Shivathmika Rajashekar: ఈ సినిమా తప్పకుండా ఆడాలి అంటూ.. స్టేజ్ మీద ఏడ్చేసిన హీరోయిన్ శివాత్మిక రాజశేఖర్!

Updated on Dec 08, 2022 03:01 PM IST
‘పంచతంత్రం’ సినిమా చూస్తుంటే ఇందులోని ఐదు కథలతో ఐదు సినిమాలు చూస్తున్న అనుభూతి కలుగుతుందని శివాత్మిక (Shivathmika Rajashekar) అన్నారు. 
‘పంచతంత్రం’ సినిమా చూస్తుంటే ఇందులోని ఐదు కథలతో ఐదు సినిమాలు చూస్తున్న అనుభూతి కలుగుతుందని శివాత్మిక (Shivathmika Rajashekar) అన్నారు. 

కెరీర్ మొదట్లో అందమైన పాత్రల్లో నటిస్తూ ఆడియెన్స్‌లో క్రేజ్ తెచ్చుకోవాలని చాలా మంది హీరోయిన్స్ ప్రయత్నిస్తుంటారు. అందుకు తగ్గట్లే మంచి గుర్తింపు వచ్చే వరకు స్కిన్ షోకు పెద్దగా అడ్డు చెప్పరు. కెరీర్ గ్రాఫ్ పీక్స్‌లో ఉన్న సమయంలో పెద్ద హీరోల సరసన నటిస్తారు. ఆ తర్వాత అవకాశాలు తగ్గినప్పుడు చిన్నాచితకా పాత్రల్లో నటించేందుకూ ఓకే అంటారు. కానీ కొందరు కథానాయికలు మాత్రం దీనికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తారు. నటనకు ప్రాధాన్యం ఉన్న కథలను ఎంచుకుంటూ తమ కెరీర్లను వినూత్నంగా మలుచుకుంటారు. 

కథానాయకుల సరసన నటిస్తూనే విమెన్ ఓరియంటెడ్ కథల్లోనూ యాక్ట్ చేసేందకు కొందరు హీరోయిన్స్ ఆసక్తి చూపిస్తారు. కథ, పాత్ర నచ్చితే చిన్న చిత్రమైనా చేసేందుకు సై అంటారు. నయనతార, అనుష్క, సమంత, నిత్యామీనన్ లాంటి నాయికలు ఈ కోవలోకే వస్తారు. పెద్ద హీరోల సరసన నటిస్తున్నా.. అవకాశం దొరికినప్పుడల్లా మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో వారు నటించారు. అలాగే స్కిన్ షో కంటే క్యారెక్టర్‌కు ఉన్న ప్రాధాన్యం గురించే ఆ హీరోయిన్లు ఎక్కువగా ఆలోచించారని వారి సినిమాలు చూస్తే అర్థమవుతుంది. స్టార్ హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక రాజశేఖర్ (Shivathmika Rajashekar) కూడా ఈ బాటలోనే ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తోంది. 

దొరసాని’ మూవీతో తెరంగేట్రం చేసిన శివాత్మిక.. అందులో నటనకు గానూ మంచి పేరు సంపాదించారు.

కథా బలం ఉన్న సినిమాలను ఎంచుకుంటూ తన కెరీర్‌ను చక్కగా ప్లాన్ చేసుకోవాలని శివాత్మిక రాజశేఖర్ భావిస్తున్నారు. అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రల్లో నటించేందుకు ఆమె ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ‘దొరసాని’ మూవీతో తెరంగేట్రం చేసిన శివాత్మిక.. అందులో నటనకు గానూ మంచి పేరు సంపాదించారు. ప్రస్తుతం ‘రంగమార్తాండ’, ‘పంచతంత్రం’ సినిమాల్లో ఆమె యాక్ట్ చేస్తున్నారు. వీటిలో ‘రంగమార్తాండ’ను ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ‘పంచతంత్రం’ (Panchatantram Movie) రిలీజ్ కు ముస్తాబవుతోంది. సృజన్–అఖిలేష్ నిర్మించిన ఈ చిత్రానికి హర్ష పులిపాక దర్శకత్వం వహించారు. బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్, దివ్య శ్రీపాద ఇందులో కీలక పాత్రల్లో నటించారు. 

‘పంచతంత్రం’ చిత్రం డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో శివాత్మిక కన్నీళ్లు పెట్టుకోవడం ఆసక్తికరంగా మారింది. శివాత్మిక మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో నేను పోషించిన ‘లేఖ’ క్యారెక్టర్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. ఈ చిత్రంలో ఐదు కథలను చూస్తుంటే .. ఐదు సినిమాలను చూస్తున్నట్లుగా ఉంటుంది. బ్రహ్మానందం, స్వాతి లాంటి ఆర్టిస్టులతో కలసి నటించడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ మూవీతో మా అందరికీ సక్సెస్ రావాలి. అందువల్ల ఈ సినిమా తప్పకుండా ఆడాలండీ బాబూ’ అంటూ ఆమె ఏడ్చేశారు. 

Read more: Telugu Actress - ఈ ఏడాది టాలీవుడ్‌లోకి అరంగ్రేటం చేసిన హీరోయిన్లపై ప్రత్యేక కథనం...

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!