ఫెయిల్యూర్స్ నాకు నేర్పిన పాఠాలు అన్నీ ఇన్నీ కావు : శర్వానంద్ (Sharwanand)

Updated on Sep 08, 2022 02:50 PM IST
శర్వానంద్ (Sharwanand) నటించిన “ ఒకే ఒక జీవితం” చిత్రానికి శ్రీ కార్తిక్ దర్శకత్వం వహించారు. రీతూ వర్మ ఇదే చిత్రంలో కథానాయికగా నటించారు.
శర్వానంద్ (Sharwanand) నటించిన “ ఒకే ఒక జీవితం” చిత్రానికి శ్రీ కార్తిక్ దర్శకత్వం వహించారు. రీతూ వర్మ ఇదే చిత్రంలో కథానాయికగా నటించారు.

గమ్యం, రన్ రాజా రన్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ప్రస్థానం, ఎక్స్ ప్రెస్ రాజా, శతమానంభవతి, మహానుభావుడు లాంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించిన నటుడు శర్వానంద్ (Sharwanand). అయితే గత కొద్ది రోజుల నుండి శర్వానంద్ నటిస్తున్న చిత్రాలు బాక్సాఫీసు వద్ద పెద్ద ప్రభావం చూపించడం లేదు. 

ముఖ్యంగా పడిపడి లేచె మనసు, రణరంగం, మహా సముద్రం, శ్రీకారం, ఆడవాళ్లు మీకు జోహార్లు.. లాంటి సినిమాలు శర్వానంద్ కెరీర్ గ్రాఫ్‌ను అమాంతం పాతాళానికి తీసుకెళ్లిపోయాయి. 

ఇలాంటి సమయంలో ఎంతో జాగ్రత్తగా కథను ఎంపిక చేసుకొని, చాలా ఆశలతో ఆయన సైన్ చేసిన సినిమా "ఒకే ఒక జీవితం" (Oke Oka Jeevitham). రేపే ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా శర్వానంద్ (Sharwanand) తన మదిలోని మాటలను ప్రేక్షకులతో పంచుకున్నారు. 

కష్టపడినా ఫలితం దక్కలేదు

"ఫెయిల్యూర్స్ నిజానికి మనకు చాలా పాఠాలు నేర్పుతాయి. ముఖ్యంగా పడి పడి లేచె మనసు సినిమా చేస్తున్నప్పుడు, ఆ ప్రాజెక్టుపై చాలా నమ్మకం పెంచుకున్నాను. దాదాపు 130 రోజులు కష్టపడ్డాను. అయినా, ఆ చిత్రం అంత పెద్ద హిట్ కాలేదు. 

దానితో పాటు ఆ తర్వాత విడుదలైన సినిమాలు కూడా నాకు అంత గొప్ప విజయాలను అందించలేదు. అందుకే హడావుడిగా సినిమాలు చేయడం వల్ల ఉపయోగం లేదని అనుకున్నాను. 

నన్ను నేను ఈ క్రమంలో చాలా విశ్లేషించుకున్నాను. తప్పు ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నించాను. చాలా కథలు విన్నాను. ఆఖరికి "ఒకే ఒక జీవితం" సినిమా చేయడానికి ఒప్పుకున్నాను" అంటూ తన అభిప్రాయాలను తెలిపారు శర్వానంద్ (Sharwanand). 

నిర్మాతగానూ నష్టపోయాను

అలాగే తన జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనల గురించి కూడా శర్వానంద్ (Sharwanand) తెలిపారు. "గమ్యం, ప్రస్థానం లాంటి సినిమాలు చేశాక, నేను నిర్మాతగా కూడా మారాను. నా డబ్బులతో 'కో అంటే కోటి' చిత్రం చేశాను. కానీ ఆ సినిమా ఆడలేదు. నేను పెట్టిన డబ్బులు పోయాయి. 

ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తడంతో బంధువులు, స్నేహితులు కూడా దూరమయ్యారు. అలాంటప్పుడే చాలా గుణ పాఠాలు నేర్చుకున్నాను. నాకు ఆ సినిమా కోసం చేసిన అప్పులు తీర్చడానికి చాలా రోజులు పట్టింది" అంటూ తన గత అనుభవాలను కూడా పంచుకున్నారు శర్వానంద్. 

శర్వానంద్ నటించిన "ఒకే ఒక జీవితం" (Oke Oka Jeevitham) చిత్రం సెప్టెంబర్ 9వ తేది అనగా రేపు విడుదల అవుతోంది. శ్రీకార్తిక్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ చిత్రం విడుదల కానుంది. రీతూ వర్మ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నాజర్, అమల అక్కినేని, వెన్నెలకిషోర్, ప్రియదర్శి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 

Read More: హీరో శర్వానంద్ (Sharwanand)‘ఒకే ఒక జీవితం’ సినిమా కోసం పాట పాడిన తమిళ హీరో కార్తి (Karthi)

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!