మహేష్‌బాబు (MaheshBabu) ‘సర్కారు వారి పాట’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్‌ గెస్ట్‌గా మాస్‌ డైరెక్టర్‌‌

Updated on May 05, 2022 01:25 PM IST
మహేష్‌బాబు (MaheshBabu), పూరి జగన్నాథ్‌ వర్కింగ్ స్టిల్స్‌
మహేష్‌బాబు (MaheshBabu), పూరి జగన్నాథ్‌ వర్కింగ్ స్టిల్స్‌

సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu), కీర్తి సురేష్ జంటగా నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా ఈనెల 12న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌ కూడా జోరుగానే సాగుతున్నాయి. పరశురాం దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

 ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు చీఫ్‌ గెస్ట్‌గా మాస్‌ డైరెక్టర్ హాజరుకాబోతున్నారనే వార్తలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఆ చీఫ్ గెస్ట్‌ ఎవరనే దానిపై అందరికీ ఆసక్తి నెలకొంది. ఒకే ఒక్క హిట్‌ సినిమాతో మహేష్‌ గ్రాఫ్‌ను అమాంతం పైకెత్తి, ఇండస్ట్రీని షేక్‌ చేసిన ‘పోకిరి’ సినిమా తీసిన పూరి జగన్నాధ్‌ అని టాక్. పూరీ, మహేష్‌ కాంబినేషన్‌లో వచ్చిన పోకిరి, బిజినెస్‌మ్యాన్‌ ఏ రేంజ్‌లో హిట్‌ టాక్‌ సొంతం చేసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పోకిరి రికార్డులను బద్దలు కొట్టింది.

ప్రస్తుతం మహేశ్ బాబు.. పరశురామ్ దర్శకత్వంలో చేసిన సర్కారు వారి పాట సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో కీర్తి సురేశ్ కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్ పూర్తికావడం, మే 12న రిలీజ్‌కు రెడీ కావడంతో మహేష్ కుటుంబంతో కలిసి దుబాయ్‌కి వెళ్లారు. హైదరాబాద్‌ ఎయిర్‌‌పోర్ట్​కు వెళ్లిన మహేష్‌బాబు ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక, మహేష్‌బాబు తర్వాతి సినిమా రాజమౌళితో చేయబోతున్నారు. ‘సర్కారు వారి పాట’ సినిమా రిలీజ్ అయిన తరువాత తన తదుపరి చిత్ర షూటింగ్‌ను స్టార్ట్ చేయనున్నట్టు సమాచారం. ఈ చిత్రం తర్వాత మహేశ్ (MaheshBabu).. త్రివిక్రమ్ డైరక్షన్‌లో ఓ సినిమా చేయడానికి పచ్చజెండా ఊపారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్​పైకి వెళ్లనుంది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!