మరోసారి ఫ్యామిలీతో విదేశాలకు మహేష్‌బాబు (MaheshBabu).. ‘సర్కారు వారి పాట’ సక్సెస్‌ను ఎంజాయ్ చేయడానికే

Updated on May 24, 2022 10:27 AM IST
ఎయిర్‌‌పోర్ట్‌లో మహేష్‌బాబు (MaheshBabu)
ఎయిర్‌‌పోర్ట్‌లో మహేష్‌బాబు (MaheshBabu)

‘సర్కారు వారి పాట’ సినిమాతో సమ్మర్‌ సెన్సేషనల్‌ సక్సెస్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు (MaheshBabu). ఆయన నటించిన ‘సర్కారువారి పాట’ బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబడుతూ సూపర్‌హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ‘పోకిరి’ తర్వాత అదే స్థాయిలో మహేష్‌ నుంచి సినిమా రావడంతో సూపర్‌స్టార్‌ అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేయడానికి ఫ్యామిలీతో కలిసి మహేశ్‌బాబు విదేశాలకు వెళ్లాడు. కుటుంబంతో కలిసి యూరప్‌ ట్రిప్‌కు వెళ్లినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

 ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్‌ పూర్తైన వెంటనే మహేష్‌.. కుటుంబంతో కలిసి కొన్నిరోజులపాటు ప్యారిస్‌ వెళ్లి వచ్చాడు. ఆ టూర్‌ ముగించుకుని వచ్చి సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్నాడు మహేష్. సినిమా రిలీజ్‌ అయ్యి సక్సెస్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ఇప్పుడు మరోసారి ఫ్యామిలీతో టూర్‌‌ వెళ్లాడు. దీంతో ‘వచ్చారు.. ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు.. మళ్లీ వెళ్లారు’ అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ టూర్‌ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మహేష్‌ తన తదుపరి సినిమా పనుల్లో బిజీ కానున్నట్లు సమాచారం. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా షూటింగ్‌లో పాల్గొంటాడని టాక్. ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే ఇప్పటికే సెలెక్ట్‌ అయ్యింది.

టాలీవుడ్ టాప్ హీరో మ‌హేష్ బాబు, మాట‌ల మాంత్రికుడిగా పేరున్న ద‌ర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్  కాంబోలో వ‌చ్చిన మొద‌టి సినిమా 'అత‌డు'. ప్రిన్స్ న‌టించిన 'అత‌డు' సినిమా సూప‌ర్ హిట్ అయింది. ఉత్తమ దర్శకుడిగా త్రివిక్రమ్‌కు, ఈ చిత్రం ఫిల్మ్ ఫేర్ అవార్డును అందించింది.  

ఆ త‌ర్వాత వీరిద్దరి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సినిమా 'ఖ‌లేజా'. ఈ సినిమా కూడా ప్రేక్షకుల‌ను మెప్పించింది. ఇప్పుడు మ‌హేష్ 28 వ సినిమాను త్రివిక్రమ్ ద‌ర్శక‌త్వంలో.. హ్యాట్రిక్ హిట్ కొట్టేలా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. 

'స‌ర్కారు వారి పాట' మ‌హేష్ బాబు (MaheshBabu) న‌టించిన 27వ సినిమా. కాగా,  28వ సినిమాను త్రివిక్రమ్‌తో, 29వ చిత్రాన్ని రాజ‌మౌళితో చేయ‌నున్నారు. మే 31న మ‌హేష్ బాబు తండ్రి సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన‌రోజు సందర్భంగా ఎస్ఎస్ఎంబీ 28 పై  అప్‌డేట్ ఇవ్వనున్నారని, సినిమా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయనున్నారని టాక్. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!