Prabhas-Anushka: మరోసారి జంటగా ఓ సినిమా చేయబోతున్న ప్రభాస్-అనుష్క.. దర్శకుడు ఎవరంటే?
Prabhas-Anushka: టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, హీరోయిన్ అనుష్క కాంబినేషన్‌కు వెండితెరపై ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో బిల్లా, మిర్చి, బాహుబలి 1,2 వంటి సినిమాలు తెరకెక్కాయి. ఇందులో బిల్లా సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచినప్పటికీ ప్రభాస్, అనుష్క జంటకు మంచి ఆదరణే లభించింది.
అలాగే ఆ తర్వాత మిర్చి , బాహుబలి (Bahubali Movie) సినిమాలు మంచి విజయాలను సాధించడం మాత్రమే కాకుండా, ఆన్ స్క్రీన్ పై వీరిద్దరి జంటకు మంచి ప్రశంసలు లభించాయి. ఈ క్రమంలోనే వీరిద్దరి జంటకు బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ లభించింది. ఇలా పాన్ ఇండియా రేంజ్ లో ఫుల్ క్రేజ్ ఉన్న ఈ జంట మరోసారి వెండితెరపై సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది.
(Director Maruthi)కమర్షియల్ డైరెక్టర్ మారుతి–పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఓ భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆ ముగ్గురు హీరోయిన్స్ లో ఒకరు అనుష్క శెట్టి అని గతంలోనే టాక్ నడిచింది. తాజాగా ఇది నిజం అని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు 'రాజా డీలక్స్' అనే టైటిల్ కూడా చిత్ర బృందం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. కాకపోతే ఈ సినిమా ఇప్పట్లో మొదలయ్యేలా లేదు. ఏది ఏమైనా ప్రభాస్ – అనుష్క కాంబినేషన్ మళ్లీ ఫిక్స్ అయితే ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు.
మరోవైపు అనుష్క ఇప్పటికే ఏజ్ బార్ అయిపోయింది. అదే సమయంలో అనుష్క లావెక్కిపోవడంతో ఆమె మళ్లీ సినిమాల్లో చేస్తుందా? అన్న సందేహాలు కూడా అందరిలోనూ ఉన్నాయి. అయితే ఆమె ప్రభాస్‌తో ఉన్న సాన్నిహిత్యం నేపథ్యంలోనే నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) పక్కన హీరోయిన్‌గా చేసేందుకు ఓకే చెప్పింది. ఇక ఇప్పుడు ఏకంగా ప్రభాస్‌తోనే మళ్లీ జోడీ కట్టబోతోంది.
ప్రస్తుతం గోపీచంద్‌తో మారుతి తీసిన పక్కా కమర్షియల్ (Pakka Commercial Movie) సినిమా జూలై 1న వస్తోంది. ఆ వెంటనే మారుతి ప్రభాస్ సినిమా కథపై వర్క్ చేస్తాడు. ఇక ఈ సినిమాలో తన పాత్ర కోసం అనుష్క పూర్తిగా స్లిమ్ అయిపోతోందట. బాహుబలి టైంలో సైజ్ జీరో సినిమా చేసినప్పుడే అనుష్క లావెక్కిపోయింది. ఆ తర్వాత ఆమె సన్నబడేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా సాధ్యం కాలేదు. అయితే ఇప్పుడు ప్రభాస్ సినిమాలో నటించేందుకు సన్నగా కనపడేందుకు బాగా వర్కవుట్లు చేస్తోందట.