Pushpa Movie: “పుష్ప 3” కూడా ఉంటుంది.. ఫాహద్ ఫాజిల్ (Fahadh Faasil) సంచలన వ్యాఖ్యలు..!!

Updated on Jul 19, 2022 05:20 PM IST
పుష్ప 2' సినిమా షూటింగ్‌ ఇంకా ప్రారంభం కాకుండానే అప్పుడే 'పుష్ప 3' (Pushpa 3) గురించి చర్చ జరుగుతోంది.
పుష్ప 2' సినిమా షూటింగ్‌ ఇంకా ప్రారంభం కాకుండానే అప్పుడే 'పుష్ప 3' (Pushpa 3) గురించి చర్చ జరుగుతోంది.

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కెరీర్ లో 'పుష్ప' మూవీ ఎప్పటికీ స్పెషల్ గా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. బన్నీ, రష్మిక మందన్న హీరోహీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా దేశవ్యాప్తంగా ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇందులోని పాటలు, డైలాగ్స్, స్టెప్పులు ఇలా అన్నీ వైరల్ గా మారాయి. ఈ సినిమాతో అల్లు అర్జున్, రష్మికకి (Rashmika Mandanna) ఒక్క సారిగా దేశ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. కలెక్షన్ల వర్షం కురిసింది. 

ఈ నేపథ్యంలో డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం 'పుష్ప పార్ట్ 2' కోసం వర్క్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లనుంది. షూటింగ్ కూడా మొదలు పెట్టకముందే పుష్ప 2 పై అంచనాలు భారీ గా పెంచేసిన విషయం తెల్సిందే. 'పుష్ప 2' (Pushpa 2) ను 'కేజీఎఫ్ 2' రేంజ్ లో అభిమానులు కూడా ఊహించేసుకుంటున్నారు. "బాహుబలి 2", “కేజీయఫ్ 2” ల తర్వాత ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా రికార్డులను షేక్ చెయ్యగలిగే క్రేజీ సీక్వెల్ చిత్రంగా అల్లు అర్జున్, సుకుమార్ ల కాంబో ఉండబోతోంది. 

అయితే.. 'పుష్ప 2' సినిమా షూటింగ్‌ ఇంకా ప్రారంభం కాకుండానే అప్పుడే 'పుష్ప 3' (Pushpa 3) గురించి చర్చ జరుగుతోంది. హీరో గా బన్నీ 'పుష్ప 3' సినిమా ను చేసేందుకు ఓకే చెప్పాడట. ఇటీవల 'పుష్ప 2' స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్న సమయంలోనే 'పుష్ప 3' యొక్క స్టోరీ లైన్ వచ్చిందనే కామెంట్స్ వస్తున్నాయి. 
 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' మూవీ పోస్టర్ (Pushpa Movie Poster)

ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియా లో 'పుష్ప 3' గురించి ఇప్పుడు ప్రముఖంగా చర్చ జరుగుతోంది. దర్శకుడు సుకుమార్ పుష్ప పార్ట్ 3కి అవకాశం ఉందని, కథలో ఆ పరిధి ఉందని ఫహద్ ఫాజిల్ తో తెలియజేశారట. ఈ విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో ఫహద్ ఫాజిల్ (Fahadh Faasil) వెల్లడించారు. ఇక ఫహద్ ఫాజిల్ కామెంట్స్ అభిమానుల్లో ఉత్సాహం నింపుతున్నాయి. 

ఫహద్ ఫాజిల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "పుష్ప టైంలో అల్లు అర్జున్, సుకుమార్ (Director Sukumar) నన్ను బాగా చూసుకున్నారు. నేను పుష్ప పార్ట్ 2లో కూడా ఉంటాను. ఇది చాలా మంచి స్టోరీ. దీనికి పార్ట్ 3 కూడా ఉండబోతుంది. ఈ విషయాన్ని షూటింగ్ సమయంలో సుకుమార్ నాతో చెప్పారు పుష్పకి పార్ట్ 3 కూడా ఉంటుందని. ఈ స్టోరీకి పార్ట్ 3 తీసే స్కోప్ ఉంది. త్వరలోనే పార్ట్ 2 షూట్ మొదలవుతుంది” అని తెలిపారు. 

Read More: అమెరికాలో 'ఇండియన్ ఇండిపెండెన్స్ డే వేడుకల'కు అల్లు అర్జున్‌ (Allu Arjun) నాయ‌క‌త్వం !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!