Pushpa 2: 'పుష్ప 2' హ‌క్కుల కోసం ఓటీటీ సంస్థ‌ల పోటీ!.. సినిమాపై క్రేజ్ పెంచుతున్న బ‌న్ని (Allu Arjun)

Updated on Aug 06, 2022 05:30 PM IST
అల్లు అర్జున్ (Allu Arjun) న‌టించ‌నున్న‌'పుష్ప 2' సినిమా ఓటీటీ హ‌క్కుల కోసం ప‌లు సంస్థ‌లు పోటీ ప‌డుతున్నాయి.
అల్లు అర్జున్ (Allu Arjun) న‌టించ‌నున్న‌'పుష్ప 2' సినిమా ఓటీటీ హ‌క్కుల కోసం ప‌లు సంస్థ‌లు పోటీ ప‌డుతున్నాయి.

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) 'పుష్ప' సినిమా త‌ర్వాత ఓ రేంజ్‌లో పాపుల‌ర్ అయ్యారు. ప్ర‌స్తుతం యాడ్ ఫిలిమ్స్ షూటింగ్స్‌లో బిజీగా ఉన్నారు. ద‌ర్శ‌కులు త్రివిక్ర‌మ్, హ‌రీష్ శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లో అల్లు అర్జున్ న‌టిస్తున్నారు. త్వ‌ర‌లో అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమా షూటింగ్ షెడ్యూల్‌కు హ‌జ‌రుకానున్నారు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో 'పుష్ప 2' పాన్ ఇండియా సినిమాగా తెర‌కెక్కుతుంది. 

అల్లు అర్జున్ (Allu Arjun) న‌టించ‌నున్న‌'పుష్ప 2' సినిమా ఓటీటీ హ‌క్కుల కోసం ప‌లు సంస్థ‌లు పోటీ ప‌డుతున్నాయి.

భారీ యాక్ష‌న్ సీన్ల‌ను ప్లాన్ చేసిన సుకుమార్

'పుష్ప' సినిమాకు సీక్వెల్‌గా 'పుష్ప - ది రూల్' టైటిల్‌తో ద‌ర్శ‌కుడు సుకుమార్ భారీ బ‌డ్జెట్‌తో చిత్రీక‌రిస్తున్నారు. ఈ సినిమాను రూ. 350 కోట్ల‌తో నిర్మించ‌నున్నారు. నార్త్‌లోనూ అల్లు అర్జున్‌ (Allu Arjun)కు పాపులారిటీ పెర‌గ‌డంతో.. సుకుమార్ మాస్ యాక్ష‌న్ సీన్ల‌ను పీక్ లెవ‌ల్‌లో వెండితెర‌పై ఆవిష్క‌రించ‌నున్నారు. 

 'పుష్ప 2' ఓటీటీ రైట్స్‌కు డిమాండ్

'పుష్ప 2' సినిమా ఓటీటీ హ‌క్కుల కోసం ప‌లు సంస్థ‌లు పోటీ ప‌డుతున్నాయి. భారీ ధ‌రకు ఈ సినిమా హ‌క్కుల‌ను చెల్లించేందుకు సిద్ధ‌మ‌య్యాయి. 'పుష్ప 2' కోసం కోట్ల రూపాయ‌లు కుమ్మ‌రించేందుకు ఓటీటీ సంస్థ‌లు రెడీ అయ్యాయి. సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాక‌ముందే 'పుష్ప 2' సినిమా ఓటీటీ రైట్స్‌కు డిమాండ్ పెరిగింది. ఇక ఏ సంస్థ ఈ సినిమా ఓటీటీ హ‌క్కుల‌ను ద‌క్కించుకోనుందో చూడాలి.

అల్లు అర్జున్ (Allu Arjun) న‌టించ‌నున్న‌'పుష్ప 2' సినిమా ఓటీటీ హ‌క్కుల కోసం ప‌లు సంస్థ‌లు పోటీ ప‌డుతున్నాయి.

రంగంలోకి దిగిన‌ నెట్‌ఫ్లిక్స్

'పుష్ప' సినిమా ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో, స్టార్ ఇండియా నెట్ వర్క్ దక్కించుకున్నాయి. ఈ సినిమా సీక్వెల్ రైట్స్‌ను కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోనే సొంతం చేసుకోవాలని ప్ర‌య‌త్నిస్తుంద‌ట‌. మ‌రోవైపు అల్లు అర్జున్ (Allu Arjun) సినిమా హ‌క్కుల‌ను ద‌క్కించుకునేందుకు నెట్ ఫ్లిక్స్ రంగంలోకి దిగింది. అమోజాన్‌కు పోటీగా నెట్ ఫ్లిక్స్ నుంచి భారీ ఆఫర్లు వ‌స్తున్నాయి.

Read More : Pushpa Movie: “పుష్ప 3” కూడా ఉంటుంది.. ఫాహద్ ఫాజిల్ (Fahadh Faasil) సంచలన వ్యాఖ్యలు..!!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!