వెకేషన్‌లో కూతురు సితారతో మహేష్‌బాబు (Mahesh Babu).. ఇన్‌స్టాలో పిక్‌ షేర్‌‌ చేసిన సూపర్‌‌స్టార్

Updated on May 05, 2022 12:01 PM IST
ఇన్‌స్టాగ్రామ్‌లో మహేష్‌బాబు (MaheshBabu) షేర్‌‌ చేసిన ఫోటో
ఇన్‌స్టాగ్రామ్‌లో మహేష్‌బాబు (MaheshBabu) షేర్‌‌ చేసిన ఫోటో

సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే. విదేశాలకు ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళుతుంటాడు ప్రిన్స్ మహేష్‌బాబు (Mahesh Babu). భార్య నమ్రత, కొడుకు గౌతమ్‌, కూతురు సితారలతో కలిసి హాలీడేస్ ఎంజాయ్ చేస్తుంటాడు ఈ సూపర్‌‌స్టార్‌‌. మహేష్ నటించిన సర్కారు వారి పాట సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌ జరుపుకుంటున్న ఈ సినిమాకు పరశురాం దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇక, షూటింగ్ పూర్తికావడంతో ప్యారిస్‌ వెళ్లిన మహేష్‌బాబు.. ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవలే కూతురు సితారతో కబుర్లు చెబుతూ సేద తీరుతున్న ఫోటోను తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో షేర్‌‌ చేశాడీయన. కూతురుతో కబుర్లు చెప్పడానికి ప్యారిస్‌ కంటే మంచి ప్లేస్ ఉంటుందా అని ఆ ఫోటోకు కామెంట్‌ను కూడా జత చేశాడు. మంచం మీద రిలాక్స్ అవుతూ.. పక్కన సితారతో కబుర్లు చెబుతున్న మహేష్‌ బెడ్‌పై పిల్లి కూడా ఉంది. కుటుంబంతోపాటు వెకేషన్‌కు వెళ్లే  మహేష్‌బాబు.. అక్కడ తీసుకునే ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్ చేస్తుంటాడు.

ఇదిలాఉండగా.. మహేష్‌బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా ట్రైలర్ ఇటీవలే రిలీజై బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. మే 12న సినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో, ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ ఇప్పటికే మొదలుపెట్టింది. ప్యారిస్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత, మహేష్ బాబు ప్రమోషన్స్‌లో పాల్గొనే చాన్స్‌ ఉందని టాక్. ఇటీవల రిలీజైన సర్కారు వారి పాట సినిమా ట్రైలర్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. ట్రైలర్‌‌లో మహేష్‌బాబు స్వాగ్, డైలాగ్స్, యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. 

పరశురాం దర్శకత్వం వహించిన సర్కారు వారి పాట సినిమాలో మహేష్‌బాబు పక్కన కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌‌టైన్‌మెంట్స్, 14 రీల్స్‌ ప్లస్ బ్యానర్లపై  నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్, రామ్‌ ఆచంట, గోపీచంద్ ఆచంట తదితరులు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!