మహేష్ బాబుతో నేను చేయించిన డ్యాన్స్ మామూలుగా ఉండదు : శేఖర్ మాస్టర్ (Sekhar Master)

Updated on May 04, 2022 08:46 PM IST
కొరియోగ్రాఫ‌ర్ శేఖ‌ర్ మాస్ట‌ర్. టాప్ హీరోల‌తో దిమ్మ‌దిరిగే డాన్స్‌లు చేయించి పాపుల‌ర్ అయ్యారు. స‌ర్కారు వారి పాట సినిమాలో మ‌హేష్ బాబు (Mahesh Babu)తో అదిరిపోయే డాన్సులు చేయించాన‌ని శేఖ‌ర్  అంటున్నారు.
కొరియోగ్రాఫ‌ర్ శేఖ‌ర్ మాస్ట‌ర్. టాప్ హీరోల‌తో దిమ్మ‌దిరిగే డాన్స్‌లు చేయించి పాపుల‌ర్ అయ్యారు. స‌ర్కారు వారి పాట సినిమాలో మ‌హేష్ బాబు (Mahesh Babu)తో అదిరిపోయే డాన్సులు చేయించాన‌ని శేఖ‌ర్ అంటున్నారు.

అదిరేటి స్టెప్పుల‌తో మాస్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్న కొరియోగ్రాఫ‌ర్ శేఖ‌ర్ మాస్ట‌ర్. టాప్ హీరోల‌తో దిమ్మ‌దిరిగే డాన్స్‌లు చేయించి పాపుల‌ర్ అయ్యారు. స‌ర్కారు వారి పాట సినిమాలో మ‌హేష్ బాబు(Mahesh Babu) తో బ్రేక్ డాన్సులు చేయించాన‌ని శేఖ‌ర్ మాస్ట‌ర్ అంటున్నారు. మ‌హేష్ బాబు స్టైల్‌లోనే స్పెష‌ల్ స్టెప్పులు డిజైన్ చేశాన‌ని శేఖ‌ర్ మాస్ట‌ర్ చెప్పారు. కీర్తి సురేష్‌, మ‌హేష్ బాబుల క‌ళావ‌తి సాంగ్ శేఖ‌ర్ మాస్ట‌ర్ కంపోజ్ చేసిందే. 

మ‌హేష్ స్టైల్‌లోనే స్పెష‌ల్ స్టెప్పులు డిజైన్ చేశాను: శేఖ‌ర్ మాస్ట‌ర్

స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాకు కొరియోగ్రాఫ‌ర్‌గా శేఖ‌ర్ మాస్ట‌ర్ వ‌ర్క్ చేశారు. ఆ సినిమాలో శేఖ‌ర్ మాస్ట‌ర్ మ‌హేష్ బాబు కోసం కంపోజ్ చేసిన స్టెప్పులు ఆడియ‌న్స్‌ను ఆక‌ట్టుకున్నాయి. స‌ర్కారు వారి పాట సినిమాలో కూడా శేఖర్ మ‌హేష్ బాబుతో చాలా వెరైటీ స్టెప్పులు వేయించార‌ట‌. ఇదే క్రమంలో మ‌హేష్ బాబు సాంగ్స్ షూటింగ్ విశేషాల‌ను శేఖ‌ర్ మాస్ట‌ర్ షేర్ చేసుకున్నారు. 

