‘గాడ్‌ఫాదర్’ సినిమా రిలీజ్‌పై సూచనలు చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi).. ఖైదీ గెటప్‌ కలిసొచ్చేనా!

Updated on Sep 04, 2022 02:55 PM IST
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటిస్తున్న గాడ్‌ఫాదర్ సినిమాను దసరా పండుగకు విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటిస్తున్న గాడ్‌ఫాదర్ సినిమాను దసరా పండుగకు విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గాడ్‌ఫాదర్. లూసిఫర్ మూవీకి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుంతోంది. గాడ్‌ఫాదర్ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఈ సినిమాతో తెలుగు సినిమాలో నేరుగా మొదటిసారి నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదలకు సంబంధించిన ఓ వార్త ఒకటి వైరల్ అవుతోంది.

మలయాళంలో మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ‘లూసిఫర్’ సినిమా కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుంతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రీ రిలీజ్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.చిరంజీవి రఫ్‌లుక్‌తో కేక పుట్టించారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది.

కలిసొచ్చే గెటప్‌..

గాడ్‌ఫాదర్‌‌ సినిమాలో చిరంజీవి తనకు కలిసొచ్చే ఖైదీ పాత్రలో కూడా కనిపించనున్నారు. గతంలో వచ్చిన ‘ఖైదీ, ‘ఖైదీ నంబర్ 786’, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, అల్లుడా మజాకా, ఖైదీ నంబర్ 150 సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఆ సినిమాలు మెగాస్టార్ కెరీర్‌‌లో మైలురాళ్లుగా నిలిచాయి.  ఖైదీ గెటప్‌లో చిరంజీవి ఈ సినిమాలో కూడా కనిపించనున్న నేపథ్యంలో సెంటిమెంట్ ప్రకారం బాక్సాఫీస్ దగ్గర గాడ్‌ఫాదర్ సినిమా రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటిస్తున్న గాడ్‌ఫాదర్ సినిమాను దసరా పండుగకు విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు

చిరంజీవి గాడ్‌ఫాదర్‌కు సంబంధించిన మరో న్యూస్ తాజాగా వైరల్ అవుతోంది. దసరా సందర్భంగా విడుదలవుతున్న ఈ సినిమాను ఎన్ని థియేటర్లలో విడుదల చేయాలనే విషయంపై మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారని  తెలుస్తోంది. 

ట్రెండ్‌కు దూరంగా..

చిరంజీవి లాంటి పెద్ద హీరోల సినిమాలు విడుదల అవుతున్నాయంటే హడావుడి మామూలుగా ఉండదు. ఏ థియేటర్‌‌లో చూసినా ఆ సినిమాయే కనిపిస్తుంది. అయితే ఈసారి ఆ ట్రెండ్‌కు దూరంగా ఉండాలని అనుకుంటున్నారట మేకర్స్. ఈ విషయంలో చిరంజీవి కూడా సానుకూలంగా ఉన్నారని సమాచారం.

చిరంజీవి గాడ్‌ఫాదర్‌‌ సినిమాకు పోటీగా నాగార్జున ది ఘోస్ట్‌ సినిమా కూడా అదే రోజున రిలీజ్ కానుంది. అంతేకాదు, మెగాస్టార్ చిరంజీవికి ఆచార్య సినిమా ఫలితం భారీ షాక్ ఇచ్చింది. దీంతో హడావుడి లేకుండా గాడ్‌ఫాదర్ సినిమా విడుదల చేయాలని సూచించినట్టు తెలుస్తోంది.

గాడ్‌ఫాదర్ సినిమా ఫలితం కూడా తేడా కొడితే దాని ప్రభావం తర్వాత వచ్చే సినిమాల కలెక్షన్లపై పడతాయని చిరంజీవి (Chiranjeevi) భావిస్తున్నారని టాక్. సీరియర్ పొలిటికల్ డ్రామాగా గాడ్‌ఫాదర్‌‌ సినిమా తెరకెక్కుతోంది. సెప్టెంబర్ 30 లేదా అక్టోబర్ 5వ తేదీన గాడ్‌ఫాదర్‌‌ సినిమాను విడుదల చేయాలనే ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. 

Read More : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), అల్లు అర్జున్ (Allu Arjun) లపై.. దేవి శ్రీ ప్రసాద్ కామెంట్లు‌!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!