అలాంటి సీన్స్‌కు మహేష్‌బాబు (MaheshBabu) దూరంగా ఉంటే బెటర్ అంటున్న అభిమానులు!

Updated on May 15, 2022 07:20 PM IST
సుబ్బరాజు, మహేష్‌బాబు (MaheshBabu)
సుబ్బరాజు, మహేష్‌బాబు (MaheshBabu)

మహేష్‌బాబు (MaheshBabu) నటించిన సర్కారు వారి పాట సినిమా ఈనెల 12వ తేదీన రిలీజై బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా సెకండాఫ్‌లో మహేష్‌ చేసిన కొన్ని సన్నివేశాలపై అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అంతటి స్టార్ ఇమేజ్‌ ఉన్న హీరో అటువంటి సీన్లలో నటించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఒకసారి స్టార్‌‌ డమ్‌ వచ్చిన తర్వాత హీరోలు ఎంచుకునే కథలు, చేసే సన్నివేశాలపై ప్రత్యేక దృష్టి పెడుతూ ఉంటారు.

అటువంటి విషయాల్లో మహేష్‌ మరింత శ్రద్ద తీసుకుంటూ ఉంటాడు. తన యాక్టింగ్‌ కారణంగా సమాజంపైనా, అభిమానులపైనా  ఎటువంటి ప్రతికూల ప్రభావం లేకుండా ఉండేందుకు ప్రయత్నిస్తుంటాడు. అదే సమయంలో సమాజానికి ఉపయోగపడే పనులు, సమాజ శ్రేయస్సుకు సంబంధించిన అంశాల ప్రాతిపదికగా సినిమాలు చేస్తుంటాడు కూడా. తన సినిమాల ద్వారా అభిమానులకు మంచి మెసేజ్‌లు కూడా ఇస్తుంటాడు.

శ్రీమంతుడు, భరత్‌ అనే నేను, మహర్షి అదే కోవలోకి చెందినవి కాగా.. తాజాగా వచ్చిన ‘సర్కారు వారి పాట’ సినిమా కూడా సమాజానికి మంచి విషయాన్ని తెలియజేసేదిగానే ఉండడం గమనార్హం. సినిమా హిట్‌, ఫ్లాప్‌ టాక్‌తో సంబంధం లేకుండా సమాజానికి ఉపయోగపడే కథలనే సెలెక్ట్‌ చేసుకుంటుంటాడు మహేష్. ఇక, సర్కారు వారి పాట సినిమాలో మహేష్‌ చేసిన కొన్ని సీన్లపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మహేష్‌బాబు, కీర్తి సురేష్, సుబ్బరాజు కాంబినేషన్‌లో సినిమా సెకండాఫ్‌లో వచ్చిన సీన్లు కొంచెం ఎబ్బెట్టుగా ఉన్నాయని ఆరోపిస్తున్నారు.

ముఖ్యంగా ఒక సన్నివేశంలో మహేష్‌బాబు (MaheshBabu), సుబ్బరాజుపై మూత్రం పోసే సీన్‌ ఉంది. ఆ సీన్‌ను డైరెక్ట్‌గా చూపించకున్నా.. దానిపై పలువురు అభ్యంతరం తెలుపుతున్నారు. మహేష్‌బాబు లాంటి స్టార్ డమ్‌ ఉన్న హీరో ఇటువంటి సీన్లకు దూరంగా ఉంటే బెటర్‌‌ అని అభిప్రాయపడుతున్నారు. పరశురామ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘సర్కారు వారి పాట’ సినిమా ఇప్పటికే వంద కోట్లు వసూలు చేసింది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!