టాలీవుడ్ కొరియోగ్రాఫ‌ర్ల‌లో శేఖ‌ర్ మాస్ట‌ర్ డాన్స్‌కు ఉన్న‌క్రేజే వేరు. స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాలో మైండ్ బ్లాక్ పాట‌కు కొరియోగ్రాఫ‌ర్ శేఖ‌ర్ మాస్ట‌రే. ఆ పాట దుమ్ము లేపింది. స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాలో క‌ళావ‌తి, పెన్నీ పాట‌లకు కూడా శేఖ‌ర్ మాస్ట‌రే డాన్స్ కంపోజ్ చేశారు. క‌మాన్ .. క‌మాన్.. క‌ళావ‌తి సాంగ్‌లో మ‌హేష్ డాన్స్ అంద‌రికీ తెగ న‌చ్చేసింది. స‌ర్కారు వారి పాట సినిమాలో మొత్తం మూడు పాట‌లకు శేఖ‌ర్ మాస్ట‌ర్ కొరియోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. మాస్ సాంగ్ ఒక‌టి మ‌హేష్‌తో చేయాల్సి ఉంద‌న్నారు. ఈ సాంగ్ నిజంగానే దుమ్ము రేపుతుంద‌ని శేఖ‌ర్ మాస్ట‌ర్ అంటున్నారు. 

ఏ పాటకైనా సరే.. కాస్టూమ్స్, బ్యాక్ గ్రౌండ్, లొకేష‌న్ అన్ని కొరియోగ్రాఫ‌రే చూసుకోవాల‌ని శేఖ‌ర్ మాస్టర్ అన్నారు. మ‌హేష్ బాబు ఎంత క‌ష్ట‌మైన స్టెప్పులైనా చేసేస్తాన‌ని త‌న‌తో అన్నార‌న్నారు. డాన్స్ విష‌యంలో మ‌హేష్ బాబు (Mahesh Babu) చాలా శ్ర‌ధ్ధ తీసుకుంటార‌ని.. ఎలాంటి స్టెప్పు అయినా ఆయన చాలా త్వ‌ర‌గా చేసేస్తార‌న్నారు. 

 

మ‌హేష్ స్టైల్‌లోనే స్పెష‌ల్ స్టెప్పులు డిజైన్ చేశాను: శేఖ‌ర్ మాస్ట‌ర్

మ‌హేష్(Mahesh Babu) డాన్స్ చేశాక‌.. బాగుందా అని అడుగుతార‌ని శేఖ‌ర్ చెప్పారు. ఒక వేళ న‌చ్చ‌క పోతే మ‌ళ్లీ మ‌ళ్లీ చేద్దామ‌ని చెప్తుంటార‌ట‌. డాన్స్‌తో పాటు విజువ‌ల్ ఎఫెక్ట్ కూడా తానే చూసుకుంటాన‌ని... పాట‌లో రిథ‌మ్ బ‌ట్టే  కొరియోగ్రాఫ్ చేస్తామ‌న్నారు. పాన్ ఇండియా సినిమాలైనా, లోక‌ల్ స్టైల్ స్టెప్పులుండాల‌న్నారు. కొత్త కొత్త స్టెప్పులు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంటాయి. ఇంత‌కు ముందు  డాన్స‌ర్లు త‌క్కువ‌గా ఉండేవారు. చెన్నై వాళ్లు వ‌చ్చి కొరియోగ్రాఫ‌ర్లుగా వ‌ర్క్ చేసేవాళ్లు. ఇప్పుడు అలా కాదు. మ‌న‌వాళ్లు చాలా మంది కొరియోగ్రాఫ‌ర్ల‌గా మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ప్ర‌స్తుతం చిరంజీవి, ర‌వితేజ‌, శింభు, శివ‌కార్తికేయ సినిమాల‌కు వ‌ర్క్ చేస్తున్నాన‌ని శేఖ‌ర్ మాస్ట‌ర్ చెప్పుకొచ్చారు.

 

మ‌హేష్ స్టైల్‌లోనే స్పెష‌ల్ స్టెప్పులు డిజైన్ చేశాను: శేఖ‌ర్ మాస్ట‌ర్

శేఖ‌ర్ మాస్ట‌ర్‌కు రాజమౌళి సినిమాల‌కు కొరియోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేయాల‌ని ఉంద‌ట‌. అంతేకాదు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో కూడా త‌న‌దైన స్టైల్లో డాన్సులు చేయించాల‌ని కోరిక‌ట‌. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!