చిరంజీవి (Chiranjeevi) ఫస్ట్‌ లవ్ సెవెన్త్‌ క్లాస్‌లోనే స్టార్ట్‌ అయ్యిందట.. మనసులో మాట బైటపెట్టిన మెగాస్టార్

Updated on Aug 01, 2022 08:41 PM IST
మెగా లాల్ చడ్డా ప్రోగ్రామ్ ప్రోమోలో చిరంజీవి (Chiranjeevi), ఆమిర్‌‌ ఖాన్, నాగార్జున, నాగచైతన్య
మెగా లాల్ చడ్డా ప్రోగ్రామ్ ప్రోమోలో చిరంజీవి (Chiranjeevi), ఆమిర్‌‌ ఖాన్, నాగార్జున, నాగచైతన్య

‘ఏడో తరగతిలో ఉన్నప్పుడే నా మొదటి ప్రేమ కథ మొదలైంది. అప్పట్లో ఒక అమ్మాయిని బాగా ఇష్టపడ్డాను’ అని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) చెప్పారు. ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన సినిమా ‘లాల్ సింగ్ చడ్డా’. ఈ సినిమాను తెలుగులో చిరంజీవి సమర్పిస్తున్నారు.

చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా కింగ్ నాగార్జున.. హీరో ఆమిర్ ఖాన్, చిరంజీవి, నాగచైతన్యను ‘మెగా లాల్ చడ్డా’  అనే ప్రోగ్రామ్‌లో ప్రత్యేక ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూ ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ ప్రోమోలో చిరంజీవిని ఆమిర్ ఖాన్ ‘ఫస్ట్ లవ్’ గురించి చెప్పాలని కోరారు.

‘ఏడో తరగతిలో ఉండగానే నాకో ప్రేమకథ ఉంది. అప్పట్లో నేనొక అమ్మాయిని ఎంతో ఇష్టపడ్డాను. అమ్మాయిలు సైకిల్ తొక్కడాన్ని మొగల్తూరులో అందరూ ఆశ్చర్యంగా చూసేవారు. నేను సైకిల్ తొక్కడానికి ఆ అమ్మాయి ఎంతో సాయం చేసేది. అలా సైకిల్ తొక్కే సమయంలో.. సైకిల్‌పై కంటే కూడా ఆమెపైనే నా దృష్టి ఎక్కువగా ఉండేది. అది ఆ అమ్మాయి గమనించి.. ‘అటు కాదు.. ఇటు చూడు‘ అనేది..’ అని చిరు తన చిన్ననాటి ప్రేమకథను చెప్పుకొచ్చారు.

ముగ్గురు స్టార్స్‌ని ఇంటర్వ్యూ చేయడం అద్భుతంగా ఉందని నాగార్జున ఈ ప్రోగ్రామ్‌లో అన్నారు. అలాగే ‘ఒక స్టార్ ముందు ఇలా మేం ముగ్గురం కూర్చోవడం, మాకెంతో సంతోషంగా ఉందని‘ చిరంజీవి (Chiranjeevi) సమాధానమిచ్చారు. తర్వాత ఆమిర్ ఖాన్ సినిమాల్లో ‘ఏ సినిమాను మీరు రీమేక్ చేయాలని అనుకుంటున్నారు?‘ అని చిరంజీవిని నాగార్జున అడిగారు. ‘సమస్యే లేదు.. నేను ఏ సినిమాను రీమేక్ చేయలేను’ అని చిరంజీవి బదులిచ్చారు.

లాల్‌ సింగ్‌ చడ్డా సినిమా పోస్టర్

ఫస్ట్‌ టేక్‌కి ఓకే కాదుగా..

వెంటనే ఆమిర్ కల్పించుకుని.. 'నేను మీతో సినిమా చేయాలని అనుకుంటున్నాను. అది డైరెక్టర్‌గా అయినా ఓకే.. నిర్మాతగా అయినా ఓకే..’ అని అన్నారు. 'టేక్ 1 ఓకే కాదు కదా..’ అని చిరంజీవి బదులివ్వగా.. ‘ప్రొడక్షన్ వరకు ఓకే కానీ.. డైరెక్షన్ మాత్రం ఒప్పుకోవద్దని’ నాగార్జున సలహా ఇచ్చారు

ఈ ప్రోగ్రామ్‌లో ‘లాల్ సింగ్ చడ్డా’కు సంబంధించిన అనేక విషయాలను ఆమిర్ చెప్పారు. అలాగే ‘ఒక యాక్టర్‌‌గా.. నేను పనిచేసే నటీనటులు, సాంకేతిక నిపుణుల దగ్గర ఎంతో కొంత నేర్చుకునేందుకు ప్రయత్నిస్తుంటాను’ అని నాగచైతన్య తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), నాగార్జున, ఆమిర్‌‌ ఖాన్, నాగచైతన్యను ఒకే స్టేజీపై చూడటం సంతోషంగా ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Read More : 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!