స‌లార్ (Salaar) నుంచి ఇక వ‌రుస అప్‌డేట్స్.. పండుగంటున్న ఫ్యాన్స్‌

Updated on May 17, 2022 02:28 PM IST
ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ (PrasanthNeel) ప్ర‌భాస్ ఫ్యాన్స్ కోరుకున్న‌ట్లే స‌లార్ (Salaar) నుంచి ప్ర‌తీ అప్‌డేట్ ఇవ్వ‌నున్నారు. 
ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ (PrasanthNeel) ప్ర‌భాస్ ఫ్యాన్స్ కోరుకున్న‌ట్లే స‌లార్ (Salaar) నుంచి ప్ర‌తీ అప్‌డేట్ ఇవ్వ‌నున్నారు. 

పాన్ ఇండియా హీరో ప్ర‌భాస్ (Prabhas) స‌లార్ నుంచి వ‌రుస అప్‌డేట్స్ రానున్నాయి.  హోంబ‌ళే ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ స‌లార్ అఫిషియ‌ల్ అకౌంట్ల వివ‌రాలు రివీల్ చేసింది. ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ (PrasanthNeel) ప్ర‌భాస్ ఫ్యాన్స్ కోరుకున్న‌ట్లే స‌లార్ నుంచి ప్ర‌తీ అప్‌డేట్ ఇవ్వ‌నున్నారు. 

హోంబ‌ళే ఫిలిమ్స్ నిర్మాణంలో స‌లార్ భారీ బ‌డ్జెట్ సినిమాగా తెర‌కెక్కుతుంది. అందులోనూ పాన్ ఇండియా హీరో ప్ర‌భాస్ సినిమా అంటే ఇంకెంత బ‌డ్జెట్ ఖ‌ర్చు చేయ‌నున్నారో. స‌లార్ సినిమాకు మ‌రో హైలెట్‌గా నిలిచారు ద‌ర్శ‌కుడు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ చిత్రాల‌తో ఇండియాలో రికార్డుల మోత మోగించిన డైరెక్ట‌ర్‌గా ప్ర‌శాంత్ నీల్ పేరు తెచ్చుకున్నారు. ఇక ప్ర‌భాస్‌తో క‌లిసి చేస్తున్న స‌లార్ మూవీ నుంచి అప్‌డేట్స్ ఇవ్వ‌డానికి రెడీ అయ్యారు. 

స‌లార్ సినిమా అప్‌డేట్స్ ఇవ్వాలంటూ ప్ర‌భాస్ ఫ్యాన్స్ నుంచి డిమాండ్ పెరిగింది. రాధేశ్యామ్ డిస్టాస్ట‌ర్ నుంచి బ‌య‌ట ప‌డేందుకు స‌లార్ అప్ డేట్స్ కోరుకుంటున్నారు డార్లింగ్ ఫ్యాన్స్.  ద‌ర్శ‌క మాంత్రికుడు ప్ర‌శాంత్ నీల్ స‌లార్ సినిమా వివ‌రాలు తెల‌పాలంటూ కాస్త గ‌ట్టిగానే కోరారు. సినిమా అప్‌డేట్స్ ఇవ్వ‌కుంటే ఏకంగా ఆత్మ‌హ‌త్య చేసుకుంటామంటూ సూసైడ్ నోట్ పంపాడు ప్ర‌భాస్ అభిమాని. స‌లార్ అంచానాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దీంతో స‌లార్ అఫిషియ‌ల్ ట్విట‌ర్ అకౌంట్‌ను రిలీజ్ చేశారు. 

స‌లార్ - ది సాగా (Salaar the saga) అనే పేరుతో ట్విట్ల‌ర్ హ్యాండిల్ చేస్తున్నారు. సాగా అంటే హీరో గెలుపు అని అర్ధం. ఇక స‌లార్ అప్‌డేట్స్ ఎప్పుడెప్పుడు పోస్ట్ పెడ‌తారోన‌ని ప్రభాస్ అభిమానులు వెయిటింగ్. స‌లార్ సినిమాలో హీరోయిన్‌గా శృతిహాస‌న్ న‌టిస్తున్నారు. ఈ సినిమాలో విలన్‌గా జ‌గ‌ప‌తిబాబు కొత్త‌గా క‌నిప‌డ‌నున్నారు. మ‌ధు గురుస్వామి, ఈశ్వ‌రీరావు ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. 

హోంబ‌లే ఫిలిమ్స్ రూ.200 కోట్ల రూపాయ‌ల‌తో స‌లార్ సినిమా నిర్మిస్తుంది. కేజీఎఫ్ ఫేమ్ ర‌వి బ‌స్రూర్ సంగీతం అందిస్తున్నారు. ప్ర‌త్యేక సెట్స్ వేసి స‌లార్ షూటింగ్ చేస్తున్నారు. స‌లార్ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే 30 శాతం పూర్తి చేసుకుంద‌ని ప్రొడ్యూస‌ర్ విజ‌య్ కిరగందూర్ చెప్పారు. ప్ర‌శాంత్ నీల్ కూడా స‌లార్ షూటింగ్‌పైనే ఫోక‌స్ పెట్టార‌న్నారు. స‌లార్ (Salaar)  షూటింగ్ 2022 న‌వంబ‌ర్ లోపు పూర్తి అవుతుంద‌ని విజ‌య్ చెప్పారు. 
 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!