మ‌హేష్ బాబును కొట్టాన‌ని.. ఫీల్ అవుతున్న కీర్తి సురేష్ (Keerthy Suresh)

Updated on May 04, 2022 07:59 PM IST
కీర్తి సురేష్(Keerthy Suresh) న‌ట విశ్వ‌రూపం ఏంటో ఒక్క మ‌హాన‌టి సినిమాతో తెలిసిపోయింది. కీర్తి హిట్ సినిమాల‌తో స్టార్ డ‌మ్ సొంతం చేసుకున్నారు. మ‌హేష్ బాబు చెంప‌పై కొట్టాన‌ని కీర్తి సురేష్ ఫీల్ అయిపోతున్నారు. స‌ర్కారువారి పాట సినిమా ప్రమోషన్స్‌లో కీర్తి సురేష్ చెప్పిన మాట‌లు వైర‌ల్ అయ్యాయి. 
కీర్తి సురేష్(Keerthy Suresh) న‌ట విశ్వ‌రూపం ఏంటో ఒక్క మ‌హాన‌టి సినిమాతో తెలిసిపోయింది. కీర్తి హిట్ సినిమాల‌తో స్టార్ డ‌మ్ సొంతం చేసుకున్నారు. మ‌హేష్ బాబు చెంప‌పై కొట్టాన‌ని కీర్తి సురేష్ ఫీల్ అయిపోతున్నారు. స‌ర్కారువారి పాట సినిమా ప్రమోషన్స్‌లో కీర్తి సురేష్ చెప్పిన మాట‌లు వైర‌ల్ అయ్యాయి. 

కీర్తి సురేష్ (Keerthy Suresh) న‌ట విశ్వ‌రూపం ఏంటో ఒక్క మ‌హాన‌టి సినిమాతోనే లోకానికి తెలిసిపోయింది. ఈమె సూపర్ హిట్ సినిమాల‌తో ఒక స్టార్ డ‌మ్ సొంతం చేసుకున్నారు. అయితే, ఈ మధ్యకాలంలో ఈమెకు సంబంధించి ఓ న్యూస్ వైరల్ అయ్యింది. ఓ సీన్ షూటింగ్ సందర్భంగా, ప్రిన్స్ మ‌హేష్ బాబు చెంప‌పై కొట్టాన‌ని కీర్తి సురేష్ ఫీల్ అయిపోతున్నారట. స‌ర్కారు వారి పాట సినిమా ప్రమోషన్స్‌లో కీర్తి సురేష్ చెప్పిన ఈ మాట‌లు వైర‌ల్ అయ్యాయి. 

గీత గోవిందం ఫేమ్ పరుశురామ్ "స‌ర్కారు వారి పాట" సినిమాను డైరెక్ట్ చేశారు. ఈ చిత్రంలో కీర్తిసురేష్, మ‌హేష్ బాబు హీరో హీరోయిన్ల‌ుగా న‌టిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యర్నేని, రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట .. ఈ సినిమాను నిర్మించారు. 

ఇటీవలే స‌ర్కారు వారి పాట ట్రైల‌ర్ రిలీజ్ అయింది. యూట్యూబ్‌లో మిలియ‌న్ల వ్యూస్‌తో టాప్ వ‌న్‌లో ట్రెండ్ అవుతోంది. స‌ర్కారు వారి పాట సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా మే 12న రిలీజ్ కానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్ల జోరు పెంచారు.

Keerthy Suresh Latest Stills

సినిమా ప్ర‌మోష‌న్ కోసం వ‌చ్చిన కీర్తి సురేష్ (Keerthy Suresh)  ఎన్నో ఆస‌క్తి క‌లిగించే విష‌యాలు చెప్పారు. మ‌హేష్ బాబుతో నటించేటప్పుడు జ‌రిగిన కొన్ని అంశాలను షేర్ చేశారు. డాన్స్ వేసేట‌ప్పుడు టైమింగ్ మిస్  కావడంతో, మ‌హేష్ బాబు చెంప‌పై కొట్టాన‌న‌న్నారు. మూడు సార్లు మ‌హేష్ బాబును అనుకోకుండా చెంప‌పై కొట్టాన‌ని చెప్పుకొచ్చారు. ఆయనకు "సారీ కూడా చెప్పాన‌ని.. త‌న‌పై కోపం వ‌చ్చిందా అని" అడిగానని తెలిపారు. అయితే  మ‌హేష్ బాబు మాత్రం ఈ విషయాన్ని చాలా లైట్ తీసుకున్నార‌ట‌. ఎలాంటి కోపం తెచ్చుకోకుండా చాలా కూల్‌గా క‌నిపించార‌ట‌. 

 

 

Sarkaru Vaari Paata Movie Still

ఈ ఘటన జరిగాక కీర్తి సురేష్ (Keerthy Suresh) టెన్ష‌న్ ప‌డ్డాన‌ని చెప్పారు. ప్రిన్స్‌కు మూడు సార్లు సారీ చెప్పేవ‌ర‌కు, త‌న మ‌న‌సు కుదుట ప‌డ‌లేద‌న్నారు. పరుశురామ్ తన సినిమాలలో హీరోయిన్ పాత్ర‌కు ప్రాధాన్యం ఇస్తార‌ని.. అందుకే ఈ సినిమాను ఓకే చేశాన‌ని తెలిపారు కీర్తి సురేష్. ఇక మహేష్ బాబు..  త్రివిక్రమ్, రాజమౌళిలతో కొత్త‌ సినిమాలు చేయనున్నారు. 

 

Keerty Suresh Photo Still

కీర్తి సురేష్  వైవిధ్యమైన పాత్రలో న‌టించిన‌ "చిన్ని" సినిమా మే 6న ఓటీటీలో రిలీజ్ కానుంది. రివేంజ్ డ్రామా థిల్ల‌ర్‌గా "చిన్ని" సినిమా కథ ఉంటుందని అంటున్నారు నిర్మాతలు. ఇక కీర్తి సురేష్, ద‌ర్శ‌కుడు సెల్వా రాఘ‌వ‌న్ న‌టించిన త‌మిళ్‌ సినిమా "సాని కాదియ‌మ్". దీనినే తెలుగులో "చిన్ని"గా విడుద‌ల చేస్తున్నారు. ఇప్పటికే మహానటి సినిమాలో నటనకు గాను నేష‌న‌ల్ అవార్డు సాధించిన కీర్తి సురేష్‌కు.. కొత్త సినిమాలు ఎలాంటి అవార్డులు తెచ్చిపెట్ట‌నున్నాయో చూడాలి మరి. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!