Sitaramam: ‘సీతారామం’ నుంచి ప్రేమ పాట రిలీజ్.. 'అంతరిక్షం అంచుదాక ప్రేమ' అంటున్న దుల్కర్
Sitaramam: ‘సీతారామం’ చిత్రంలోని 'ఓ ప్రేమ' అంటూ సాగే ఎమోషనల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ‘సీతారామం’ - యుద్ధంతో రాసిన ప్రేమకథ అనే హ్యాష్ ట్యాగ్‌తో రిలీజ్ కానుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై నిర్మాత సి.అశ్వనీదత్ నిర్మిస్తున్నారు.
దుల్కర్ సల్మాన్ రామ్ అనే జవాన్ పాత్రలో కనిపించబోతున్నారు. టాలీవుడ్ హీరో సుమంత్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. హీరోయిన్ రష్మిక మందన్న కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో బ్రిగేడియర్ విష్ణు శర్మ పాత్రలో కనిపించనున్నారు. అన్ని షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించనున్నారు.
మనసును హత్తుకునే పాటగా ఓ ప్రేమ
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ మధ్య సాగిన ప్రేమ పాట య్యూటూబ్‌లో దూసుకుపోతుంది. ఈ పాటను తెలుగు, తమిళ్, మలయాళంలో రిలీజ్ చేశారు. ఓ ప్రేమ పాట చక్కటి పదాలతో సాగింది. 'వస్తా.. నీవెంటనే.. ఉంటా నీ వెంటనే.. ఓ ప్రేమ' అంటూ సాగే పాటకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. 'అంతరిక్షం అంచుదాక ప్రేమ తాకిందా' అంటూ ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ అందించారు. గాయకులు కపిల్, చిన్మయిలు ఆలపించారు.
ప్రేమ లేఖలే కీలకమా!
అనాధైన లెఫ్టినెంట్ రామ్‌కు ఓ అమ్మాయి నుంచి ప్రేమలేఖలు అందుతాయి. సీతామాలక్ష్మి అనే అమ్మాయి రామ్‌కు ఎందుకు ప్రేమ లేఖలు రాస్తుంది. వీరిద్దరు ఎలా కలుసుకుంటారు?. వీరి ప్రేమ పెళ్లి పీటలెక్కుతుందా?. మరి రష్మిక మందన్న (Rashmika Mandanna) రామ్ గురించి ఎందుకు తెలుసుకోవాలనుకుంటుంది?. ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే.. ఆగస్టు 5న రిలీజ్ అయ్యే 'సీతారామం' సినిమా చూడాల్సిందే.
Read More : Sitaramam Trailer: ఒంటరి సైనికుడికి.. ఓ యువతికి మధ్య నడిచే 1965 నాటి ప్రేమ కథ.. 'సీతారామం' ట్రైలర్!