ఇండస్ట్రీకి నంబర్ వన్ హీరో అవుతానని అన్నయ్య చిరంజీవి (Chiranjeevi) అప్పుడే అన్నారు: సోదరుడు నాగబాబు (Nagababu)

Updated on Aug 22, 2022 04:04 PM IST
మెగా కార్నివాల్‌లో చిరంజీవి (Chiranjeevi) జీవితంలో జరిగిన విషయాలను పంచుకున్న నాగబాబు (Nagababu)
మెగా కార్నివాల్‌లో చిరంజీవి (Chiranjeevi) జీవితంలో జరిగిన విషయాలను పంచుకున్న నాగబాబు (Nagababu)

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఈ పేరు చెబితే తెలియనివాళ్లు ఉండరంటే అతి శయోక్తి కాదు. సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్‌‌గా, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ రియల్ హీరోగా ఎదిగిన చిరంజీవి నేడు 67వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు.

మెగాస్టార్ బర్త్‌డే కార్నివాల్‌ వేదికపై చిరంజీవి సోదరుడు నాగబాబు (Nagababu) పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 21 సంవత్సరాల వయసులో యాక్టింగ్‌ నేర్చుకోవడానికి, సినిమా అవకాశాల కోసం మద్రాసు వెళ్లిన చిరంజీవికి ఎదురైన సంఘటన గురించి తెలియజేశారు.

‘21 సంవత్సరాల వయసున్న ఒక యువకుడు అద్దె గదిలో ఇద్దరు స్నేహితుల (సుధాకర్‌, హరిప్రసాద్‌)తో కలిసి ఉంటున్నారు. అప్పట్లో మాకేమీ తాతలు పంచిన ఆస్తి లేదు. తండ్రి ఇచ్చిన కోట్లు లేవు. ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్‌లో సాధారణ జీతానికి పనిచేసే ఓ పోలీస్‌, నెలకు రూ.200 మద్రాస్‌ పంపిస్తే.. ఫిల్మ్‌ స్కూల్‌లో చేరి జీవనాన్ని సాగించిన వ్యక్తి మా అన్నయ్య చిరంజీవి. వాళ్ల గది పక్కనే పూర్ణ పిక్చర్స్‌ ఆఫీస్‌ ఉండేది. ఆ సంస్థ మేనేజర్‌ సుబ్రహ్మణ్యంగారు ఆయన భార్య.. సినిమాలంటే ఆసక్తి ఉన్న ఈ ముగ్గురిని ఇంట్లో బిడ్డల్లాగే చూసేవారు. వాళ్ల అబ్బాయి సూర్య కూడా ఈ ముగ్గురితో స్నేహంగా ఉండేవారు.

మెగా కార్నివాల్‌లో చిరంజీవి (Chiranjeevi) జీవితంలో జరిగిన విషయాలను పంచుకున్న నాగబాబు (Nagababu)

ప్రివ్యూ షోలో అవమానం..

 ఒక రోజు ముగ్గురు స్నేహితులను పిలిచి ఓ ప్రివ్యూ చూడమని థియేటర్‌లో కూర్చోబెట్టారు. ఆ సినిమా హీరో, ఆయనకు సంబంధించిన మనుషులు కూడా సినిమా చూడడానికి వచ్చారు. సీట్లు ఖాళీ లేకపోవడంతో అతిథులుగా వెళ్లిన చిరంజీవి, ఆయన మిత్రులను లేపి వెనుక నిలబెట్టారు. నిలబడి సినిమా చూసి, పూర్తయ్యాక బయటకు వచ్చారు.

సినిమా ఎలా ఉందో తెలుసుకోవడానికి అన్నయ్యకు కబురు పంపారు ఆవిడ. అప్పటికే కోపంతో ఉన్న అన్నయ్యను సినిమా ఎలా ఉందని అడగగానే ‘సినిమా బాగానే ఉంది కానీ.. మీ తరఫున వెళ్లిన మమ్మల్ని హీరోకు సంబంధించిన మనుషులు వచ్చారని గుమ్మం దగ్గర నిలబెట్టారు. బయటకు వచ్చేస్తే మీకు చెడ్డ పేరు వస్తుందేమో అని ఆలోచించాం ఆంటీ! వీళ్లందరికీ బాగా బలిసికొట్టుకుంటున్నారు అని అన్నయ్య అన్నారట. ‘ఆ హీరో అంతేలేవయ్యా.. నువ్వు పట్టించుకోకు’ అని అందట ఆంటీ. లేదు అంటీ అదంతా అహంకారం. ‘చూస్తూ ఉండండి ‘ఈ ఇండస్ట్రీకి నేను నంబర్‌వన్‌ హీరో కాకపోతే అడగండి’ అని అన్నయ్య ఆ రోజే అన్నారట.

మెగా కార్నివాల్‌లో చిరంజీవి (Chiranjeevi) జీవితంలో జరిగిన విషయాలను పంచుకున్న నాగబాబు (Nagababu)

విషయం విని షాకయ్యా..

ఆ విషయాన్ని సూర్య నాకు చెబితే షాకయ్యాను. ఇదే విషయం అన్నయ్యకు చెబితే నాకు గుర్తు లేదు అన్నారు. సినిమాల్లో యాక్ట్‌ చేద్దామని వచ్చిన ఒక కుర్రాడికి జరిగిన అవమానం అది. అప్పటికే ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ, శోభన్‌బాబు వంటి వాళ్లు స్టార్లుగా ఉన్నారు. ఆ సమయంలో ‘నేను నంబర్‌ వన్‌’ అవుతా అని ఒక కుర్రాడు అన్నాడంటే ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది.

యంగ్‌స్టర్స్‌కి చాలా గోల్స్‌ ఉంటాయి. మోటివేషన్‌, అచీవ్‌ చేయాలనే తపన ఉంటే ఏదైనా తప్పకుండా సాధిస్తారు. అన్నయ్య, ఆయన లైఫ్‌ కన్నా గొప్ప మోటివేషన్‌ ఏదీ ఉండదు. యంగస్టర్స్‌ ఏదైనా చేయాలనుకుంటే ఆలోచించండి.. సాధించడానికి ట్రై చేయండి.. చిరంజీవి గారిలా మీరు కూడా ఏదో ఒకరోజు సాధిస్తారు’ అని చిరంజీవి (Chiranjeevi) జీవితంలో జరిగిన ఒక సంఘటనను మెగా కార్నివాల్‌లో చెప్పుకొచ్చారు నాగబాబు (Nagababu). 

Read More : సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ వరకు : చిరంజీవి (Chiranjeevi) నటించిన టాప్ 10 సినిమాలు.. ఫ్యాన్స్‌కు ప్రత్యేకం !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!