నయనతార (Nayanthara), విగ్నేష్ శివ‌న్‌ల‌ పెళ్లి వేడుక టీజర్‌ను రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్

Updated on Aug 09, 2022 05:56 PM IST
న‌య‌న‌తార (Nayanthara), విగ్నేష్‌ల పెళ్లి వేడుక టీజ‌ర్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ‌ నెట్ ఫ్లిక్స్ సోష‌ల్ మీడియాలో రిలీజ్ చేసింది.
న‌య‌న‌తార (Nayanthara), విగ్నేష్‌ల పెళ్లి వేడుక టీజ‌ర్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ‌ నెట్ ఫ్లిక్స్ సోష‌ల్ మీడియాలో రిలీజ్ చేసింది.

సౌత్ స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార (Nayanthara) త‌మిళ ద‌ర్శ‌కుడు విగ్నేష్ శివ‌న్‌ల పెళ్లి జూన్ 9న అంగ‌రంగ వైభవంగా జ‌రిగిన విష‌యం తెలిసిందే. అయితే వీరి పెళ్లి వీడియో మాత్రం ఇంకా బ‌య‌ట‌కు రాలేదు. ప్రముఖ ఓటీటీ సంస్థ‌ నెట్ ఫ్లిక్స్ న‌య‌న్ పెళ్లి వేడుక‌ను భారీ ధరకు కొనుగోలు చేసింది. ఇక‌ న‌య‌న్, విగ్నేష్‌ల పెళ్లి వేడుక‌ను నెట్ ఫ్లిక్స్ విడుద‌ల చేసేందుకు రెడీ అయింది. న‌య‌న్‌, విగ్నేష్‌ల పెళ్లి వేడుక టీజ‌ర్‌ను సోష‌ల్ మీడియాలో రిలీజ్ చేసింది.

అంగ‌రంగ వైభ‌వంగా పెళ్లి 
త‌మిళ‌నాడులోని మహాబలిపురంలో నయనతార (Nayanthara), త‌మిళ ద‌ర్శ‌కుడు విఘ్నేశ్‌ శివన్‌ల పెళ్లి జూన్ 9 న జ‌రిగింది. న‌య‌న్, విఘ్నేశ్‌‌ల పెళ్లికి సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్, బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్‌లు న‌య‌న్, విఘ్నేష్‌ల‌ పెళ్లికి హాజ‌ర‌య్యారు. వీరితో పాటు సూర్య‌, జ్యోతిక, కార్తీ, ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం వంటి ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. 

న‌య‌న‌తార (Nayanthara), విగ్నేష్‌ల పెళ్లి వేడుక టీజ‌ర్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ‌ నెట్ ఫ్లిక్స్ సోష‌ల్ మీడియాలో రిలీజ్ చేసింది.

మంచి ప‌నుల‌తో సాగిన ఘనమైన పెళ్లి వేడుక‌
న‌య‌న‌తార‌ (Nayanthara), విఘ్నేష్‌లు.. వీరిరువురూ తమ పెళ్లి సంద‌ర్భంగా ఎన్నో మంచి ప‌నులు కూడా చేశారు. ఆశ్ర‌మాల్లో ల‌క్షల మందికి అన్న‌దానం చేశారు. 18 వేల మంది చిన్నారుల‌కు భోజ‌నం పెట్టించారు. ఆ విధంగా న‌య‌న్, విక్కీలు త‌మ మంచి మ‌నసు చాటుకున్నారు.

న‌య‌న‌తార (Nayanthara), విగ్నేష్‌ల పెళ్లి వేడుక టీజ‌ర్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ‌ నెట్ ఫ్లిక్స్ సోష‌ల్ మీడియాలో రిలీజ్ చేసింది.

ప్రేమ టూ పెళ్లి
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌ న‌య‌న్, విక్కీల పెళ్లిని ఓ డాక్యుమెంటరీగా స్ట్రీమింగ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ డాక్యుమెంటరీని ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్ట్ చేశారు. వీరి పెళ్లి వేడుక వీడియోను రౌడీ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. న‌య‌న‌తార‌, విఘ్నేశ్‌‌ల ప్రేమ ప్ర‌యాణం.. మూడు ముళ్ల బంధం వ‌ర‌కు ఎలా సాగింద‌నే ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌తో.. ఈ డాక్యుమెంట‌రీని విడుద‌ల చేయ‌నున్నార‌ట‌. 

న‌య‌న్‌ (Nayanthara), విక్కీల పెళ్లి డాక్యుమెంట‌రిని ప్రసారం చేసేందుకు నెట్‌ఫ్లిక్స్ కొన్ని కోట్ల రూపాయ‌లు వీరికి చెల్లించ‌నుంద‌ట‌. ఆ డ‌బ్బును న‌య‌న‌తార‌, విఘ్నేశ్‌‌లు పేద‌వారి కోసం ఖ‌ర్చు చేయ‌నున్నార‌ట‌. ఇక న‌య‌న‌తార పెళ్లి వీడియోను ఎప్పుడెప్పుడు చూద్దామా ? అని అభిమానులు ఎప్ప‌టినుంచో ఎదురుచూస్తున్నారు. 

న‌య‌న‌తార (Nayanthara), విగ్నేష్‌ల పెళ్లి వేడుక టీజ‌ర్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ‌ నెట్ ఫ్లిక్స్ సోష‌ల్ మీడియాలో రిలీజ్ చేసింది.

బిజీగా న‌య‌న్, విగ్నేష్‌లు
న‌య‌న‌తార పెళ్లి త‌ర్వాత ప‌లు సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్నారు. షారూక్ ఖాన్ సినిమా 'జ‌వాన్‌'లో న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. తెలుగులో చిరంజీవి మూవీ 'గాడ్‌ఫాద‌ర్‌'లోనూ ఆయన చెల్లెలి పాత్ర‌లో న‌య‌న్ న‌టిస్తున్నారు. ఇటీవలే విఘ్నేశ్‌ తన దర్శకత్వంలో అజిత్‌తో ఓ సినిమా తెర‌కెక్కించాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

Read More: Nayanthara & Vignesh Shivan: పెళ్లి త‌ర్వాత న‌య‌న‌తార, విఘ్నేశ్‌ల ఫ్యాన్ ఫాలోయింగ్ మ‌రింత పెరిగింద‌ట‌!

న‌య‌న‌తార (Nayanthara), విగ్నేష్‌ల పెళ్లి వేడుక టీజ‌ర్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ‌ నెట్ ఫ్లిక్స్ సోష‌ల్ మీడియాలో రిలీజ్ చేసింది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!