త‌న పెళ్లికి హాజ‌రైన అతిథుల ఫోటోల‌ను షేర్ చేసిన న‌య‌నతార (Nayanthara)

Updated on Jul 09, 2022 04:01 PM IST
Nayanthara: ర‌జ‌నీ, షారూక్‌ల‌తో త‌న‌ పెళ్లిలో దిగిన ఫోటోల‌ను న‌య‌న‌తార ట్విట్ల‌ర్‌లో షేర్ చేశారు. 
Nayanthara: ర‌జ‌నీ, షారూక్‌ల‌తో త‌న‌ పెళ్లిలో దిగిన ఫోటోల‌ను న‌య‌న‌తార ట్విట్ల‌ర్‌లో షేర్ చేశారు. 

సౌత్ లేడీ సూపర్ స్టార్ న‌య‌న‌తార (Nayanthara), త‌మిళ ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్‌ల పెళ్లి అంగ‌రంగ వైభవంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. స‌రిగ్గా నెల రోజుల క్రితం వీరిద్ద‌రు మూడు ముళ్ల బంధంతో ఒక‌ట‌య్యారు. న‌య‌న‌తార‌, విగ్నేష్‌లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహానికి ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖ‌లు హాజ‌ర‌య్యారు.

త‌మిళ‌నాడులోని మ‌హాబ‌లిపురంలో న‌య‌న‌తార‌, విగ్నేష్‌ల పెళ్లి జూన్ 9న జ‌రిగింది.న‌య‌న‌తార త‌న‌ పెళ్లి జ‌రిగి నెల రోజులు అవుతుందంటూ సోష‌ల్ మీడియాలో ఫోటోల‌ను షేర్ చేశారు. త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్, బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్‌లు న‌య‌న్, విఘ్నేష్‌ల‌ పెళ్లికి హాజ‌ర‌య్యారు. ర‌జ‌నీ, షారూక్‌ల‌తో త‌న‌ పెళ్లిలో దిగిన ఫోటోల‌ను న‌య‌న‌తార ట్విట్ల‌ర్‌లో షేర్ చేశారు. 

న‌య‌న్ కొత్త ఇంటి సంగ‌తులు
త‌న భ‌ర్త విఘ్నేష్ కోసం న‌య‌న‌తార ఓ పెద్ద బంగ్లాను గిప్ట్‌గా ఇచ్చారు. అందులో ఇంటీరియర్ డిజైన్ కోసమే ఏకంగా రూ. 25కోట్లు ఖర్చు చేశార‌ట‌. పెళ్లి అయ్యాక న‌య‌న్, విగ్నేష్‌లు ఆ ఇంట్లోనే కాపురం పెట్ట‌నున్నారు. న‌య‌న్ కొనుగోలు చేసిన ఇల్లు త‌మిళ సినీ, రాజ‌కీయ సెల‌బ్రిటీలు ఎక్కువ‌గా ఉంటారు. త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ నివాసం కూడా న‌య‌న్ ఇంటికి ద‌గ్గ‌ర‌ట‌. అలాగే జయలలిత, శశికళ వంటి రాజకీయ ప్రముఖులు ఇక్కడే ఖరీదైన బంగ్లాలలో ఉండేవారు. 

ప్ర‌స్తుతం న‌య‌న‌తార హానీమూన్ నుంచి తిరిగి వ‌చ్చాక షారూక్ ఖాన్ సినిమా జ‌వాన్ షూటింగ్‌లో పాల్గొంది.  ముంబైలో జ‌రిగిన‌ షూటింగ్‌కు హాజ‌ర‌య్యారు. సౌత్‌లోనే కాకుండా నార్త్‌లోనూ త‌న న‌ట విశ్వ‌రూపం చూపించాల‌నుకుంటున్నారు న‌య‌న‌తార (Nayanthara).

Read More: Nayanthara & Vignesh Shivan: పెళ్లి త‌ర్వాత న‌య‌న‌తార, విఘ్నేశ్‌ల ఫ్యాన్ ఫాలోయింగ్ మ‌రింత పెరిగింద‌ట‌!

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!