డార్లింగ్ (Prabhas) ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ప్రాజెక్టు కే’ నుంచి క్రేజీ అప్ డేట్ రానుందన్న నాగ్ అశ్విన్!

Updated on Oct 22, 2022 07:33 PM IST
 ‘ప్రాజెక్ట్ కే’ (Project K) చిత్రం నుంచి ఆదివారం ఓ క్రేజీ అప్ డేట్ రానుందని ఆ చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) చెప్పారు
‘ప్రాజెక్ట్ కే’ (Project K) చిత్రం నుంచి ఆదివారం ఓ క్రేజీ అప్ డేట్ రానుందని ఆ చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) చెప్పారు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ఆదివారంతో 43వ పడిలోకి అడుగు పెట్టనున్నారు. ఈ బర్త్ డే ఆయన అభిమానులకు పెద్ద పండుగే. అందుకే డార్లింగ్ పుట్టిన రోజు వేడుకలను ఎక్కడికక్కడ గ్రాండ్‌గా జరిపేందుకు ఆయన ఫ్యాన్స్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ప్రభాస్ మాత్రం ఈసారి సెలబ్రేషన్స్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారట. తాను ప్రాణప్రదంగా ప్రేమించే పెదనాన్న కృష్ణంరాజును కోల్పోయిన బాధలో ఉన్న ప్రభాస్.. ఈ ఏడాది పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండాలని ఫిక్స్ అయ్యారని సమాచారం. 

బర్త్ డే వేడుకలకు దూరంగా ఉండాలని అనుకుంటున్న ప్రభాస్.. తన అభిమానులను కూడా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించొద్దని సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎటువంటి హంగామా చేయొద్దని ఫ్యాన్స్‌కు డార్లింగ్ సూచించారట. ఈ విషయాన్ని పక్కనబెడితే.. ప్రభాస్ ఇప్పుడు ‘సలార్’, ‘ఆదిపురుష్​’, ‘ప్రాజెక్ట్ కే’ చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిలో ‘ఆదిపురుష్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. మిగిలిన రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. తాజాగా మారుతి దర్శకత్వంలో మరో సినిమాకు డార్లింగ్ ఓకే చెప్పిన విషయం తెలిసిందే. 

ప్రభాస్ పుట్టిన రోజున ఆయన సినిమాల నుంచి ఏదో ఒక అప్ డేట్ వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. అందుకు తగ్గట్లే ‘ప్రాజెక్ట్ కే’ (Project K) దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు. గతేడాది ‘ప్రాజెక్ట్ కే’ గురించి అడిగితే ‘రాధేశ్యామ్’ తర్వాతే అని ఆయన చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడైనా ఆ మూవీ గురించి ఏదైనా అప్‌డేట్ ఇవ్వముంటూ డార్లింగ్ ఫ్యాన్స్ ఆయనను అడిగారు.  దీనికి నాగ్ అశ్విన్ రియాక్ట్ అయ్యారు. ప్రభాస్ బర్త్ డేకి చిన్న అప్‌డేట్ వస్తుందని బదులిచ్చారు. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక, ‘ప్రాజెక్ట్ కే’లో ప్రభాస్ సరసన దీపికా పదుకోణ్​ నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. వైజయంతీ మూవీస్ పతాకంపై సీనియర్ నిర్మాత సి.అశ్వనీదత్ ‘ప్రాజెక్ట్ కే’ను నిర్మిస్తున్నారు. హాలీవుడ్ లెవల్లో భారీ వ్యయంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మరి, ఈ సినిమాతో ప్రభాస్ ఇమేజ్ పాన్ వరల్డ్ స్థాయికి ఎగబాకుతుందేమో చూడాలి. 

Read more: ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతున్న సంచలన మూవీ ‘కాంతార’ (Kantara)!.. ఈ సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే? 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!