అలా ఎందుకు జరిగిందో తెలియక.. యూనిట్‌ మొత్తం షాక్‌ అయ్యింది: మహేష్‌బాబు (MaheshBabu)

Updated on May 24, 2022 05:15 PM IST
సక్సెస్‌ మీట్‌లో డ్యాన్స్‌ చేస్తున్న మహేష్‌
సక్సెస్‌ మీట్‌లో డ్యాన్స్‌ చేస్తున్న మహేష్‌

సూపర్​స్టార్‌ మహేష్‌బాబు (MaheshBabu) హీరోగా, కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటించిన కొత్త సినిమా 'సర్కారు వారి పాట'. పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 12న రిలీజై హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్ర యూనిట్‌ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తోంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూసి మహేష్‌బాబు ఎంతో సంతోషిస్తున్నారు. ఈ క్రమంలో హీరోయిన్ కీర్తి సురేష్‌, డైరెక్టర్‌ పరశురామ్‌తో కలిసి పలువురు యూట్యూబర్లతో మహేష్‌బాబు చిట్‌చాట్ చేశారు.  

చిట్‌చాట్‌లో భాగంగా కర్నూలులో జరిగిన విజయోత్సవ సభ గురించి చర్చకు వచ్చింది. 'సభలో స్టేజ్‌ పైకి ఎక్కి డ్యాన్స్‌ చేశారు కదా. అసలు అలా ఎందుకు చేశారు?' అని మహేష్‌బాబును ప్రశ్నించారు. దానికి మహేష్‌ సమాధానమిచ్చాడు. 'అది ఎందుకు జరిగిందో నాకు కూడా తెలియదు. అసలు ఏం జరుగుతుందో తెలియక మా టీమ్‌ మొత్తం షాక్‌ అయ్యింది. అందరూ సర్‌ప్రైజ్‌ అయ్యారు. రెండు సంవత్సరాలు కష్టపడి సినిమా చేశాం. దానికి అభిమానుల నుంచి వస్తున్న ఆదరణ చూశాక.. స్టేజ్‌పైకి ఎక్కి డ్యాన్స్‌ చేయాలనిపించింది. అలా చేసేశా.' అని సమాధానం ఇచ్చాడు సూపర్‌‌స్టార్.

కాగా 'సర్కారు వారి పాట' రిలీజైన మొదటి రోజు నుంచే పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 160.2 కోట్ల గ్రాస్‌, రూ.100.44 కోట్ల షేర్‌ సాధించి రికార్డు సృష్టించింది. ఐదు రోజుల్లో రూ. 100 కోట్ల షేర్‌ సాధించిన తొలి ప్రాంతీయ చిత్రంగా రికార్డుకెక్కింది.

మ‌హేష్‌బాబు న‌టించిన 27వ సినిమా ‘స‌ర్కారు వారి పాట’. మ‌హేష్ 28వ సినిమాను ద‌ర్శకుడు త్రివిక్రమ్‌తోనూ, 29వ చిత్రాన్ని రాజ‌మౌళితో చేయ‌నున్నాడు. ఎస్ఎస్ఎంబీ28 సినిమాపై తాజాగా అప్‌డేట్ వచ్చింది. మే 31న మ‌హేష్‌బాబు తండ్రి సూప‌ర్‌‌స్టార్ కృష్ణ పుట్టిన‌రోజు సందర్భంగా ఎస్ఎస్ఎంబీ28పై అప్‌డేట్ ఇస్తార‌ట‌. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ కూడా విడుద‌ల చేయనున్నార‌ని టాక్. 

మహేష్‌బాబు 28వ సినిమాను హాసినీ అండ్ హారిక క్రియేషన్స్ బ్యానర్​పై రూపొందించనున్నారు. మ‌హేష్‌ (MaheshBabu)కు జోడీగా పూజా హెగ్డే న‌టిస్తోంది. త‌మ‌న్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు 'పార్థు' అనే టైటిల్ ఖ‌రారు చేయనున్నట్టు తెలిసింది. 2022 జూలైలో సినిమా షూటింగ్ స్టార్ట్‌ అవుతుందని సమాచారం.  

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!