Rebelstar Prabhas: సెప్టెంబ‌ర్ నుంచి రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్-మారుతి సినిమా షూటింగ్.. హీరోయిన్ ఆమేనా?

Updated on May 31, 2022 10:00 PM IST
రెబ‌ల్ స్టార్ ప్రభాస్, డైరెక్ట‌ర్ మారుతి (Prabhas, Director Maruthi)
రెబ‌ల్ స్టార్ ప్రభాస్, డైరెక్ట‌ర్ మారుతి (Prabhas, Director Maruthi)

Rebelstar Prabhas: బాహుబలి సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిన యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్ ప్ర‌స్తుతం వరుసపెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్వకత్వంలో సలార్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె సినిమాల్లో నటిస్తున్నాడు. ప్రభాస్ చేస్తున్న‌ మరో సినిమా ఆది పురుష్ ఇప్పటికే షూటింగ్ పూర్తయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉంది. 

మ‌రోవైపు టాలీవుడ్ టాలెంటెడ్‌ డైరెక్ట‌ర్ మారుతి (Director Maruthi), ప్ర‌భాస్ కాంబోలో సినిమా రాబోతున్న విష‌యం తెలిసిందే. సినిమా ఆగిపోయిందంటూ ఆమధ్య వార్తలొచ్చాయి. సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రాకముందే, ప్రాజెక్టు కాన్సిల్ అయిందంటూ ఊహాగానాలు చెలరేగాయి. ఈ నేప‌థ్యంలో ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు ప్రభాస్. 

ఇందులో భాగంగానే ఈ మూవీకి సంబంధించి తాజాగా ఓ క్రేజీ అప్‌డేట్ ఫిలింన‌గ‌ర్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ ప్రాజెక్టు హార్ర‌ర్ కామెడీ నేప‌థ్యంలో ఉండబోతున్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది. అంతేకాదు ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ఆగ‌స్టు చివ‌ర‌లో కానీ, సెప్టెంబ‌ర్ మొద‌టి వారంలో కానీ మొద‌లుకాబోతున్న‌ట్లు స‌మాచారం. 

'రాజా డీలక్స్' (Raja Deluxe) టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన అనుష్కను హీరోయిన్‌గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. మొదట పలువురు హీరోయిన్ల పేర్లు అనుకున్నప్పటికీ చివరకు అనుష్క పేరునే ఫైనల్ చేసినట్లు చెబుతున్నారు. సినిమాలో హీరోయిన్ పాత్రకు మంచి ప్రాధాన్యం ఉండటంతో అనుష్కను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. 

ఇప్పటికైతే దీనిపై మారుతి నుంచి కానీ మేకర్స్ నుంచి కానీ ఎటువంటి ప్రకటన రాలేదు. మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్ఎస్ థ‌మ‌న్ (SS Thaman) ప‌నిచేయ‌నున్నాడు. ఈ చిత్రంపై మ‌రిన్ని అప్ డేట్స్ త్వ‌ర‌లోనే వెల్ల‌డి కానున్న‌ట్టు టాలీవుడ్ స‌ర్కిల్ స‌మాచారం. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన మారుతి... క్యాస్టింగ్ కూడా దాదాపుగా పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

సలార్ షెడ్యూల్స్ పై దర్శకుడు ప్రశాంత్ నీల్ (Director Prashant Neel) క్లారిటీ ఇవ్వకపోవడంతో ఈ కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఇప్పుడా షెడ్యూల్స్ పై క్లారిటీ వచ్చింది. లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. ఆగస్ట్ చివరి నాటికి సలార్ సినిమా షూటింగ్ దాదాపు 75 శాతం కంప్లీట్ అయిపోతుందట. సో.. అప్పుడు మారుతి సినిమాకు లైన్ క్లియర్ అవుతుందన్నమాట. సెప్టెంబర్ నుంచి మారుతి సినిమాతో పాటు ప్రాజెక్ట్-కె ను కంటిన్యూ చేయబోతున్నాడు ప్రభాస్. 

కాగా, రెబ‌ల్ స్టార్ ప్రభాస్ (Rebelstar Prabhas) న‌టించిన‌ చివరి రెండు సినిమాలు సాహో, రాధేశ్యామ్ భారీ అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్‌గా మిగిలిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభాస్ నుంచి మరో సినిమా కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!