Sita Ramam: ద‌ర్శ‌కుడిని చూసి భావోద్వేగానికి గురైన‌ 'సీతారామం' హీరోయిన్ (Mrunal Thakur)

Updated on Aug 06, 2022 01:01 PM IST
Sita Ramam: 'సీతారామం' సినిమా చూసిన హీరో హీరోయిన్లు ఎమోష‌న‌ల్ అయ్యారు. ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడిని హ‌త్తుకుని మ‌రీ ఏడ్చేశారు.
Sita Ramam: 'సీతారామం' సినిమా చూసిన హీరో హీరోయిన్లు ఎమోష‌న‌ల్ అయ్యారు. ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడిని హ‌త్తుకుని మ‌రీ ఏడ్చేశారు.

దుల్క‌ర్ స‌ల్మాన్‌, మృణాళ్‌ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా న‌టించిన 'సీతారామం' (Sita Ramam) సినిమా బ్లాక్ బాస్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ’అందాల రాక్ష‌సి’ ఫేం హ‌నురాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా విడుద‌లైంది. 'సీతారామం' సినిమా చూసిన హీరో హీరోయిన్లు ఎమోష‌న‌ల్ అయ్యారు. ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడిని హ‌త్తుకుని మ‌రీ ఏడ్చేశారు. ప్ర‌స్తుతం ఆ విజువ‌ల్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

ఎమోష‌న‌ల్ అయిన మృణాళ్

'సీతారామం' సినిమాలో దుల్క‌ర్ స‌ల్మాన్‌,  మృణాళ్‌ ఠాకూర్ న‌ట‌న‌కు సినీ ప్ర‌ముఖుల ప్ర‌శంస‌లు అందుతున్నాయి. ఈ సినిమాను చూసిన దుల్క‌ర్, మృణాళ్ ఎమోష‌న‌ల్ అయ్యారు. సినిమాను గొప్ప‌గా చిత్రీక‌రించిన ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడిని హ‌త్తుకుని ఆనంద‌భాష్పాలు కార్చారు. వెండితెర‌పై తన సీన్లు ఎంతో గొప్ప‌గా తెర‌కెక్కించారంటూ మృణాళ్‌ ఠాకూర్ ద‌ర్శ‌కుడిని ప్ర‌శంసించారు. ప్రేక్ష‌కుల స్పంద‌న చూసిన మృణాళ్ హ‌ను రాఘ‌వ‌పూడిని ప‌ట్టుకుని ఏడ్చేశారు.

'సీతారామం' సినిమాను చూసిన ప్రేక్ష‌కులు అదిరిపోయే రివ్యూలు ఇస్తున్నారు. ఓ మంచి ప్రేమ‌క‌థా చిత్రాన్ని  ఎంతో అద్భుతంగా హ‌ను రాఘ‌వ‌పూడి తెర‌కెక్కించారని అంటున్నారు. ప్రతీ స‌న్నివేశాన్ని చాలా చ‌క్క‌గా పండించార‌న్నారు. దుల్క‌ర్ స‌ల్మాన్ కూడా ద‌ర్శ‌కుడిని చూసి ఎమోష‌న‌ల్ అయ్యారు. పుష్ప త‌ర్వాత  రష్మిక మందన్న (Rashmika Mandanna) పాన్ ఇండియా హీరోయిన్‌గా మారారు.  ఆమె ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టించ‌డం విశేషం. 

Read More: Sitaramam Movie Review: మనసుకు హత్తుకునే కథ ‘సీతారామం’ .. దుల్కర్‌‌, మృణాల్‌‌ల కెమిస్ట్రీకి ఫ్యాన్స్ ఫిదా !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!