త్వరలో ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనున్న డైరెక్టర్ కృష్ణవంశీ (Krishna Vamsi).. రూ.300 కోట్ల బడ్జెట్‌తో ప్రాజెక్ట్‌

Updated on Jul 04, 2022 03:04 PM IST
డైరెక్టర్ కృష్ణవంశీ (Krishna Vamsi), ఓటీటీ లోగోస్
డైరెక్టర్ కృష్ణవంశీ (Krishna Vamsi), ఓటీటీ లోగోస్

టాలీవుడ్‌లో తెలుగు సంస్కృతి, సాంప్రదాయం ఉట్టిపడేలా సినిమాలు తీసే దర్శకుల్లో కృష్ణవంశీ కూడా ఒకరు. ఆయన సినిమా ఎప్పుడెప్పుడు రిలజ్ అవుతుందా? అని ప్రేక్షకులు ఎదురుచూసేవారు. కృష్ణవంశీ సినిమాలు అంతగా ఆకట్టుకునేవి.  విభిన్నమైన కథ, నేపథ్యంతో  సినిమాలను తెరకెక్కిస్తుంటారు.

‘గులాబి’ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కృష్ణవంశీ.. మొదటి సినిమాతోనే జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. నాగార్జునతో తెరకెక్కించిన ‘నిన్నే పెళ్లాడతా’ సినిమాకు నేషనల్ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత సింధూరం, అంత:పురం వంటి సినిమాలతో స్టార్ డైరెక్టర్‌‌గా పేరు సంపాదించుకున్నారు.

2002వ సంవత్సరంలో వచ్చిన ‘ఖడ్గం’ సినిమాతో మరో బ్లాక్‌బస్టర్‌‌ హిట్ అందుకున్నారు కృష్ణవంశీ. కాజల్‌ హీరోయిన్‌గా చేసిన 'చందమామ 'కూడా మంచి విజయాన్నే సాధించింది. మహాత్మ సినిమాకు మంచి టాక్‌ వచ్చినా.. కృష్ణవంశీ రేంజ్ హిట్‌ సాధించలేదు. ఇక, ఆ తర్వాత వచ్చిన సినిమాలు కూడా బాక్సాఫీస్‌ దగ్గర నిలబడలేదు. 

రంగమార్తాండ, నటసామ్రాట్ సినిమా పోస్టర్లు

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో..

కృష్ణవంశీ (Krishna Vamsi) మార్కు సినిమాతో పాటు, ఆ రేంజ్ హిట్‌ కోసం ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ‘రంగమార్తాండ’ సినిమాను తెరకెక్కించారు. మరాఠీలో బంపర్ హిట్ అయిన ‘నట్‌ సామ్రాట్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ చాలాకాలం క్రితమే పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

కాగా, కృష్ణవంశీ త్వరలో ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఇటీవల జరిగిన ఒక మీడియా సమావేశంలో దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఓటీటీలో ఒక ప్రాజెక్టు చేయాలని అనుకుంటున్నట్టు చెప్పారాయన. అన్నీ కుదిరితే వచ్చే సంవత్సరంలోపే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నట్టు తెలిపారు.

రూ.200 కోట్లు నుంచి రూ.300 కోట్ల బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించనున్నట్టు వెల్లడించారు కృష్ణవంశీ. మనం ఏది తీయాలని అనుకుంటే అది తీసే స్వేచ్ఛ ఓటీటీలో ఉంటుందని , రూల్స్ పాటించాల్సిన అవసరం కూడా ఉండదని కూడా కృష్ణవంశీ (Krishna Vamsi) ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ‘రంగమార్తాండ‘ సినిమా తర్వాత ‘అన్నం’ పేరుతో సినిమాను తెరకెక్కిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.

Read More: ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ (Tollywood) సెలబ్రిటీలు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!