నాగచైతన్య (Naga Chaitanya) కోసం నిఖిల్ సిద్దార్ధ్‌ వెనక్కి తగ్గారా? కార్తికేయ2 సినిమా రిలీజ్ వాయిదా

Updated on Jul 12, 2022 07:18 PM IST
నిఖిల్ సిద్దార్ధ్‌, నాగచైతన్య (Naga Chaitanya), దిల్‌ రాజు
నిఖిల్ సిద్దార్ధ్‌, నాగచైతన్య (Naga Chaitanya), దిల్‌ రాజు

నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా తెరకెక్కిన కొత్త సినిమా థ్యాంక్యూ. బంగార్రాజు, లవ్‌స్టోరీ సినిమాల హిట్‌తో జోరు మీదున్నారు చై. అదే స్పీడ్‌తో థ్యాంక్యూ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. జూలై 22వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక, నిఖిల్ సిద్ధార్ధ్‌ నటించిన కొత్త సినిమా కార్తికేయ2. 2014లో వచ్చి సూపర్‌‌హిట్‌ అయిన కార్తికేయ సినిమాకు సీక్వెల్‌గా కార్తికేయ2 సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ప్రమోషన్లు కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమా కూడా జూలై 22వ తేదీనే విడుదలకు సిద్ధమైంది.

కాగా నాగచైతన్య (Naga Chaitanya) థ్యాంక్యూ, నిఖిల్ కార్తికేయ2 సినిమాలు ఒకే రోజున రిలీజ్‌కు రెడీ అయ్యాయి. అయితే, కార్తికేయ2 సినిమాతో పోలిస్తే థ్యాంక్యూ సినిమా ప్రమోషన్స్‌లో కొంత వెనుకబడింది. కార్తికేయ2 సినిమాకు వచ్చిన క్రేజ్.. థ్యాంక్యూ సినిమాకు రాలేదు. ట్రైలర్‌‌ రిలీజ్ అయిన తర్వాత కార్తికేయ2 సినిమా సస్పెన్స్‌ను క్రియేట్‌ చేసి సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక, నాగచైతన్య సినిమాకు కూడా క్రేజ్ ఉన్నప్పటికీ దానిని కార్తికేయ2 సినిమా వెనక్కు నెట్టింది.

కార్తికేయ2, థ్యాంక్యూ సినిమా పోస్టర్లు

రంగంలోకి దిగిన దిల్‌ రాజు

దీంతో  థ్యాంక్యూ సినిమా నిర్మాత దిల్‌ రాజు రంగంలోకి దిగారు. థ్యాంక్యూ సినిమాకు పోటీగా రేసులో ఉన్న కార్తికేయ2 సినిమా నిర్మాతలతో సంప్రదింపులు జరిపారని టాక్. నాగచైతన్య సినిమాకు పోటీగా కార్తికేయ2 సినిమా రిలీజ్‌ కాకుండా చూడాలని కోరారు. దీంతో నిఖిల్‌ కార్తికేయ2 సినిమా రిలీజ్‌ వాయిదా వేసుకునేందుకు మేకర్స్ అంగీకరించారని తెలుస్తోంది. త్వరలోనే కార్తికేయ2 సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారని సమాచారం. దాంతో నాగచైతన్య థ్యాంక్యూ సినిమా ఒకటే జూలై 22వ తేదీన రిలీజ్ కానుంది.

పీపుల్ మీడియా బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా తెరకెక్కిన కార్తికేయ-2 సినిమా ఆగస్టు నెలలో విడుదల చేయాలని నిర్ణయించారు. త్వరలోనే కొత్త విడుదల తేదీ ప్రకటిస్తారు. నిఖిల్, అనుపమ పరమేశ్వర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహించారు. ఇక, నాగచైతన్య (Naga Chaitanya)  హీరోగా నటించిన థ్యాంక్యూ సినిమాలో రాశీ ఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. విక్రమ్ కె కుమార్ దర్శకుడు.

Read More : రాజమౌళి సినిమా కోసం సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu) రెమ్యునరేషన్‌ అన్ని కోట్లా?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!