‘మదర్స్ డే’ సందర్భంగా తల్లి నమ్రత గురించి అనేక విషయాలు పంచుకున్న సూపర్ స్టార్ మహేష్‌బాబు (MaheshBabu) కూతురు సితార

Updated on May 08, 2022 11:36 PM IST
తల్లి నమ్రతా శిరోద్కర్‌‌తో మహేష్‌బాబు (MaheshBabu) కూతురు సితార
తల్లి నమ్రతా శిరోద్కర్‌‌తో మహేష్‌బాబు (MaheshBabu) కూతురు సితార

సూపర్​స్టార్​ మహేష్​ బాబు (MaheshBabu)​ గారాల పట్టి సితార. తొమ్మిదేళ్లకే తనకంటూ ఓ సొంత ఇమేజ్​ క్రియేట్​ చేసుకుని మిలియన్లలో అభిమానులను సంపాదించుకుంది ఈ  స్టార్​కిడ్.  చిన్నప్పటినుంచే అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న సితార తాజాగా మదర్స్​ డే సందర్భంగా తల్లి నమ్రత గురించి పలు విషయాలను పంచుకుంది.

‘మదర్స్​ డే సందర్భంగా అమ్మ కోసం స్పెషల్‌ గిఫ్ట్‌ ఒకటి ప్లాన్‌ చేశాను. అది సర్‌ప్రైజ్‌. అలాగే ఆదివారం మొత్తం అమ్మతో స్పెండ్‌ చేయాలని డిసైడ్‌ అయ్యాను. మమ్మీ అని పిలవడం కంటే అమ్మా అని పిలిపించుకోవడమే అమ్మకి ఇష్టం. అమ్మ చాలా స్వీట్​. కొన్ని సందర్భాల్లో మాత్రమే స్ట్రిక్ట్​గా ఉంటుంది.  స్కూల్‌ నుంచి రాగానే హోమ్‌వర్క్‌కి స్పెషల్‌గా టైమ్‌ ప్లాన్‌ చేస్తుంది. ఆ టైమ్‌కి మేం హోమ్‌వర్క్‌ చేసేలా చూస్తుంది. ఇక పెయింటింగ్, డాన్సింగ్‌... ఇంకా స్కూల్‌ యాక్టివిటీస్‌ అన్నింటిలోనూ పార్టిసిపేట్‌ చేసేలా అమ్మ ప్రోత్సహిస్తుంది. చదువుని నిర్లక్ష్యం చేస్తే అస్సలు ఊరుకోదు. నాకేదైనా కావాలన్నప్పుడు అమ్మ ‘నో’ చెబితే అప్పుడు నాన్నకు కంప్లైంట్‌ చేస్తాను. అన్నయ్య, నేను  ఇద్దరం అంటే అమ్మకి చాలా ప్రేమ. కానీ నేను చిన్నదాన్ని కాబట్టి నన్ను ఎక్కువగా గారాబం చేస్తుంది. ఇతరుల పట్ల దయగా ఉండాలని, పెద్దలకు గౌరవం ఇవ్వాలని ఎప్పుడూ చెబుతుంది’ అంటూ చెప్పుకొచ్చింది సితార.

అలాగే తనకి చిన్నప్పటినుంచీ ట్రెడిషనల్​ డ్రెస్​లంటే ఇష్టమనీ, పండగల గురించి అమ్మ ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నానంటోంది.  ‘‘నువ్వు మా అమ్మలా ఉన్నావు’ అని నాన్న ఎప్పుడూ నాతో అంటుంటారు. బాగా ముద్దు చేస్తారు కూడా. కానీ నేను మా అమ్మలా కూడా ఉన్నానని అనుకుంటున్నాను. యూట్యూబ్​ చానల్​ వీడియోస్​ కోసం అమ్మ బోలెడన్ని ఐడియాలు ఇస్తుంది. అది మాత్రమే కాదు.. షూట్‌ విషయంలో కూడా హెల్ప్‌ చేస్తుంది. సర్కారువారి పాట సినిమాలో చేసిన డాన్స్​ చూసి ‘నేను గర్వపడేలా చేశావు అంటూ హత్తుకుంది’ అంటూ తల్లితో ఉన్న అనుబంధాన్ని పంచుకుంది సితార.

 

ఇటీవ‌ల మ‌హేష్ న‌టించిన స‌ర్కారు వారి పాట కోసం పెన్నీ అనే ప్రమోష‌న‌ల్ సాంగ్ చేసింది. ఇది ఎంత‌గానో ఆక‌ట్టుకుంది.ఇక కూచిపూడి డ్యాన్స్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోని మ‌హేష్ షేర్ చేశాడు. చిన్న వయసులోనే తనకంటూ ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహించడమేకాకుండా, తన డాన్స్ వీడియోలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది మహేష్ (MaheshBabu)​ ముద్దుబిడ్డ సితార. చిన్నారి తెరంగేట్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!