గాడ్‌ఫాదర్‌‌ సినిమా పాట నుంచి చిరంజీవి (Chiranjeevi), సల్మాన్‌ఖాన్​ ఫోటోలు లీక్..ఎగ్జైట్ అవుతున్న ఫ్యాన్స్‌

Updated on Aug 05, 2022 10:41 AM IST
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలోని పాటలో సల్మాన్, చిరు గెటప్స్‌ వైరల్
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలోని పాటలో సల్మాన్, చిరు గెటప్స్‌ వైరల్

మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) న‌టిస్తున్న సినిమాల్లో గాడ్ ఫాద‌ర్ సినిమా ఒకటి. మోహ‌న్ రాజా ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. లూసిఫ‌ర్‌ సినిమాకు రీమేక్‌గా వ‌స్తున్న ఈ ప్రాజెక్టులో బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ముంబైలో వేసిన స్పెష‌ల్ సెట్స్‌లో స‌ల్మాన్, చిరంజీవిపై ఒక పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటలో చిరు, సల్మాన్‌ స్టిల్స్ ఇప్పటికే నెట్టింట్లో ట్రెండింగ్ అయ్యాయి.

తాజాగా చిరు – సల్మాన్  లీకైన స్టిల్స్‌ అంటూ ఒక లుక్ సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. చిరు, స‌ల్లూభాయ్ చేతుల్లో గ‌న్స్ ప‌ట్టుకుని స్టైలిష్‌గా క‌నిపిస్తున్న లుక్ చూసి ఎగ్జైట్‌ అవుతున్నారు అభిమానులు. గాడ్‌ఫాదర్ సినిమాలో సన‌య‌న‌తార ఫీ మేల్ లీడ్ రోల్‌లో న‌టిస్తుండ‌గా, స‌త్యదేవ్ కీలకపాత్ర పోషిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలోని పాటలో సల్మాన్, చిరు గెటప్స్‌ వైరల్

అక్టోబర్‌‌ 5వ తేదీన..

సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్, -కొణిదెల ప్రొడ‌క్షన్ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్న గాడ్‌ఫాదర్‌‌ సినిమాకు ఎస్‌ఎస్‌ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. అక్టోబర్‌‌ 5వ తేదీన గాడ్‌ఫాదర్ సినిమాను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. మెహ‌ర్ ర‌మేశ్ డైరెక్షన్‌లో భోళా శంకర్, బాబీ డైరెక్షన్‌లో మెగా 154 సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. మెగా 154 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న చిరంజీవి (Chiranjeevi) సినిమాకు వాల్తేరు వీర‌య్య టైటిల్‌ను ప‌రిశీలిస్తున్నారు మేక‌ర్స్.

Read More : God Father Update: 'గాడ్ ఫాదర్'లో సల్మాన్ ఖాన్, చిరంజీవితో (Chiranjeevi) కలిసి స్టెప్పులేయిస్తున్న ప్రభుదేవా!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!