రష్మిక మందన్న (Rashmika Mandanna) కు స్వయంవరం.. అందులో ఈ హీరోలు తప్పనిసరి అంటున్న బ్యూటీ!

Updated on Oct 06, 2022 11:46 PM IST
'గుడ్ బై' ప్రమోషన్లలో పాల్గొన్న రష్మిక (Rashmika Mandanna) తన స్వయంవరంలో ఎవరెవరు ఉండాలో చెప్పి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.
'గుడ్ బై' ప్రమోషన్లలో పాల్గొన్న రష్మిక (Rashmika Mandanna) తన స్వయంవరంలో ఎవరెవరు ఉండాలో చెప్పి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.

టాలీవుడ్ మూవీ 'పుష్ప' బ్యూటీ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతోంది. ప్రస్తుతం సౌత్ తో పాటు నార్త్‌లోనూ వరుస ఆఫర్లను అందుకుంటూ సత్తా చాటుతున్న ఈ అమ్మడు.. త్వరలోనే 'గుడ్ బై' సినిమాతో ప్రేక్షకుల‌ను పలకరించ‌బోతోంది. కాగా, బాలీవుడ్‌లో విడుదల కాబోతున్న రష్మిక తొలి చిత్రమిది. 

వికాస్ భల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'గుడ్ బై' (Good Bye) చిత్రంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్, ర‌ష్మిక మంద‌న్నా కీలక పాత్ర‌లు పోషించారు. ఇక, ఈ సినిమా ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని అక్టోబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రష్మిక మందన్న గుడ్ బై ప్రమోషన్లలో బిజీగా ఉంది. 

ఇదిలా ఉంటే.. 'గుడ్ బై' ప్రమోషన్లలో పాల్గొన్న రష్మిక ఎన్నో విషయాలను వెల్లడించింది. ఇందులో భాగంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈమె తన స్వయంవరంలో ఎవరెవరు ఉండాలో చెప్పి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ గురించి కూడా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. 

రష్మిక (Rashmika Mandanna) మాట్లాడుతూ.. "నా స్వయంవరంలో ప్రస్తుతం నేను వర్క్ చేస్తున్న హీరోలు ఉండాలి.. అందులో విజయ్ దళపతి, అల్లు అర్జున్, రణబీర్ కపూర్ ఉండాలనుకుంటున్నట్లు తెలిపింది. అలాగే 'జీలే జరా' లాంటి సినిమాలలో అవకాశం వస్తే అలియా భట్, సమంతతో (Samantha) కలిసి నటించాలని ఉందని" చెప్పుకొచ్చింది. 

అయితే, ఈ ముగ్గురు హీరోలతో ప్రస్తుతం రష్మిక సినిమాలు చేస్తోంది. అందుకే ఆ ముగ్గురు హీరోలు త‌న స్వయంవరంలో ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొంది. కాగా, తెలుగులో అల్లు అర్జున్ స‌ర‌స‌న 'పుష్ప 2' (Pushpa 2), విజ‌య్ ద‌ళ‌ప‌తికి జోడీగా 'వ‌రిసు', బాలీవుడ్‌లో ర‌ణ‌బీర్ క‌పూర్‌తో క‌లిసి 'యానిమ‌ల్‌' అనే సినిమాలలో నటిస్తోంది. ఈ మూడు సినిమాలూ ప్రస్తుతం సెట్స్ మీద ఉన్నాయి.

ఇక 'కాఫీ విత్ కరణ్' షోలో విజయ్ దేవరకొండ గురించి సారా అలీ ఖాన్ (Sara Ali Khan), జాన్వీ కపూర్ (Janhvi Kapoor) చేసిన కామెంట్స్ చూసినప్పుడు మీ రియాక్షన్ ఏంటని అడగ్గా.. పెద్దగా నవ్వేశానని పేర్కొంది. విజయ్ దేవరకొండను కలిసిన ప్రతిసారి అతనితో బ్యాడ్మింటన్ ఆడతానని చెప్పింది. అలాగే బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కు పెద్ద అభిమానిని అని.. అతనితో కలిసి పనిచేయాలనుకుంటున్నట్లు తెలిపింది. కాగా, రష్మిక చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. 

Read More: ''నా మాజీ బాయ్ ఫ్రెండ్స్ ని నేను ఇప్పటికీ మంచి స్నేహితులలాగే భావిస్తా'' : రష్మిక మందన్నా (Rashmika Mndanna)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!