తనకున్న మార్కెట్ ప్రకారమే నిర్మాతలు రెమ్యూనరేషన్ ఇస్తారన్న హీరో శర్వానంద్ (Sharwanand)

Updated on Aug 28, 2022 09:40 PM IST
శర్వానంద్ (Sharwanand) హీరోగా నటించిన ఒకే ఒక జీవితం సినిమా కోసం  కార్తి (Karthi) తొలిసారి పాట పాడారు
శర్వానంద్ (Sharwanand) హీరోగా నటించిన ఒకే ఒక జీవితం సినిమా కోసం కార్తి (Karthi) తొలిసారి పాట పాడారు

టాలీవుడ్‌ యంగ్‌ టాలెంటెడ్‌ హీరోల్లో శర్వానంద్ (Sharwanand) ఒకరు. ‘ప్రస్థానం’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ వంటి ఫీల్ గుడ్ సినిమాలతో పాటు ‘రన్ రాజా రన్’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ లాంటి కామెడీ ఎంటర్‌‌టైనర్స్‌తో కూడా అలరించారు శర్వా. అయితే ఇటీవల శర్వానంద్‌కు సరైన హిట్‌ దక్కలేదు. ఇటీవల ఆడాళ్లు మీకు జోహార్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అనుకున్నంత సక్సెస్‌ను అందుకోలేకపోయారు శర్వానంద్‌. శర్వానంద్ నటిస్తున్న ఒకే ఒక జీవితం సినిమాలో తమిళ స్టార్ హీరో కార్తీ ఒక పాట పాడారు.

తాజాగా శర్వానంద్ నటిస్తున్న సినిమా ఒకే ఒక జీవితం. ఇండస్ట్రీలోకి వచ్చి చాలా కాలమే అవుతున్నా వివాదాలకు ఎప్పుడూ దూరంగా ఉంటుంటారు శర్వానంద్. అయితే శర్వా ఇటీవల చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం పారితోషకం విషయంలో నిర్మాతతో వచ్చిన వివాదంపై శర్వానంద్ స్పందించారు.  

శర్వానంద్ (Sharwanand) హీరోగా నటించిన ఒకే ఒక జీవితం సినిమా కోసం  కార్తి (Karthi) తొలిసారి పాట పాడారు

అన్నీ పూర్తయ్యాకా తప్పుడు లెక్కలా..

కొంతమంది రెమ్యూనరేషన్ పూర్తిగా ఇవ్వకుండా డబ్బింగ్ కూడా చెప్పరని, అలాంటిది తాను అన్నీ పూర్తి చేస్తే, తప్పుడు లెక్కలు చెప్పి, కార్లు కొనుక్కుంటే తాను ఎలా ఊరుకుంటానని అన్నారు. అదే విధంగా తనను తాను అండర్ సేల్ చేసుకోనని, నిర్మాతలకు తన మార్కెట్ తెలుసు అని దాని ప్రకారమే తన  రెమ్యూనరేషన్ ఉంటుందని శర్వా చెప్పారు.

వరుస షూటింగులతో బిజీ కావడం, తన ప్రమాదం కారణంగా పలు రకాల మందులు వాడడం, ఏది పడితే అది తినేయడంతో 90 కిలోల వరకు బరువు పెరిగానని చెప్పారు శర్వానంద్. ఈ విషయాన్ని తాను గమనించానని, మిత్రులు కూడా చెప్పారని అన్నారు. ఎనిమిది నెలలుగా గ్యాప్ తీసుకుని, మేకోవర్ అయ్యానని శర్వానంద్ చెప్పారు.

శర్వానంద్ (Sharwanand) హీరోగా నటించిన ఒకే ఒక జీవితం సినిమా కోసం  కార్తి (Karthi) తొలిసారి పాట పాడారు

మంచి పేరు అందుకే..

‘కెరీర్‌‌లో కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కొన్ని హిట్ అయ్యాయి. ఏమైనా ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలోనే ఉండడమే కీలకం. ఏ సినిమా చేయాలి, ఏది చేయకూడదు అనే డైలమా ఎప్పుడూ ఉంటుంది. మంచి క్యారెక్టర్లను ఇప్పటివరకు వదులుకోలేదు. అందుకే ఇండస్ట్రీలో మంచి పేరు, స్థానం ఉంది’ అని శర్వానంద్ చెప్పుకొచ్చారు.  

తాను ప్రస్తుతం చేస్తున్న ‘ఒకే ఒక జీవితం’ సినిమా కథ  గొప్పది.  అలాంటి ఆలోచన రావడమే గ్రేట్ అని అన్నారు శర్వా.  వెన్నెల కిషోర్, ప్రియదర్శి, తాను టైం మెషీన్‌లో వెనక్కి వెళ్లి ఏం చేశామనేదే సినిమాలో ముఖ్యమైన అంశం అని తెలిపారు. తన క్యారెక్టర్‌‌ మాత్రం మరణించిన తల్లిని కలుసుకుంటుందని, అదో ఎమోషనల్ పాయింట్‌ అని శర్వానంద్ (Sharwanand) చెప్పారు. 

Read More : హీరో శర్వానంద్ (Sharwanand)‘ఒకే ఒక జీవితం’ సినిమా కోసం పాట పాడిన తమిళ హీరో కార్తి (Karthi)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!