టాలీవుడ్‌లోనే ఉంటా.. బాలీవుడ్‌ మూవీ చేసే ఆలోచన లేదన్న సూపర్‌‌స్టార్‌‌ మహేష్‌బాబు (MaheshBabu)

Updated on May 11, 2022 10:52 PM IST
‘సర్కారు వారి పాట’ సినిమా ప్రమోషన్స్​లో మహేష్‌బాబు (MaheshBabu)
‘సర్కారు వారి పాట’ సినిమా ప్రమోషన్స్​లో మహేష్‌బాబు (MaheshBabu)

టాలీవుడ్‌ సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu). మహేష్‌ హీరోగా తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇటీవలే ప్యారిస్ నుంచి తిరిగి వచ్చిన సూపర్‌‌స్టార్ ప్రమోషన్స్‌లో బిజీబిజీగా ఉన్నాడు. ఒక కార్యక్రమంలో విలేకరులు అడిగిన ప్రశ్నకు మహేష్‌ సమాధానాలిచ్చారు.

టాలీవుడ్‌లోని టాప్‌ స్టార్లు అందరూ ఇప్పటికే  పాన్ ఇండియా సినిమాలు చేసి విజయాలు అందుకున్నారు. ప్రభాస్, ఎన్టీఆర్, రాంచరణ్, అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమాలు చేశారు. ఇక, పవన్‌ కల్యాణ్, మహేష్‌బాబు మాత్రమే పాన్‌ ఇండియా సినిమాలు ఇప్పటివరకు చేయలేదు. ఈ క్రమంలో పవన్‌ కల్యాణ్‌ ప్రస్తుతం చేస్తున్న ‘హరిహర వీరమల్లు’ పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల కాబోతోంది.

మహేష్‌ బాబు పాన్ ఇండియా సినిమా ఎప్పుడు చేయబోతున్నాడని ఆయన అభిమానులతోపాటు సినీ ప్రేమికులు కూడా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే సర్కారు వారి పాట సినిమా ప్రమోషన్స్‌లో పలువురు దీని గురించి ప్రశ్నించారు. ‘పాన్‌ ఇండియా విడుదలకు సరైన సినిమా కోసం ఎదురుచూస్తున్నాను. రాజమౌళితో చేయబోయే సినిమాను పాన్‌ ఇండియాగా విడుదల చేయడానికి కరెక్ట్‌ అని అనుకుంటున్నాను. త్రివిక్రమ్‌తో చేయనున్న సినిమా కూడా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. రాజమౌళి సినిమా కొన్నాళ్లు ఆలస్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బాలీవుడ్‌లో సినిమా చేసే ఆలోచన లేదు. టాలీవుడ్ హీరోగానే ఉండాలని అనుకుంటున్నాను’ అని మహేష్‌ చెప్పాడు.

మహేష్‌ – రాజమౌళి సినిమాకు సంబందించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోందని ఇటీవల విజయేంద్రప్రసాద్‌ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చే సినిమా 2023లో సెట్స్‌పైకి వెళ్లే చాన్స్‌లు ఉన్నాయి. కనుక పరిస్ధితులు అనుకూలిస్తే 2025లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే చాన్స్‌ ఉందని సమాచారం.

ఇక, పరశురామ్‌ దర్శకత్వంలో మహేష్‌బాబు (MaheshBabu) నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా ఈనెల 12న విడుదల కాబోతోంది. మహేష్‌ లుక్స్, డైలాగ్స్, థమన్ సంగీతం ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది. కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌‌ యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేసింది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!