించడం పావలా శ్యామల ప్రత్యేకత. అలాంటి ఆమెకు ఈమధ్య కాలంలో వేషాలు రావడం లేదు. అందుకు కారణం వయసు పైబడటం. ఆమె కూతురు అనారోగ్యం బారిన పడటం. ఓ ప్రమాదంలో కాలు విరిగి మంచాన పడిన కూతురు సహా శ్యామల ఒక వృద్ధాశ్రమంలో దయనీయ స్థితిలో బతుకీడుస్తున్నారు. తను పడుతున్న కష్టాల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్యామల మాట్లాడారు. ‘నేను కష్టాల్లో ఉన్నప్పుడు చిరంజీవి (Chiranjeevi) గారు నన్ను ఆదుకున్నారు. తనే నాకు ‘మా’లో సభ్యత్వం ఇప్పించి, ప్రతినెలా నాకు కొంత మొత్తం వచ్చేలా చేశారు. ఆయన చేసిన సాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను’ అని శ్యామల చెప్పుకొచ్చారు. 

పుకార్ల వల్ల తనకు చిన్న సాయాలు చేసేవారు కూడా వెనక్కి పోయారని పావలా శ్యామల వాపోయారు

మహేశ్ బాబు, చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్.. తలో పది లక్షలు తనకు సహాయం చేసినట్లుగా వస్తున్న వార్తల పైనా పావలా శ్యామల స్పందించారు. ఇందులో ఏమాత్రం నిజం లేదన్నారు. అలాంటి పుకార్ల వల్ల తనకు చిన్న సాయాలు చేసేవారు కూడా వెనక్కి పోయారని ఆమె వాపోయారు. ‘నాకు ఎలాంటి సాయం దక్కకూడదనే ఉద్దేశంతో ఒక మహాతల్లి ఇలా చేసింది’ అంటూ పావలా శ్యామల ఆవేదనను వ్యక్తం చేశారు. ఇకపోతే, మెగాస్టార్ చిరంజీవి తన కుమార్తె శ్రీజ ద్వారా శ్యామలకు రూ.2 లక్షల మేర ఆర్థిక సాయం చేశారని తెలుస్తోంది. ఆ తర్వాత ఆమె ‘మా’లో సభ్యత్వం పొందేందుకు వీలుగా రూ.1,01,500 కూడా అందించారని తెలిసింది. 

Read more: ‘హాస్య బ్రహ్మ’ బ్రహ్మానందం (Brahmanandam) కామెడీతో రికార్డులు బద్దలుకొట్టిన టాప్‌10 సినిమాలు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!