సెన్సార్ పూర్తి చేసుకున్న మహేష్ బాబు (MaheshBabu) ‘సర్కారువారి పాట’

Updated on May 09, 2022 03:46 PM IST
‘సర్కారు వారి పాట’లో మహేష్‌బాబు (MaheshBabu), కీర్తి సురేష్
‘సర్కారు వారి పాట’లో మహేష్‌బాబు (MaheshBabu), కీర్తి సురేష్

టాలీవుడ్​ సూపర్​స్టార్​ మహేష్​ (Mahesh babu) నటించిన తాజా చిత్రం సర్కారువారి పాట. దర్శకుడు పరశురామ్​ రూపొందిన ఈ చిత్రం భారీ అంచనాలతో మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా సర్కారువారి పాట సెన్సార్​పూర్తయినట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీయమ్బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్‌పై సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. కీర్తిసురేశ్ కథానాయికగా నటించగా.. నదియా, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. సముద్రఖని విలన్‌గా నటించారు.

ఇదివరకే విడుదలైన ఈ సినిమా టీజర్, సింగిల్స్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరో రెండు రోజుల్లో చిత్రం విడుదల కానుండడంతో ప్రచారాలు జోరుగా సాగిస్తున్నారు మేకర్స్. ఇటీవల ‘సర్కారువారి పాట’  చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ వారు ఈ సినిమాకి యూ / ఏ సర్టిఫికెట్ జారీచేశారు. చిత్రం రన్ టైమ్ ను 2 గంటల 43 నిమిషాలకు సెట్ చేశారు. ఇక ఈ సినిమాకి వచ్చిన సెన్సార్ రివ్యూ అభిమానుల ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేస్తోంది.

అంతేకాదు ఈ సినిమా ఔట్‌పుట్‌కు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సెన్సార్​ బోర్డు సభ్యులు అభినందనలు తెలిపారు. అలాగే సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించారు. చిత్రం ఫస్టాఫ్ అంతా బ్లాక్ బస్టర్ కంటెంట్‌తో ఉందని, క్లైమాక్స్ అయితే అద్భుతంగా వచ్చిందని తెలిపారు. యాక్షన్ సీక్వెన్సెస్ చిత్రానికే హైలైట్ అవుతాయని చెబుతున్నారు. ఇక మహేశ్ బాబు (Mahesh babu) పెర్ఫార్మెన్స్ అయితే అభిమానులు పండగ చేసుకొనే స్థాయిలో ఉందని, తమన్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉందని  తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం సెన్సార్ రివ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్​ చూస్తే మహేశ్‌బాబు ఇందులో ఫుల్‌ ఎనర్జీతో నటించారని అర్థమవుతోంది.‘నేను విన్నాను.. నేను ఉన్నాను’, ‘100 వయాగ్రాలు వేసుకుని శోభనానికి రెడీ అయిన పెళ్లి కొడుకు గదికి వచ్చినట్లు వచ్చారు’ అంటూ డైలాగ్‌లు మహేశ్‌ అభిమానులతో విజిల్స్‌ వేయిస్తున్నాయి.   బ్యాంకు రుణాలు, ఆర్థికలావాదేవీల ఇతివృత్తంగా పరశురామ్‌ ‘సర్కారువారి పాట’ సినిమాను పరశురామ్​ రూపొందిచారు.

మహేష్​ కెరీర్​లోనే ఇది మరో బిగ్గెస్ట్ హిట్ అవుతుందని నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు. ‘సరిలేరు నీకెవ్వురు’  బ్లాక్ బస్టర్ తర్వాత మహేశ్ బాబు, ‘గీతగోవిందం’ పరశురామ్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో ‘సర్కారువారి పాట’  చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే.. కీర్తిసురేశ్ తొలిసారిగా మహేశ్ (MaheshBabu) సరసన జోడీగా నటించనుండడంతో  మరింత హైపు క్రియేట్ అయింది. బ్యాంకింగ్ స్కామ్ నేపథ్యంలో ఆసక్తికరమైన కథాకథనాలతో రూపొందుతున్న ‘సర్కారువారి పాట’ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!