Nayanthara & Vignesh Shivan: పెళ్లి త‌ర్వాత న‌య‌న‌తార, విఘ్నేశ్‌ల ఫ్యాన్ ఫాలోయింగ్ మ‌రింత పెరిగింద‌ట‌!

Updated on Jun 25, 2022 08:19 PM IST
సోష‌ల్ మీడియాలో న‌య‌న‌తార (Nayanthara), విఘ్నేశ్‌ల పెళ్లి, హ‌నీమూన్ ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి.
సోష‌ల్ మీడియాలో న‌య‌న‌తార (Nayanthara), విఘ్నేశ్‌ల పెళ్లి, హ‌నీమూన్ ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి.

Nayanthara & Vignesh Shivan: సౌత్ హీరోయిన్ నయనతార, త‌మిళ ద‌ర్శ‌కుడు విఘ్నేశ్‌ శివన్‌ల పెళ్లి అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. త‌మిళ‌నాడులోని మహాబలిపురంలో జూన్ 9న వీరి వివాహం జ‌రిగింది. న‌య‌న్, విఘ్నేశ్‌ పెళ్లికి సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు.

ప్ర‌స్తుతం న‌య‌న్, విఘ్నేశ్‌ల జంట‌ థాయిలాండ్‌లో హనీమూన్ ఎంజాయ్ చేసి ఇండియాకు చేరుకున్నారు. అయితే వీరి పెళ్లి నుంచి హ‌నీమూన్ జ‌ర్నీకి సంబంధించిన ఫోటోలను ఎప్ప‌టిక‌ప్పుడు అభిమానుల కోసం సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. 

సోష‌ల్ మీడియాలో న‌య‌న‌తార (Nayanthara), విగ్నేష్‌ల పెళ్లి, హ‌నీమూన్ ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి.

న‌య‌న‌తార (Nayanathara), విఘ్నేశ్‌‌ల పెళ్లి వేడుక ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. న‌య‌న‌తార త‌న పెళ్లి వేడుక ఫోటోల‌ను ఒక్కొక్కటిగా సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. మొద‌ట తాళి క‌ట్టిన త‌ర్వాత, విఘ్నేశ్‌ త‌న నుదిటిపై ముద్దు పెట్టుకునే ఫోటోను షేర్ చేశారు. ఆ త‌ర్వాత కొద్ది నిమిషాల‌కు తాళి క‌ట్టే ఫోటోను షేర్ చేశారు.

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ చేతుల మీదుగా వీరి పెళ్లి జ‌రిగింది. ర‌జ‌నీకాంత్ త‌న చేతుల‌తో విఘ్నేశ్‌‌కు తాళిని అందించారు. ర‌జ‌నీకాంత్‌తో పాటు బంధుమిత్రుల ఆశీర్వాదంతో విఘ్నేశ్‌ న‌య‌న్ మెడ‌లో మూడు ముళ్లు వేశారు. 

సోష‌ల్ మీడియాలో న‌య‌న‌తార (Nayanthara), విఘ్నేశ్‌ల పెళ్లి, హ‌నీమూన్ ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి.

విఘ్నేశ్‌ కూడా త‌న ట్విట్ట‌ర్‌లో పెళ్లి ఫోటోను షేర్ చేశారు. న‌య‌న‌తార‌ (Nayanathara)తో ప్రేమ బంధం, పెళ్లిగా మారిందంటూ పోస్ట్ చేశారు. 'ఇద్ద‌రం పెళ్లి బంధంతో ఒక‌ట‌య్యాం' అని త‌న అభిమానుల‌కు తెలిపారు.ఏడేళ్ల ప్రేమ‌ను పెళ్లితో  నూరేళ్ల బంధంగా మార్చుకున్నామంటూ సంతోషం వ్య‌క్తం చేశారు. 

న‌య‌న‌తార‌ (Nayanthara), విఘ్నేశ్‌లు పెళ్లి చేసుకున్న త‌ర్వాత రోజు,  తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామిని ద‌ర్శించుకున్నారు. శ్రీవారిని ద‌ర్శించుకుని తమ మొక్కులను తీర్చుకున్నారు. రంగ‌నాయ‌కుల మండ‌పంలో వేద పండితులు ఈ  నూత‌న జంట‌ను ఆశీర్వ‌దించారు. న‌య‌న్, విక్కీల‌కు పండితులు తీర్థ‌ప్ర‌సాదాలు అంద‌జేశారు. 

న‌య‌న‌తార (Nayanthara), విఘ్నేశ్‌లు భార్య‌భ‌ర్త‌లుగా మీడియా ముందుకు వ‌చ్చారు. మీడియా మిత్రుల‌కు అదిరిపోయే పార్టీ ఇచ్చారు. న‌య‌న‌తార ముఖంలో ఎంతో కూడా సంతోషం క‌నిపించింది. విఘ్నేశ్‌తో పెళ్లి అనే క‌ల నెర‌వేరిన‌ట్టుగా న‌య‌న్ ఫీల్ అవుతున్నట్లు అనిపించింది. కొత్త పెళ్లి కూతురిగా సిగ్గుప‌డుతూ, న‌య‌న్ ఎంతో అందంగా క‌నిపించారు. ఇక విఘ్నేశ్‌ కూడా పెళ్లి త‌ర్వాత ఫుల్ హ్యాపీగా క‌నిపించారు. 

