Godfather OTT Streaming: ‘గాడ్‌ఫాదర్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్!.. ఆ రోజు నుంచే చిరు మూవీ స్ట్రీమింగ్?

Updated on Nov 02, 2022 01:19 PM IST
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన ‘గాడ్‌ఫాదర్’ (GodFather) సినిమా త్వరలో ఓటీటీలో రిలీజ్ కానుందని తెలుస్తోంది
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన ‘గాడ్‌ఫాదర్’ (GodFather) సినిమా త్వరలో ఓటీటీలో రిలీజ్ కానుందని తెలుస్తోంది

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన తాజా చిత్రం ‘గాడ్‌ఫాదర్’ (GodFather). మలయాళ మూవీ ‘లూసిఫర్’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా రూపొందించిన ‘గాడ్‌ఫాదర్’ సినిమా దసరా పండుగకు రిలీజై మంచి విజయాన్ని సాధించింది. చిరు ఇమేజ్‌కు తగ్గ కలెక్షన్లు రానప్పటికీ.. నిర్మాతలు పెట్టిన పెట్టుబడిని రాబట్టిందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సినిమాలో సత్యదేవ్, నయనతార, సల్మాన్ ఖాన్ కీలక పాత్రలు పోషించారు. ఇదిలాఉంటే.. ఇప్పుడీ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. 

ఓటీటీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు ‘గాడ్‌ఫాదర్’ ఓటీటీ రైట్స్‌ను సొంతం చేసుకుంది. త్వరలోనే ఈ చిత్రాన్ని తమ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి తెచ్చేందుకు నెట్‌ఫ్లిక్స్ సన్నాహకాలు చేస్తోందట. ‘గాడ్‌ఫాదర్’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను కూడా నెట్‌ఫ్లిక్స్ లాక్ చేసిందని తెలుస్తోంది. నవంబర్ 19 నుంచి ఈ సినిమాను ఓటీటీలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. త్వరలో దీనిపై నెట్‌ఫ్లిక్స్ అధికారిక ప్రకటన చేస్తుందట. ఈ కన్ఫర్మేషన్ కోసం మెగా ఫ్యాన్స్‌తోపాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  

సంక్రాంతి రేసులో చిరు మూవీ

ఇకపోతే, చిరంజీవి ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. యంగ్ డైరెక్టర్ బాబి దర్శకత్వంలో ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veeraiya) సినిమా షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ చిత్రం టైటిల్ టీజర్ దీపావళికి రిలీజైంది. యూట్యూబ్‌లో ఇప్పుడీ టీజర్ ట్రెండింగ్‌లో ఉంది. మాస్ లుక్‌లో చిరు స్టైలిష్‌గా చెప్పిన డైలాగ్స్‌తో ‘వాల్తేరు వీరయ్య’పై అంచనాలు ఒక రేంజ్‌లో పెరిగిపోయాయి. ఈ సినిమా సంక్రాంతికి విడుదల తేదీని ఖరారు చేసుకుంది. 

‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో ఓ కీలక పాత్రలో మాస్‌ మహారాజా రవితేజ నటిస్తున్నారు. శృతిహాసన్, కేథరిన్ ట్రెసా హీరోయిన్లుగా యాక్ట్ చేస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ బాణీలు సమకూర్చుతున్నారు. కాగా.. వాల్తేరు వీరయ్య టీజర్‌‌లో చిరంజీవి మాస్, స్వాగ్ లుక్‌కు పలువురు నెటిజన్ల రియాక్షన్లతో రూపొందించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. 

Read more: పెళ్లి పీటలెక్కబోతున్న పాలబుగ్గల బ్యూటీ హన్సిక (Hansika Motwani).. డిసెంబర్ 4న వివాహం.. కాబోయే భర్త ఎవరంటే?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!