Oke Oka Jeevitham Review:శర్వానంద్ (Sharwanand) ‘ఒకే ఒక జీవితం’..జీవితసత్యాలను అందంగా తెలిపే విభిన్న ప్రయత్నం!

Updated on Sep 09, 2022 03:14 PM IST
శర్వానంద్ (Sharwanand) ఇటీవల నటించిన సినిమాలు అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో ఆశలన్నీ ఒకే ఒక జీవితం సినిమాపైనే పెట్టుకున్నారు
శర్వానంద్ (Sharwanand) ఇటీవల నటించిన సినిమాలు అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో ఆశలన్నీ ఒకే ఒక జీవితం సినిమాపైనే పెట్టుకున్నారు

సినిమా: ఒకే ఒక జీవితం

నటీనటులు: శర్వానంద్‌ (Sharwanand), అమల, రీతూ వర్మ, వెన్నెల కిషోర్‌, ప్రియదర్శి, నాజర్‌

నిర్మాత: ప్రకాష్‌బాబు, ప్రభు

కథ, కథనం, దర్శకత్వం: శ్రీ కార్తిక్‌

సంగీతం: జేక్స్ బిజోయ్

విడుదల తేదీ: 9–9–2022

రేటింగ్: 3 / 5

శర్వానంద్ (Sharwanand).. అమ్మ చెప్పింది, అందరి బంధువయా, గమ్యం, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, శతమానం భవతి, శ్రీకారం సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరయ్యారు. గెస్ట్‌ రోల్స్‌తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శర్వానంద్ ప్రస్తుతం మినిమం గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నారు.

కొద్ది రోజులుగా సరైన హిట్‌ కోసం ఎదురుచూస్తున్న శర్వానంద్‌ తాజాగా నటించిన సినిమా ‘ఒకే ఒక జీవితం’. ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. మరి మనం కూడా ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకుందామా..

గడిచిపోయిన కాలాన్ని వెనక్కి తీసుకుని రావడం అసాధ్యం. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే కాలంలో వెనక్కి వెళ్లగలిగితే? దానినే టైమ్‌ ట్రావెల్ అంటారు. సరిగ్గా ఇదే కాన్సెప్ట్‌తో తెరకెక్కింది 'ఒకే ఒక జీవితం' సినిమా. టైమ్ ట్రావెల్‌ కాన్సెప్ట్‌తో వచ్చిన మొదటి తెలుగు సినిమా నందమూరి బాలకృష్ణ నటించిన ‘ఆదిత్య369’. ఆ సినిమా సూపర్‌‌హిట్‌ అయ్యింది.  ఇక చాలా కాలం తర్వాత సూర్య హీరోగా నటించిన ‘24’, కల్యాణ్‌రామ్‌ హీరోగా ఇటీవల విడుదలైన ‘బింబిసార’ సినిమాలు కూడా టైమ్ ట్రావెల్‌ కాన్సెప్ట్‌తోనే తెరకెక్కాయి.

ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగానే పెరిగాయి. చాలాకాలం తర్వాత అక్కినేని అమల 'ఒకే ఒక జీవితం' సినిమాలో ఓ మంచి పాత్రలో నటించారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్‌‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

శర్వానంద్ (Sharwanand) ఇటీవల నటించిన సినిమాలు అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో ఆశలన్నీ ఒకే ఒక జీవితం సినిమాపైనే పెట్టుకున్నారు

క‌థ ఏంటంటే: ఆది (శ‌ర్వానంద్‌), శ్రీను (వెన్నెల‌ కిషోర్‌), చైతూ (ప్రియ‌ద‌ర్శి) ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి క‌లిసే పెరుగుతారు. వీళ్లలో ఒక్కొక్కరూ ఒక్కో స‌మ‌స్యతో బాధపడుతూ ఉంటారు. ఈ ముగ్గురికీ పాల్ (నాజ‌ర్‌) అనే ఒక సైంటిస్ట్‌తో పరిచయం ఏర్పడుతుంది. ఆయన ఇర‌వై సంవత్సరాలుగా టైమ్ మెషీన్‌ను కనిపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఓ రోజు ఎట్టకేలకు తన ప్రయోగంలో విజయం సాధిస్తారు.

