MOVIE REVIEW : దండుపాళ్యం సినిమాను గుర్తుచేస్తున్న నవీన్ చంద్ర రొమాంటిక్, క్రైమ్ థ్రిల్లర్‌‌ ‘తగ్గేదేలే’

Updated on Nov 04, 2022 05:13 PM IST
పుష్పలో అల్లు అర్జున్ పాపులర్‌‌ డైలాగ్‌ ‘తగ్గేదే లే’ ఈ టైటిల్‌తో నవీన్ చంద్ర (Naveen Chandra) హీరోగా తెరకెక్కిన సినిమా శుక్రవారం విడుదలైంది
పుష్పలో అల్లు అర్జున్ పాపులర్‌‌ డైలాగ్‌ ‘తగ్గేదే లే’ ఈ టైటిల్‌తో నవీన్ చంద్ర (Naveen Chandra) హీరోగా తెరకెక్కిన సినిమా శుక్రవారం విడుదలైంది

సినిమా : తగ్గేదేలే

నటీనటులు : నవీన్ చంద్ర, అనన్య రాజ్, దివ్య పిళ్లై
దర్శకత్వం : శ్రీనివాసరాజు
మ్యూజిక్ : చరణ్ అర్జున్
నిర్మాత : ప్రేమ్ కుమార్ పాండే, పీవీ సుబ్బారెడ్డి

విడుదల తేదీ : 04–11–2022

రేటింగ్ : 3 / 5

హీరోగానే కాకుండా విలన్‌గా కూడా సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు నవీన్ చంద్ర (Naveen Chandra). చాలాకాలం తర్వాత నవీన్ చంద్ర హీరోగా నటించిన సినిమా తగ్గేదేలే. దండుపాళ్యం సిరీస్ సినిమాలు తీసిన శ్రీనివాసరాజు దర్శకత్వం వహించారు.రొమాంటిక్, క్రైమ్ థ్రిల్లర్‌‌గా తెరకెక్కిన తగ్గేదేలే సినిమా ఈ శుక్రవారం థియేటర్లలో విడుదలైంది.

కథ ఏంటంటే?

ఈశ్వర్ (నవీన్ చంద్ర) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. జీవితంలో అన్ని విధాలుగా ఎంజాయ్ చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో స్వామి (నాగబాబు) నడిపే పారడైజ్ అనే ఆశ్రమానికి వెళ్తారు. ఆశ్రమంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. అక్కడ లిజి (అనన్య రాజ్)తో పరిచయం ఏర్పడుతుంది ఈశ్వర్‌‌కు. ఈ పరిచయం శారీరక సంబంధం వరకు వెళుతుంది. పరిస్థితుల కారణంగా మరదలు దేవీ (దివ్య పిళ్లై)తో ఈశ్వర్‌ను పెళ్లి చేసుకోవలసి వస్తుంది. మళ్లీ తన లైఫ్‌లోకి రాదని అనుకున్న లిజి మళ్లీ రావడంతో ఈశ్వర్‌‌కు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? ఆశ్రమంతో లిజికి ఉన్న సంబంధం ఏమిటి? లిజి అనుమానాస్పద మరణం వెనుక ఉన్న కారణాలు ఏంటి? ఆ మర్డర్ కేసు నుంచి ఈశ్వర్ ఎలా బయటపడ్డాడు. లిజిని హత్య చేసింది ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ‘తగ్గేదేలే’ సినిమా చూడాల్సిందే.

పుష్పలో అల్లు అర్జున్ పాపులర్‌‌ డైలాగ్‌ ‘తగ్గేదే లే’ ఈ టైటిల్‌తో నవీన్ చంద్ర (Naveen Chandra) హీరోగా తెరకెక్కిన సినిమా శుక్రవారం విడుదలైంది

ఎలా ఉందంటే?

ఈశ్వర్‌‌, దివ్య, లిజి మధ్య జరిగే డ్రామా ఎపిసోడ్, దండుపాళ్యం బ్యాచ్, స్వామీజీ పారడైజ్ ఆశ్రమం అనే మూడు కాన్సెప్ట్‌లతో కథ నడుస్తుంది. ఈ మూడు పాయింట్లను కలుపుతూ సినిమాను తెరకెక్కించిన తీరు దర్శకుడి ప్రతిభను తెలియజేస్తోంది. దానికి తగినట్టుగానే సరైన సమయంలో వచ్చే ట్విస్టులు.. మర్డర్‌‌ జరిగిన సీన్‌తో సినిమాను స్టార్ట్‌ చేయడంతో ప్రేక్షకులకు ఆసక్తి మొదలవుతుంది.  అయితే కథ, కథనాలను మరింత బెటర్‌గా వర్కవుట్ చేసి ఉంటే ఇంకా బాగుండేదని అనిపిస్తుంది. మర్డర్ జరిగిన విధానం, ఎవరు చేశారు అనే సస్పెన్స్, పోలీసుల ఇన్వెస్టిగేషన్‌తో కథ ఇంట్రెస్టింగ్‌గానే సాగుతుంది.

ఎవరెలా నటించారంటే?

తనకు ఉన్న అనుభవంతో నవీన్ చంద్ర క్యారెక్టర్‌‌లో బాగానే ఒదిగిపోయారు. అనన్య రాజ్‌తో చేసిన రొమాంటిక్ సీన్లలోనూ మెప్పించారు. ఇద్దరి కెమిస్ట్రీ బాగుంది. లిజి పాత్రను కొంచెం సమయం కొనసాగించి ఉంటే.. యూత్‌ఫుల్‌గా ఉండేదని అనిపిస్తుంది. లిజి క్యారెక్టర్‌‌కు అనన్య న్యాయం చేసింది. నవీన్ చంద్ర భార్యగా నటించిన దివ్య పిళ్లై గృహిణి పాత్రలో చక్కగా నటించారు. మిగిలిన నటీనటులు కూడా తమ క్యారెక్టర్లకు న్యాయం చేశారనే చెప్పాలి.  

రొమాంటిక్‌, క్రైమ్, మిస్టరీ అంశాలతో తగ్గేదేలే సినిమా తెరకెక్కింది. స్వామిజీ ఆశ్రమం, దండుపాళ్యం బ్యాచ్ స్టోరీని మరింత వివరంగా చెప్తే  బాగుండేదని అనిపిస్తుంది. రొమాంటిక్ సన్నివేశాలు సినిమాను యూత్‌పుల్‌గా మార్చాయని చెప్పవచ్చు. హింస, రక్తపాతం ఎక్కువైందని కూడా కొందరికి అనిపించవచ్చు. అయితే దండుపాళ్యం సినిమా అభిమానులకు, క్రైమ్, మర్డర్‌‌, మిస్టరీలను ఇష్టపడే వారికి నచ్చే అవకాశం ఉంది.

ప్లస్ పాయింట్స్ : కథను నడిపించిన తీరు, ట్విస్ట్‌లు

మైనస్ పాయింట్స్ : పాటలు, దండుపాళ్యం సినిమాను గుర్తుచేసేలా ఉండడం

ఒక్క మాటలో..  క్రైమ్, మిస్టరీ కథలను ఇష్టపడే వాళ్ల కోసం ‘తగ్గేదేలే’

Read More : Banaras Movie Review : టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో మరో సినిమా ‘బనారస్’..హీరోహీరోయిన్లకే ప్రయారిటీ

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!