మహేష్‌బాబు (Mahesh Babu) చేతుల మీదుగా.. ‘జయమ్మ పంచాయితీ’ లేటెస్ట్ ట్రైలర్ రిలీజ్

Updated on May 05, 2022 11:58 AM IST
జయమ్మ పంచాయితీ సినిమా కొత్త ట్రైలర్ రిలీజ్ చేసిన మహేష్‌బాబు (Mahesh Babu)
జయమ్మ పంచాయితీ సినిమా కొత్త ట్రైలర్ రిలీజ్ చేసిన మహేష్‌బాబు (Mahesh Babu)

యాంకర్​గా తన మాటలతో ఆకట్టుకునే సుమ ‘జయమ్మ పంచాయితీ’తో నటనలోనూ తనేమీ తక్కువ కాదంటోంది. నాన్స్టాప్ మాటలు, పంచులతో టాలీవుడ్​లో రిలీజయ్యే దాదాపు అన్ని సినిమాల ప్రమోషన్ ఈవెంట్లని విజయవంతంగా చేస్తూ, రెండు దశాబ్దాలకుపైగా బెస్ట్ యాంకర్​గా రాణిస్తోంది సుమ కనకాల. 

సుమ  ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం జయమ్మ పంచాయతీ. చాలా కాలం తర్వాత ఈ సినిమాతో థియేటర్లలో సందడి చేయబోతోంది సుమ. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ మరియు సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే… ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా విడుదలైన ట్రైలర్.. సినిమాపై మరింత ఉత్సుకతను కలిగించింది.

ఈ సినిమా మే 6 తేదిన థియేటర్లలో సందడి చేయనుంది.  ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్లలో టాలీవుడ్​లోని హీరోలందరూ పాల్గొన్నారు. తాజాగా ఆ జాబితాలో సూపర్‌‌స్టార్ మహేష్ బాబు (MaheshBabu) కూడా చేరిపోయారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండగా చిత్రబృందం మరో ట్రైలర్​ను మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల చేయించింది. 

2 నిమిషాల రెండు సెకండ్ల నిడివి గల జయమ్మ పంచాయతీ ట్రైలర్‌.. "పెద్దనాన్న, పెదనాన్న.. జయమ్మత్త వస్తుంది" అనే డైలాగ్‌తో ఆరంభం అవుతుంది. '

"పిల్ల ఫంక్షన్ చేసి.. వచ్చిన చదివింపులతో.. మా ఆయనకు ఆపరేషన్ చేయించేస్తాను',

'పిల్ల పెద్దమనిషవడం, డాక్టర్ ఆపరేషన్ అనడం అంత ఆ దేవుడి ప్లాన్ లాగే ఉంది',

'ఆ పిల్లెవరో గానీ. బాబునిక ఆ శివుడే కాపాడాలి',

'మళ్లీ ఆ బోస్ గాడు ఇటుదిక్కు కనబడితే కాళ్లు ఇరగ్గొడతానని చెప్పండి',

'వస్తా.. నీ ఇంటికొస్తా, నట్టింటికొస్తా.. నీ కళ్ల ముందే నీ కూతురితో మాట్లాడతా' అనే డైలాగ్స్ బాగున్నాయి.

జయమ్మ పంచాయితీ ట్రైలర్‌లో ఎమోషన్స్, డైలాగ్స్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ సినిమాలో సుమ తన సహజ నటనతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరకానున్నారు. గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిన్నట్లుగా ట్రైలర్‏లోనే చూపించారు. అనారోగ్యంగా ఉన్న భర్త.. కూతురు లవ్ మధ్య నలిగిపోయే సాధారణ గృహిణి పాత్రను సుమ పోషిస్తుందని.. ట్రైలర్ చుస్తే అర్ధమవుతోంది. అంతేకాదు వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకునేందుకు గ్రామంపై కూడా ఆమె పోరాటానికి సిద్ధమవుతుంది.

తాజాగా విడుదలైన ట్రైలర్ మరింత ఆసక్తిగా ఉందని చెప్పాలి. ఇందులో బలమైన భావోద్వేగాలతో కూడుకున్న సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సినిమాలో సుమ తన సహజ నటనతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరకానున్నట్లుగా తెలుస్తోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు మరింత చేరువ చేయనున్నట్లుగా ప్రమోషన్స్ షురు చేశారు మేకర్స్.

ఈ చిత్రానికి అనూష్ కుమార్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు స్వీకరించగా.. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై బలగ ప్రకాష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్‌గా ధను అండ్లూరి, ఎడిటర్‌గా రవితేజ గిరిజాల బాధ్యతలు నిర్వహించారు. ఇక ట్రైలర్ కూడా బాగుండడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా కోసం ఇప్పటికే నాగార్జున, నాని, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు (Mahesh Babu) తమవంతు ప్రచారం చేశారు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!