ఈ టైమ్‌ మెషీన్‌ ద్వారా గతంలోకి వెళ్లి తాము చేసిన తప్పులను సరిదిద్దుకునే అవకాశాన్ని శర్వానంద్, వెన్నెల కిషోర్, ప్రియదర్శిలకు ఇస్తారు నాజర్. మరి ఆ అవకాశాన్ని వాళ్లు వినియోగించుకుంటారా? గతంలోకి వెళ్లి చేసిన తప్పుల్ని సరిదిద్దుకున్నారా? అసలేం జరిగింది? అనేది సినిమా కథ.

ఎలా ఉందంటే: టైమ్ మెషీన్‌ క‌థ‌లు ఏంటి.. ఎలా ఉంటాయి అనేది తెలుగు ప్రేక్షకులకు తెలుసు. కానీ ఈ సినిమాలో మాత్రం.. వర్తమానం నుండి గతంలోకి తీసుకెళ్లే క్రమంలో జరిగే పరిణామాలను చాలా ఆసక్తిగా తెరకెక్కించారు. టైమ్ ట్రావెల్‌ స్టోరీ అయినప్పటికీ, ‘ఒకే ఒక జీవితం’ (Oke Oka Jeevitham) గ‌తంలో వ‌చ్చిన సినిమాల‌కి పూర్తి భిన్నంగా ఉంటుంది. అమ్మ ప్రేమ‌ అనే అంశాన్ని అంతర్లీనంగా స్పృశిస్తూ ఈ సినిమా కథను హృదయానికి హత్తుకునేలా తెరకెక్కించారు.

భావోద్వేగాల‌తో నిండిన కథ కావడంతో సగటు ప్రేక్షకుడికి కూడా బాగా నచ్చేస్తుంది ఈ సినిమా. ఆది, శ్రీను, చైతూ క్యారెక్టర్లను పరిచయం చేసే క్రమంలో కూడా మంచి ఎంటర్‌‌టైన్‌మెంట్‌ క్రియేట్‌ అయ్యేలా దర్శకుడు జాగ్రత్తలు తీసుకున్నారు. వెన్నెల కిషోర్ క్యారెక్టర్, ప్రియ‌ద‌ర్శి ల‌వ్ ట్రాక్ బాగా అలరిస్తాయి. ప్రీ క్లైమాక్స్‌ సీన్స్‌ ఎవరూ ఊహించని విధంగా కొత్తగా అనిపిస్తాయి. ఫస్టాఫ్‌ ఎక్కువగా ఎంటర్‌‌టైన్‌మెంట్‌ ప్రధానంగా సాగుతుంది కథ. ఇక సెకండాఫ్‌కు వచ్చేసరికి భావోద్వేగాలే ప్రధానంగా కథ నడుస్తుంది.

శర్వానంద్ (Sharwanand) ఇటీవల నటించిన సినిమాలు అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో ఆశలన్నీ ఒకే ఒక జీవితం సినిమాపైనే పెట్టుకున్నారు

ఎవ‌రెలా చేశారంటే: శ‌ర్వానంద్‌ (Sharwanand), వెన్నెల‌కిషోర్‌, ప్రియ‌ద‌ర్శి తమ తమ క్యారెక్టర్లకు పూర్తిగా న్యాయం చేశారు. సెంటిమెంట్ ప్రధానంగా సాగే సీన్లలో శర్వానంద్‌ అద్భుతంగా నటించారు. చాలా కాలం తర్వాత స్క్రీన్‌పై కనిపించినా.. అక్కినేని అమల (Akkineni Amala) నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఆమె కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమాగా 'ఒకే ఒక జీవితం' నిలుస్తుంది.

హీరోయిన్‌ రీతూ వ‌ర్మ తన క్యారెక్టర్‌‌కు తగినట్టుగా నటించారు. నాజ‌ర్ ఎప్పటిలాగే తన నటనానుభవంతో అలరించారు. ఇక జేక్స్ బిజోయ్‌ సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో వచ్చే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌‌ మనసును హత్తుకుంటుంది. అలాగే ద‌ర్శకుడు శ్రీకార్తిక్‌ క‌థ‌ని తెరపై చూపించిన విధానం బాగుంది.

ప్లస్ పాయింట్స్..

క‌థ‌, నటీనటులు, మ‌న‌సును హ‌త్తుకునే భావోద్వేగ సన్నివేశాలు,

బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్

కథ నెమ్మదిగా సాగడం

Read More : ఫెయిల్యూర్స్ నాకు నేర్పిన పాఠాలు అన్నీ ఇన్నీ కావు : శర్వానంద్ (Sharwanand)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!