Rangamarthanda Logo: క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో 'రంగమార్తాండ'.. టైటిల్ లోగో విడుదల!

Updated on Jul 09, 2022 06:33 PM IST
తాజాగా ఈ రంగమార్తాండ సినిమా టైటిల్ లోగోను (Rangamarthanda Logo) యూనిట్ సభ్యులు విడుదల చేశారు. 
తాజాగా ఈ రంగమార్తాండ సినిమా టైటిల్ లోగోను (Rangamarthanda Logo) యూనిట్ సభ్యులు విడుదల చేశారు. 

Rangamarthanda Logo: టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'రంగమార్తాండ'. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం సారథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాగా, ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, ఆదర్శ్ బాలకృష్ణ, అలీ రెజా, అనసూయ, శివాత్మిక రాజశేఖర్ తదితరులు నటించారు. 

హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్ పై కాలిపు మధు, ఎస్. వెంకటరెడ్డిలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకొని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. అంతేకాదు త్వరలో విడుదలకు కూడా సన్నద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర టైటిల్ లోగోను (Rangamarthanda Logo) యూనిట్ సభ్యులు విడుదల చేశారు. 

రంగమార్తాండ (Rangamarthanda Movie) సినిమా టీజర్ , ట్రైలర్ త్వరలో విడుదల కానున్నాయి. ఆగస్ట్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మన అమ్మానాన్నల కథ అనే క్యాప్షన్‌తో 'రంగమార్తాండ' థియేటర్స్‌లో విడుదల కానుంది. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. 

'రంగమార్తాండ' సినిమా మరాఠి క్లాసిక్ 'నటసామ్రాట్‌' సినిమాకు రీమేక్‌గా వస్తోంది. కృష్ణవంశీ (Director Krishna Vamsi) ఈ చిత్రాన్ని అన్ని విధాలా గొప్పగా ఉండేలా రూపొందిస్తున్నాడు. ఆయన కెరీర్‌లో 21వ సినిమాగా ఈ చిత్రం విడుదల కానుంది. ఒరిజినల్ చిత్రంలో నానా పాటేకర్ పోషించిన పాత్రని ఇందులో ప్రకాష్ రాజ్ చేస్తున్నారు. ఇక, చాలా రోజుల తర్వాత బ్రహ్మనందం కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. 

మరో పాత్రలో జబర్దస్త్ హాట్ యాంకర్ అనసూయని (Anchor Anasuya) తీసుకున్నారు. ఈ సినిమాలో అనసూయ దేవదాసిగా నటిస్తోందట. అంటే గుడిలోని దేవుడి ఉత్సవాలలో నాట్యం చేస్తూ. జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండే స్త్రీ పాత్రలో నటిస్తోందట అనసూయ. అంతేకాదు.. ఈ సినిమాలో సీన్స్‌కి అనుగుణంగా ఓ ప్రత్యేకపాటలో అనసూయ నటించాల్సి ఉంటుందట. అనసూయ పాత్రకు అదిరిపోయే రెస్పాన్స్ రానుందట. 

దీనికి తోడు కృష్ణవంశీ నుంచి చాలా కాలం తర్వాత ఓ సినిమా వస్తుండడంతో, ఈ ప్రాజెక్టుపై మంచి అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు కృష్ణవంశీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సిందూరం, డేంజర్, అంతఃపురం, గులాబి, మురారి, చందమామ, మహాత్మ లాంటి సినిమాలు కృష్ణవంశీ కెరీర్‌లో అద్భుతమైన చిత్రాలుగా నిలిచాయి. ఆయన నుంచి సినిమాలు వస్తున్నాయంటే ఓ క్రేజ్ ఉంటుంది. ఆయన సినిమాలు చాలా ప్రత్యేకమైనవి. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఆయనకు సరైన హిట్ లేదు. రామ్ చరణ్‌తో (Ram Charan) తెరకెక్కించిన 'గోవిందుడు అందరివాడేలే' ఫరవాలేదనిపించింది.

Read More: Faria Abdullah: వాహ్వా అనిపించేలా 'ఫరియా అబ్దుల్లా' బెల్లీ డ్యాన్స్.. కుర్రాళ్లు ఫిదా.. వీడియో వైరల్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!