బంపర్ ఆఫర్ కొట్టేసిన నేషనల్ క్రష్.. ‘ఆషికీ’ సీక్వెల్‌లో హీరోయిన్‌గా రష్మికా మందాన (Rashmika Mandanna)!
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమాతో భారీ క్రేజ్‌ను తెచ్చుకున్నారు హీరోయిన్ రష్మికా మందాన (Rashmika Mandanna). ఈ సినిమాతో నేషనల్ క్రష్‌గా మారారు. పుష్ప సినిమా తర్వాత రష్మికకు బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌తో గుడ్‌బై సినిమాలో నటించారు.
రష్మికకు బాలీవుడ్‌లో మరో క్రేజీ ఆఫర్ కొట్టేసినట్టు తెలుస్తోంది. బాలీవుడ్‌లో సూపర్‌హిట్ అయిన సినిమాకు తెరకెక్కించే సీక్వెల్‌లో నటించే అవకాశం దక్కించుకున్నారని టాక్. ఇప్పటికే ఆషికీ సినిమాకు సీక్వెల్‌గా ఆషికీ2 వచ్చింది. ఆ సినిమాకు సీక్వెల్‌గా ఆషికీ3ను తెరకెక్కించనున్నారని సమాచారం. ఆ సీక్వెల్‌లో హీరోయిన్‌గా రష్మిక ఎంపికైనట్టు వార్తలు వస్తున్నాయి.
టి సిరీస్ నిర్మాణంలో..
ఆషికీ సినిమా రెండు సిరీస్‌లు విడుదలై ఘన విజయం సాధించాయి. అందులో నటించిన వాళ్లు స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకున్నారు. ఆషికీ3ను టి.సిరీస్ సంస్థ నిర్మిస్తున్నట్టు ప్రకటించింది. కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు అనురాగ్ బసు దర్శకత్వం వహించనున్నారు. ఆషికీ3 సినిమాలో రష్మికా మందాన ఎంపిక దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తోంది.
అయితే, ఆషికీ3 సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైనట్టు త్వరలో అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం. రష్మికా మందాన మరో లక్కీ చాన్స్ కొట్టేసిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో రష్మికా మందాన (Rashmika Mandanna) బాలీవుడ్‌లో సెటిలైనట్లేననే వార్తలు కూడా వస్తున్నాయి.
Read More : పుష్ప (Pushpa) సినిమాతో వచ్చిన క్రేజ్‌ను బాగానే క్యాష్ చేసుకుంటున్న రష్మికా మందాన (Rashmika Mandanna)..