New Movies : ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న కొత్త సినిమాలు.. రామ్‌ ‘ది వారియర్’, సాయి పల్లవి ‘గార్గి’

Updated on Jul 12, 2022 08:43 PM IST
New Movies: సాయి పల్లవి ‘గార్గి’, రామ్ ‘ది వారియర్’, ఆర్జీవీ ‘అమ్మాయి’, ప్రభుదేవా ‘మై డియర్ భూతం’ సినిమా పోస్టర్లు
New Movies: సాయి పల్లవి ‘గార్గి’, రామ్ ‘ది వారియర్’, ఆర్జీవీ ‘అమ్మాయి’, ప్రభుదేవా ‘మై డియర్ భూతం’ సినిమా పోస్టర్లు

లోకనాయకుడు కమల్ హాసన్‌ హీరోగా నటించిన విక్రమ్, అడివి శేష్‌ కీలకపాత్రలో నటించిన మేజర్ సినిమాల తర్వాత పెద్ద సినిమాలు థియేటర్లలో సందడి చేయలేదు. ఈ వారం ఆ సందడి మరోసారి మొదలు కాబోతోంది. ఏ సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయో చూద్దాం..    

ది వారియర్ సినిమా పోస్టర్

రామ్‌ పోతినేని (Ram Pothineni) ‘ది వారియర్‌’
రామ్‌ పోతినేని హీరోగా తమిళ డైరెక్టర్‌ లింగుసామి దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘ది వారియర్’. ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్‌గా నటించారు. ఉప్పెన ఫేమ్‌ కృతిశెట్టి హీరోయిన్‌గా నటించారు. అక్షరా గౌడ, నదియా తదితరులు కీలక పాత్రల్లో సందడి చేయనున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన ది వారియర్ సినిమా జూలై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

గార్గి సినిమా పోస్టర్

సాయి పల్లవి (Sai Pallavi) ‘గార్గి’
'విరాట పర్వం'తో హిట్‌ అందుకున్నారు హీరోయిన్ సాయి పల్లవి. తాజాగా గార్గి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారని సమాచారం, గౌతమ్‌ రామచంద్రన్‌ దర్శకత్వం వహించారు.  గార్గి సినిమా జూలై 15వ తేదీన థియేటర్లలో విడుదలకు రెడీగా ఉంది. 

మై డియర్‌ భూతం సినిమా పోస్టర్

ప్రభుదేవా (PrabhuDeva) మై డియర్‌ భూతం
ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్లర్, యాక్టర్ ప్రభుదేవా చాలాకాలం తర్వాత నటించిన సినిమా ‘మై డియర్ భూతం’. కిడ్స్‌ కామెడీ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రభుదేవా కీలకపాత్రలో నటించారు. ప్రభుదేవా, రమ్యా నంబీశన్, మాస్టర్ సాత్విక్‌ నటించిన మై డియర్ భూతం సినిమాకు ఎస్‌. రాఘవన్‌ దర్శకత్వం వహించారు. డి. ఇమ్మాన్ సంగీతం అందించిన ఈ సినిమా జూలై 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అమ్మాయి సినిమా పోస్టర్

రాంగోపాల్ వర్మ (RGV) అమ్మాయి: డ్రాగన్‌ గర్ల్
సంచలన డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కించిన సినిమా 'అమ్మాయి: డ్రాగన్‌ గర్ల్'. పూజా భలేకర్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా మార్షల్‌ ఆర్ట్స్‌, లవ్‌ కథాంశాలతో తెరకెక్కినట్టు తెలుస్తోంది. అభిమన్యు సింగ్‌, మియా ముఖి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. పాల్ ప్రవీణ్‌ కుమార్ సంగీతం అందించిన అమ్మాయి : డ్రాగన్ గర్ల్‌ జూలై 15న థియేటర్లలో విడుదల అవుతోంది. 

Read More : నాగచైతన్య (Naga Chaitanya) కోసం నిఖిల్ సిద్దార్ధ్‌ వెనక్కి తగ్గారా? కార్తికేయ2 సినిమా రిలీజ్ వాయిదా

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!