తన కూతురు సితార పెద్ద హీరోయిన్​ అవుతుందంటున్న సూపర్ స్టార్​ మహేష్​ బాబు(MaheshBabu)

Updated on May 09, 2022 06:47 PM IST
సూపర్‌‌స్టార్‌‌ మహేష్‌బాబు (MaheshBabu), సితార ఘట్టమనేని
సూపర్‌‌స్టార్‌‌ మహేష్‌బాబు (MaheshBabu), సితార ఘట్టమనేని

కూతురు సితార గురించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్​ మీడియాలో అభిమానులతో పంచుకుంటూనే ఉంటారు సూపర్​ స్టార్​ మహేష్​ బాబు(Mahesh Babu) చిన్నప్పటి నుంచే స్టార్​ కిడ్​గానే కాకుండా తనకూ ప్రత్యేకంగా ఇమేజ్​ సాధించుకుంది సితార. తరచూ తండ్రి మహేష్​ నటించిన పలు సినిమాల్లోని పాటల వీడియోలతో పాటు ఇతర ట్రెండింగ్​ పాటలకు వీడియోలు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మహేష్​ సితారకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.  
సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్‌ జంటగా నటించిన తాజా చిత్రం ‘సర్కారువారి పాట’.పరశురామ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన ట్రైలర్‌, కళావతి సాంగ్స్‌ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేస్తున్నాయి.  మే 12న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌ జోరు పెంచింది చిత్ర బృందం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేశ్‌ బాబు ఈ సినిమా సహా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.పెన్నీ సాంగ్‌లో కూతురు సితార పర్‌ఫార్మెన్స్‌ గురించి అడగ్గా.. మహేశ్‌ మాట్లాడుతూ.. అది తమన్‌ ఆలోచన అని, నమ్రతతో ఈ విషయం గురించి చెప్పేలోపు తమన్‌ నమ్రతని అడిగాడని చెప్పారు. ఇక ఈ సినిమాలో సితార డ్యాన్స్‌ ఎండ్‌ టైటిల్స్‌లో అయినా కనిపిస్తుందా అని అడగ్గా.. 'మేకింగ్‌ వీడియోలో అనుకున్నాం. ఇప్పటికే ప్రింట్స్‌ యూఎస్‌కి వెళ్లిపోయాయి. అయినా దయచేసి ఇవన్నీ అడగకండి. ఇప్పటికే సినిమాల్లో ఎందుకు లేను అని సితర అడుగుతుంది. కానీ పర్‌ఫార్మన్స్‌ పరంగా తను నన్ను చాలా గర్వపడేలా చేసింది. నాకు తెలిసి తను భవిష్యత్తులో పెద్ద హీరోయిన్‌ అవుతుంది' అంటూ కూతురు టాలెంట్​ గురించి చెబుతూ మురిసిపోయాడు మహేష్​.
సూపర్​ స్టార్​ పిల్లలు గౌతమ్​, సితార గురించిన విషయాలను వారి తల్లి నమ్రత సోషల్​ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూనే ఉంటారు. వారూ తమ అకౌంట్ల ద్వారా అభిమానులను పలకరిస్తూనే ఉంటారు. అయితే వీరిద్దరినీ సినిమాల్లోకి ఎప్పుడు తీసుకొస్తారనే దాని గురించి అభిమానుల్లో ఇప్పటికే చర్చ మొదలైంది. మహేష్​ కొడుకు గౌతమ్​ వన్​ నేనొక్కడినే చిత్రంలో హీరో చిన్నప్పటి పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కూతురు సితార కూడా మహేష్​ తాజా చిత్రం సర్కారువారి పాటలో ఓ పాటలో కనపడనుందని తెలుస్తోంది. అయితే పూర్తిస్థాయిగా వీరిని సినిమాల్లో నటింపచేస్తే బాగుంటుందని అభిమానుల కోరిక. తాజాగా మహేష్​ సితార తప్పకుండా పెద్ద హీరోయిన్​ అవుతుందని చెప్పడంతో అభిమానులు సంతోషిస్తున్నారు.
సరిలేరు నీకెవ్వరులో మహేష్ బాబుతో మైండ్ బ్లాక్ స్టెప్పులు వేయించిన శేఖర్ మాస్టర్.. ఇప్పుడు సర్కారు వారి పాటలో చాలా స్టైలిష్ స్టెప్ ఒకటి వేయించాడు. ఇది విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తుంది. చాలా మంది రీల్స్ చేసి పెడుతున్నారు కూడా. సెన్సేషనల్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన కళావతి పాటని థమన్ అత్యద్భుతంగా కంపోజ్ చేసాడు. విజువల్‌గానూ ఈ పాటకు మంచి అప్లాజ్ వస్తుంది. ఇప్పటికే 30 మిలియన్ వ్యూస్ దాటిపోయింది కళావతి పాట. ఈ సాంగ్‌లో మహేష్ చేసిన ‘కళావతి’ ఐకానికా స్టెప్‌ను ఆయన కూతురు సితార రీ క్రియేట్ చేసింది.అందులో కూతురు డాన్సులు చూసిన మహేష్ బాబు మురిసిపోయాడు. నా కంటే బాగా చేసావ్ పాప అంటూ మెచ్చుకున్నాడు. కూతురు చేసిన ఈ అద్భుతమైన వీడియోను షేర్ చేయడమే కాకుండా ఆనందం వ్యక్తం చేసాడు. నిజంగానే మహేష్ బాబు(Mahesh Babu) కంటే పర్ఫెక్టుగా ఈ స్టెప్పులు వేసింది సితార పాప. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి, 14 రీల్ ప్లస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మే 12న ఈ చిత్రం విడుదల కానుంది. గీత గోవిందం తర్వాత పరశురామ్ నుంచి వస్తున్న సినిమా ఇది. మరోవైపు మహేష్ బాబు కొన్నేళ్లుగా బ్లైండ్ ఫామ్‌లో ఉన్నాడు. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో హ్యాట్రిక్ కూడా అందుకున్నాడు. దాంతో సర్కారు వారి పాటపై అంచనాలు భారీగానే ఉన్నాయి. సెన్సార్​ బోర్డు యూ/ఎ సర్టిఫికెట్​ ఇవ్వడమే కాకుండా మంచి కంటెంట్​ ఉందని కితాబివ్వడంతో భారీ హైప్​ క్రియేట్​ అవుతోంది.
 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!