తమ పెళ్లి ప‌నుల‌ను న‌య‌న్, విఘ్నేశ్‌లే ద‌గ్గ‌రుండి మ‌రీ చూసుకున్నారు. అతిథుల‌ను ఆహ్వానించడం దగ్గర నుంచి, భోజ‌నాల వ‌ర‌కు అన్ని విషయాల మీదా విఘ్నేశ్‌ స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టారు. ఇక ఈ జంట పెళ్లి సంద‌ర్భంగా ల‌క్ష‌ల మందికి అన్న‌దానం చేశారు. ప‌లు సేవా కార్య‌క్ర‌మాలను నిర్వ‌హించి ప్రేక్ష‌కుల నుంచి ప్ర‌శంస‌లు పొందారు. చిన్నారుల‌కు, వృద్ధుల‌కు విందు భోజ‌నాలను ఏర్పాటు చేశారు. 

న‌య‌న‌తార‌, విఘ్నేశ్‌లు ఇద్ద‌రూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇష్ట‌ప‌డిన వారిని పెళ్లి చేసుకోవ‌డంలో ఎంతో ఆనందం ఉందని ఈ సందర్భంగా నయనతార సోషల్ మీడియా వేదికలలో పోస్టు చేశారు. గత కొద్ది రోజుల నుండి.. వీరిద్ద‌రి హ‌నీమూన్ టూర్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌ను సోష‌ల్ మీడియాలో అందిస్తున్నారు. 

థాయిలాండ్‌కు వెళ్లిన న‌య‌న్, విఘ్నేశ్‌‌లు  ప‌లు ఫోటోల‌ను షేర్ చేశారు. ఒక జీవిత బంధాన్ని ఏర్పరచుకొని, ఎంతో ఆనందంగా, సంతోషంగా ఉన్నామంటూ చెప్ప‌క‌నే చెబుతున్నారు ఈ జంట‌. 

హ‌నీమూన్ త‌ర్వాత న‌య‌న‌తార ప‌లు సినిమాల్లో న‌టించ‌నున్నారు. ఇటీవలే నయనతార (Nayanthara) O2 అనే చిత్రంలో నటించారు. అలాగే చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ చిత్రంలో కూడా ఆమె నటిస్తున్నారు. మలయాళం చిత్రం లూసిఫర్‌కు రీమేక్‌గా గాడ్ ఫాదర్ చిత్రం తెరకెక్కుతుందన్న సంగతి తెలిసిందే. మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 

నయనతార (Nayanthara) గతంలో తెలుగులో కూడా చాలా సినిమాలలో నటించారు. ముఖ్యంగా దుబాయ్ శీను, లక్ష్మీ, శ్రీరామ రాజ్యం, సింహా లాంటి చిత్రాలు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. ముఖ్యంగా శ్రీరామరాజ్యంలోని సీతాదేవి పాత్రలో నయన్ ఒదిగిపోయారు. అలాగే కర్తవ్యం, అమ్మోరు తల్లి లాంటి డబ్బింగ్ సినిమాలకు కూడా నయనతారకు తెలుగు ప్రేక్షకుల వద్ద మంచి మార్కులే పడ్డాయి. 

సోష‌ల్ మీడియాలో న‌య‌న‌తార (Nayanthara), విగ్నేష్‌ల పెళ్లి, హ‌నీమూన్ ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి.

నయనతార (Nayanthara) భర్త విఘ్నేశ్‌ శివన్ కూడా అజిత్‌తో ఓ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఆ సినిమా ప్రొడక్షన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. ఈ సంవత్సరమే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. నయనతార నటించిన సినిమాలకు కూడా గతంలో విఘ్నేశ్‌ దర్శకత్వం వహించారు. 

న‌య‌న‌తార గ్లామ‌ర్ రోల్స్‌లో ఇక క‌నిపించ‌ర‌నే టాక్ వినిపిస్తుంది. కీల‌క‌మైన పాత్ర‌ల్లో న‌య‌న‌తార న‌టిస్తార‌ట‌. క‌థా బ‌ల‌మున్న సినిమాల‌లో న‌య‌న‌తార న‌టిస్తార‌ట‌. 

Read More: Nayanthara : నయనతార నటనా ప్రతిభను చాటిన.. టాప్ 10 చిత్రాలు మీకోసం ప్రత్యేకం !

సోష‌ల్ మీడియాలో న‌య‌న‌తార (Nayanthara), విగ్నేష్‌ల పెళ్లి, హ‌నీమూన్ ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!